శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 17, 2020 , 09:04:34

కంటికి రెప్పలా సంరక్షణ

కంటికి రెప్పలా సంరక్షణ

కరోనా వైరస్‌ కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. యావత్‌ ప్రపంచం వణికిపోతున్న తరుణంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఏ పిలుపునిచ్చినా విజయవం తం చేసే ప్రజలు ఆయన సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో దేశం కన్నా మన రాష్ట్రంలోనే పకడ్బందీ చర్యలకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూను 14 గంటలు చేపడితే, రాష్ట్రంలో 24 గంటలు కర్ఫ్యూను పాటించారు. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆశా వర్కర్లను పురమాయించి ప్రణాళికాబద్ధంగా పనిచేయిస్తున్నారు.

విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌, క్వారంటైన్‌ కేంద్రాలు, శాస్త్రవేత్తలతో కమి టీ ఏర్పాటుచేసి కరోనాను కట్టడి చేసేందు కు అహర్నిశలు పనిచేస్తున్నారు. కష్టకాలం లో ప్రజలను ఆదుకోవటంలో కూడా ఆదర్శమైన నిర్ణయాలతో కేసీఆర్‌ అందరి మన్ననలను పొందుతున్నారు.

క్షేత్రస్థాయిలో నిత్యావసరాలను తీరు స్తూ, ప్రజలు కరోనా బారిన పడకుండా ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500లు పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. ప్రజలను కరోనా బారి న పడకుండా కేసీఆర్‌ తీసుకుంటున్న చర్య లు ప్రధాని మోదీతో పాటు, అమిత్‌ షా లాంటి నేతల మన్ననలను అందుకుంటున్నాయి. వీటన్నింటికి తోడు రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, మున్సిపల్‌, ఐటీ శాఖామంత్రిగా కేటీఆర్‌ తీసుకుంటున్న చొరవ పలువురి ప్రశంస లందుకుంటున్నది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని  ఆదుకోవటంలో కేటీఆర్‌ ముందుంటున్నా రు. ట్విటర్‌, వాట్సాప్‌లలో సమాచారం అందిన వెంటనే వారిని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో యాసంగి పంట వరి దిగుబడిని ప్రభుత్వ మే కొనేందుకు నిర్ణయించి రైతులకు భరో సా కల్పించటం ముదావహం. ఇలా సమ స్త వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తూనే కరోనా మహమ్మారిని కట్టడి చేయటం కోసం కృషిచేస్తున్న కేసీఆ ర్‌ చరిత్రలో ప్రజా రక్షకుడిగా నిలిచిపోతార టనటంలో సందేహం లేదు.

(వ్యాసకర్త: రజక సంఘాల రాష్ట్ర కన్వీనర్‌)

కొండూరు సత్యనారాయణ


logo