శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 20, 2020 , 23:01:54

కడిగేద్దాం కరోనాను

కడిగేద్దాం కరోనాను

మూతికి..

ముసుగేసుకున్నంత మాత్రాన

మాటలో మాధుర్యం తగ్గిపోదు!

చెయ్యెత్తి.. 

దండం పెట్టుకున్నంత మాత్రాన

షేక్‌హ్యాండ్‌ స్పర్శ ఆగిపోదు!

గలీమిలేలు లేనంత మాత్రాన

బంధంలో గాఢత్వం సమసిపొదు!

బ్రతకాలంటే భరించాలి

లేదంటే.. 

గాంధీ క్వారంటైన్‌ అనుభవించాలి!

అదా, ఇదా అన్నదే 

ఇప్పుడు అగత్యం

లేకుంటే జీవిత సమస్తం 

అగమ్యగోచరం!

దూసుకొస్తున్న వైరస్‌ కాలంలో

తియ్యకు నీ ఒంపుసొంపుల బైకు

వెళ్లకు తనువంత కాలిపోయి

కూలిపోయే కాటి వైపు!

వైకుంఠమే మూతేసిన కాలంలో

మనిషి మనిషి మాట్లాడితే

కష్టమైన సందర్భంలో

గుంపులో గోవిందవైపోకు

కరోనా కాటుకు బలి కాకు!

భౌతికదూరం అనుకోకు భారం

అదిప్పుడు వందేండ్ల

జీవితానికి మిగిలిన ఏకైక మార్గం!

రోహిత్‌ శర్మ స్కోరు

పెరిగినట్టు పెరుగుతుంది

కరోనా మహమ్మారి క్రమం..

తలుపులేసుకొని ఇట్లుంటే

తప్పుతుంది కదా ప్రాణగండం

సర్కార్‌ చెప్పినట్టు వింటే

నీకు చెయ్యెత్తి దండం

లేదంటే నీ బ్రతుకు

అంపశయ్యకు కోదండం!

సామాజిక దూరంలో 

సచ్చిపోని ప్రేమను వెతుక్కో

లేదంటే..

శవాల దిబ్బల్లో 

నీ వాళ్లను దేవులాడుకో

ఏదిష్టమో నీకు నువ్వే నిర్ణయించుకో

ఆకలైతే అన్నం పెట్టే సర్కారుండగా

నేనున్నాననే మనిషి నమ్మకానికి

ఐఎస్‌ఐ ముద్ర లాంటి

కేసీఆర్‌ అండ ఉండగా

ఎందుకింత ఆగమాగం..!

ఇల్లే కదా స్వర్గం

నీ ప్రాణాలను రక్షించే 

అతిపెద్ద దుర్గం..

పెద్దాయన విన్నపాన్ని పాటిద్దాం..

నూరేండ్ల బతుకును ఆస్వాదిద్దాం...


logo