శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Apr 14, 2020 , 23:02:26

వేలుపట్టి నడిపిస్తూ..

వేలుపట్టి నడిపిస్తూ..

తెలంగాణలో 2020, మార్చి 2న తొలి కరోనా కేసు నమోదైంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని మార్చి 6న జరిగిన బీఏపీ సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మార్చి 7న సీఏం కరోనాపై అసెంబ్లీలో మాట్లాడారు. మార్చి 13న అసెంబ్లీలో కరోనాపై విస్తృత చర్చ జరిగింది.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికంటే ముందు నిర్ణయించారు. మార్చి 14 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. విద్యాసంస్థలు, సినిమాహా ళ్లు, ఫంక్షన్‌హాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు మూసివేశారు. బస్సులు, రైళ్లను బందుపెట్టారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని మార్చి 24న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 19 నుంచి రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా ఏర్పాటుచేసింది. ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి రాకపోకలు బందయ్యాయి. విదేశాల నుంచి వచ్చే విమానాలను బం దు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్చి 20న ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు. ఆయన వెం టనే స్పందించారు. అదేరోజు రాత్రి విదేశీ విమానాల రాకపోకలను బందు పెట్టారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వచ్చే రైళ్లను కూడా బందు పెట్టాలని కేసీఆర్‌ ముందే కోరారు.

లాక్‌డౌన్‌ వల్ల నిరుపేదలు ఆకలితో ఇబ్బంది పడవద్దని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.1,500 నగదు పంపిణీ చేస్తున్నట్టు మార్చి 22న ప్రకటించింది. దేశంలోని పేదలకు పది కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని  కేంద్ర ప్రభుత్వం మార్చి 25న ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీఎఫ్‌)ని ఏడాదిపాటు రద్దుచేసి, ఆ నిధులను కరోనా సహాయక చర్యలకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 25న నిర్ణయించింది. పార్లమెంట్‌ సభ్యులకిచ్చే నిధులను రెండేండ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 6న ప్రకటించింది.

వలసకూలీలను తెలంగాణ డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ అని కేసీఆర్‌ మార్చి 29న ప్రకటించారు. అప్పటికి దేశంలోని ఇతర రాష్ర్టా ల్లో వలస కూలీలను తమ సొంత రాష్ర్టాలకు తరుముతున్నారు. వలస కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 చొప్పున నగదు కూడా అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన తర్వాతే వలస కార్మికుల విషయంలో ఆయా రాష్ర్టాలు అవలంబిస్తున్న వైఖరిలో మార్పువచ్చింది. 

కరోనా కష్ట సమయంలో పేదలను ఆదుకునే కార్యక్రమాలు అమలుచేయడానికి వీలుగా ఆర్థిక వెసులుబాటు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, సివిల్‌ సర్వెంట్లు, ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాలని మార్చి 30న ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత అనేక రాష్ర్టాలు ఇదే విధానం అనుసరించాయి. ఎం పీల వేతనాల్లో, సివిల్‌ సర్వీస్‌ అధికారుల వేతనాల్లో కోత విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 6న నిర్ణయించింది. ‘మర్కజ్‌' ప్రార్థనల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరించడం దేశానికి ఎంతో ఉపయోగపడింది. మార్చి 18న కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి న తెలంగా ణ పోలీసులు వారి మూలాలను వెతికారు. వారు మార్చి 13-15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చారని, అక్కడే కరోనా సోకిందని గుర్తించా రు. వెంట నే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. మర్కజ్‌ వెళ్లి వచ్చేవారిని గుర్తించి, వైద్యం అందించడం ప్రారంభించాయి.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తొలి ఐదేండ్లలో ఒక్కొక్కటిగా ఆవిష్కరించిన అద్భుతాలను ఆశ్చర్యంగా చూసిన యావత్‌దేశం, ఇప్పుడు తెలంగాణ వంక ఎంతో ఆశగా చూస్తున్నది. జటి ల సమస్యను పరిష్కరించడానికి, సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటానికి అవసరమైన వెలుతురు తెలంగాణ నుంచి కచ్చితంగా ప్రసరిస్తుందని భారతావని భరోసాతో ఉన్నది. 

యాసంగిలో పండిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మార్చి 27న ప్రకటించింది. ఈ తర్వాతే ఇతర రాష్ర్టాలు పంటల కొనుగోలు అంశంపై దృష్టిపెట్టాయి. హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మోలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని మార్చి 20న కేసీఆర్‌ ప్రధాని దృష్టి కితెచ్చారు. కేసీఆర్‌ చూపిన చొరవ కారణంగా అక్కడ మార్చి 30 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్‌ 14తో ముగుస్తున్న లాక్‌డౌన్‌ గడువును పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏప్రిల్‌ 6న ప్రధానికి వినతి చేశారు. ఆ తర్వాత అనేక రాష్ర్టాలు అదే డిమాండ్‌ చేశా యి. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ అభిప్రాయంతో ఏకీభవించి లాక్‌డౌన్‌ను పొడిగించింది.

సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్‌ నిండు అసెంబ్లీలో తీవ్రంగా విబేధించారు. కరోనాపై పోరు విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలను అదే అసెంబ్లీలో గట్టి గా ఖండించారు. ఈ రెండు ఘటనలు కేవలం రెండురోజుల వ్యవధిలోనే జరిగాయి. విపత్తు ల సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి దేశమంతా ఒకటిగా కలిసినడువాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ ఎన్నడూ గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శించలేదు. పైన చెప్పిన ఉదంతాలన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తొలి ఐదేండ్లలో ఒక్కొక్కటిగా ఆవిష్కరించిన అద్భుతాలను ఆశ్చర్యంగా చూసిన యావత్‌దేశం, ఇప్పుడు తెలంగాణ వంక ఎతో ఆశగా చూస్తున్నది. జటిల సమస్యను పరిష్కరించడానికి, సం క్షోభాన్ని తట్టుకొని నిలబడటానికి అవసరమైన వెలుతురు తెలంగాణ నుంచి కచ్చితంగా ప్రసరిస్తుందని భారతావని భరోసాతో ఉన్నది. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, అది కచ్చితంగా ప్రజోపయోగకరమైనదిగా, ఆచరణనీయమైనదిగా ఉంటుందనే బలమైన భావన ఇవాళ దేశంలో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం తాను ప్రగతిబాటలో నడుస్తూ ఇతర రాష్ర్టాలను కూడా వేలుపట్టి నడిపిస్తున్నది. దేశానికి దారిచూపుతున్నది.


logo