బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Apr 14, 2020 , 23:01:00

అమెరికా అసమర్థత

అమెరికా అసమర్థత

ప్రపంచమంతా మనవైపు ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూస్తున్న ‘ప్రత్యేక పరిస్థితి’లో మనం ఉన్నాం. ఇప్పటి ‘కరోనా’ భయం సందర్భంలో ప్రపంచ జనాభాలోనే రెండవ స్థానంలో (135 కోట్లు) ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తిని ఎలా కట్టడి చేయగలిగారన్నది వారి ప్రశ్న. 139 కోట్ల జనాభా ఉన్న చైనా పరిస్థితి ఏమైందో ప్రపంచం చూసింది. మన దగ్గర కూడా జనం కుప్పలు కుప్పలుగా మరణిస్తారని అన్నిదేశాలూ ఊహించాయి!

పాశ్చాత్యులు భారత్‌ను శుభ్రత లేని పేదలు, గుంపులుగా జీవించే దేశంగా భావిస్తారు. కనుక వారి ఊహలను తప్పుబట్టలేం. వ్యాధి అటువంటిది. కానీ.. కేంద్ర, రాష్ట్ర పాలకుల ముందుచూపు, సత్వర నిర్ణయాలు, ఆచరణలు, ఇతరుల ఆలోచనలు తప్పని రుజువు చేస్తున్నాయి.అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో ఏం జరిగింది? అలసత్వంతో.. సత్వర నిర్ణ యం తీసుకోకపోవడం వల్ల వేలాది మంది చనిపోతున్నారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నది. వేగంగా నిర్ణ యం తీసుకొని లాక్‌డౌన్‌ ప్రకటించకపోవడ మే దీనికి కారణం. ఈ రెండూ మన జంటనగరాల్లా కలిసే ఉంటాయి. 

నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. భారతీయులు కూడా చాలామంది ఇక్కడ వ్యాపార, వృత్తిపరంగా స్థిరపడిన వాళ్లున్నారు. ముఖ్యంగా తెలుగువాళ్లు న్యూజెర్సీలో ఎక్కువ. కంగారుపడుతున్న ఇక్కడివారి బంధువుల కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నందు న అక్కడివారితో మాట్లాడుతున్నా. యోగక్షేమాల కోసం ఫోన్‌ చేసినవారికి ‘మేం బాగు న్నాం, ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటు న్నాం.. ఇక్కడేం టెన్షన్‌ లేదు, మీరు జాగ్రత్త గా ఉండండి’ అని చెప్తున్నారు. అమెరికాలో వేలల్లో మరణిస్తున్న కరోనా బాధితుల గురించి ఇక్కడ టీవీల్లో చూస్తున్నవారికి తమవాళ్లు అబద్ధం చెబుతున్నారేమో అనిపిస్తుంది సహజంగా.

అయితే, అక్కడినుంచి వాళ్లు చెప్తున్నది నిజం. ఇక్కడ టీవీ వార్తల్లో చూపిస్తున్నదీ నిజ మే. అక్కడ జరిగిందేమంటే.. ‘లాక్‌డౌన్‌' ముందుగా పెట్టకుండా ట్రంప్‌ నిర్లక్ష్యం చేయ డం వల్ల వైరస్‌ పాకిపోయింది. చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాల వల్ల నిత్యం చైనా నుంచి అమెరికాకు, అమెరికా నుంచి చైనాకు ప్రయాణాలు సాగాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధా ని న్యూయార్క్‌-చైనా మధ్య సరైన సమయం లో అంతర్జాతీయ విమానాశ్రయాలు మూసేసి ఉంటే ఇంతగా వ్యాపించి ఉండేదికాదు. ఒకవై పు చైనా, యూరప్‌ దేశాల పరిస్థితి చూసి కూడా స్పందించనితనం నాయకత్వ అసమర్థ తే. నష్టం మొదలయ్యాక లాక్‌డౌన్‌ ప్రకటించా రు. ప్రాణానికి అత్యంత విలువనిచ్చే దేశంగా పేరున్న అమెరికా దేశపు గుర్తు స్ట్యాచ్యూ ఆఫ్‌ లీబర్టీ ప్రపంచం ముందు సిగ్గుతో తలిదించుకోవాల్సి వచ్చింది. 

విషాదమేమంటే.. అమెరికాలో వృద్ధాశ్రమాలు ఖాళీ అవుతున్నాయి. వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి వయస్సురీత్యా వచ్చే చిన్నచిన్న అనారోగ్యాలను అక్కడే నయం చేసే వ్యవస్థ ఉంటుంది. అక్కడ అనేకమంది యువత సర్వీస్‌ ఇస్తుంటారు. అక్కడి ఆరోగ్య భద్రత వల్ల వృద్ధుల శాతం ఎక్కువ. ఎక్కువకాలం జీవిస్తారు. 80 ఏండ్లు వస్తే గానీ వృద్ధాప్యం గా పరిగణించరు.

ఆయా పట్టణాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కూడా ఆపకపోవడం వల్ల లోకల్‌ రైళ్లు, బస్సుల ప్రయాణికులు కరోనాకు వాహకు లుగా మారారు.  ఇప్పుడు అర్థమైంది కదా.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హైదరాబాద్‌లో, రాష్ట్రం లో మన ప్రభుత్వం ముందుగానే ఆపేసి మనకెంత మేలు చేసిందో.. అమెరికాలో ఇమ్యూనిటీ సహజంగా తక్కువ ఉండే నర్సింగ్‌ హోమ్స్‌లోని వృద్ధులూ, పౌష్టికాహా రం అంతగా ఉండని కమ్యూనిటీ హాల్స్‌లోని వారూ కరోనా వైరస్‌ కారణంగా కుప్పలుగా మరణిస్తున్నారు. ఆలస్యంగానైనా అమలుచేస్తున్న ‘లాక్‌డౌన్‌' మిగతా రాష్ర్టాల్లో పాకకుం డా కొంత కాపాడుతున్నది. ట్రంప్‌కు కూడా న్యూయార్క్‌, న్యూజెర్సీలు గుణపాఠమయ్యాయి.

ఇప్పుడు తెలుస్తున్నది కదా.. మన పాలకులు మన ప్రాణాలు కాపాడటానికి ఎంత శ్రమిస్తున్నారో.  ఇప్పటికే మనం ఎన్నోదేశాలకు ఆదర్శమయ్యాం. కరోనాపై ఈ యుద్ధం భారత్‌కు ఒక సవాల్‌. ఈ తరుణంలో అం దరం సైనికులమై నిలబడాలి.

ప్రపంచం భారత్‌ వైపు చూస్తుంటే.. యావత్‌ భారత్‌ రాష్ర్టాలు మన తెలంగాణ వైపు చూస్తున్నాయి. మనల్ని అనుసరిస్తున్నా యి. ఇది మనందరికీ గర్వకారణం. మన నాయకుడు కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు,  వైద్య విభాగాలను, పోలీ సు విభాగాలను అప్రమత్తం చేసిన తీరు హర్షణీయం.

 లాక్‌ డౌన్‌ కాలంలో మద్యానికి అనుమతి లేదని సీఎం కేసీఆర్‌ చెప్పడం ముదావహం. ఆదాయం పడిపోతుందని తెలిసి కూడా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ఈ పరిస్థితుల్లో ఈ ప్రకటన ప్రజల క్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతున్నది. అందరూ ఇళ్లల్లోనే ఉంటున్న ఈ క్లిష్ట సమయంలో ఇంటినే బార్‌ చేయగల బలహీనులుంటారు. అందరూ కలిసి కుటుంబ సంబంధాలను, ఆప్యాయతలను బలపరుచుకొనే అవకాశాన్ని గొడవలతో, కీచులాటలతో మరింత దిగజార్చే పరిస్థితిని రాకుండా కాపాడారు. ఎన్నో కుటుంబాలు, ఎందరో మహిళామణులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేనోళ్ల కొనియాడుతూ, మొక్కుతున్న సందర్భం ఇది.


logo