మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Apr 14, 2020 , 22:58:48

కొత్త యుద్ధం

కొత్త యుద్ధం

యుద్ధం.. కొత్తయుద్ధం కొత్తయుద్ధం

కనిపించని ఆ భీకర శత్రువు

కరుణలేని ఆ కరాళ మృత్యువు

కరోనతో జనమంతా చేసే

పరోక్ష సురక్ష సుదీర్ఘ యుద్ధం ॥యుద్ధం॥

పరదేశంపై ప్రతీకారమా? ఓ

నరజాతిలోన అహంకారమా?

కారణమేదైనా కర్తవ్యం

కదనానికి మన సంసిద్ధం ॥యుద్ధం॥

ఒంటరిగానే మనముండాలి

ఇంటినుండి పోరాడాలి

విడివిడి తనమే విరుగుడు మందు

సమరానికి జన సన్నద్ధం ॥యుద్ధం॥

సామాజిక దూరం అశ్వదళం

చేతుల శుభ్రత గన్నుబలం

స్వీయ నిర్బంధమణుబాంబు

ఇంటి కోటలో ఎంతో భద్రం ॥యుద్ధం॥

వైద్యులే ఘన శిరస్ర్తాణాలు

పోలీసులు సేనానులు

సఫాయివారే సిపాయిలు

మనరక్షకులిక విజయం తథ్యం ॥యుద్ధం॥


logo