శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 20, 2020 , 23:00:56

మనిషే జయిస్తాడు

మనిషే జయిస్తాడు

లక్షల సంవత్సరాల మానవ ప్రస్థానంలో

ఎన్నెన్ని విలయాలు-ఎన్నెన్ని ప్రళయాలు

ఎన్ని సంఘర్షణలు-ఎన్ని సంక్షోభాలు

ఎన్నెన్ని యుద్ధాలు-ఎనెన్ని మరణాలు

ఎన్నెన్ని వికృతులు-ఎన్ని విస్మయాలు..!

గుండెనిబ్బరం ఉన్న మనిషే ఎదిరించాడు

మనిషే జయించాడు..

కరాళ నృత్యం చేసిన-కలరాను ఓడించిన

పీనుగుల దిబ్బలు పేర్చిన-ప్లేగును పూడ్చేసిన

స్లో పాయ్‌జన్‌ వంటి వ్యాధి

స్వైన్‌ ఫ్లూను తరిమేసిన

దర్జాగా విహరించిన

డెంగ్యూ మెడలు వంచిన

వ్యాధుల నిర్మూలించే వైద్యం కనిపెట్టాడు

మనిషే జయించాడు..

విశ్వమంత వ్యాపించిన వైరస్‌-విధిస్తున్న శిక్ష

కంటికి కనబడని శత్రువు-కరోనా ఇప్పుడొక పరీక్ష

వ్యాధికి ఆమడదూరం-ముందస్తు జాగ్రత్త మేలు

ఇంటిపట్టునే ఉంటూ- విజృంభణనాపవచ్చు

కాలయముడు కరోనాపై

మనిషే జయిస్తాడు..

విషయవాయువు వైరస్‌పై

విజయం సాధిస్తాడు...


logo