శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Apr 13, 2020 , 23:10:37

నిశ్శబ్దం

నిశ్శబ్దం

నిశ్శబ్దం.. నిశ్శబ్దం..

ఇది శోకభూమి

సడిసేయకుండా రండి!

అప్పుడప్పుడే విచ్చుకుంటున్న

మొగ్గలెన్నో రాలిపోయాయి 

జ్ఞాపకాల హిమతుషారాలను

కురవనీయండి..!

తూటాలు దెబ్బలకు

గిలగిలా తన్నుకొని

వృద్ధులెందరొ నేలకొరిగారిక్కడ

వాడినపూలు తీసుకొనిరండి..!

ఎన్నెన్ని ఆశలు మోసులెత్తే

హృదయాలిక్కడ ఛిన్నమై పోయాయో..

ఎన్ని కుటుంబాలు చెదిరిపోయాయో..

ముక్కుపచ్చలారని

పసి హృదయాలెన్నో

తూటాల పాలయి పోయినయి

పూలమొగ్గలు కొన్ని కొనతెండి..!

కోయిలిక్కడ దుఃఖ గీతాలు

పాడుతున్నది

తుమ్మెదలూ

దుఃఖం వీణెలే మీటుతున్నవి

గాలీ..! నువ్వుకూడా మెల్లమెల్లగా వీయ్‌

దుఃఖపు వేడి నిట్టూరుపులను

ఎగిరి పోనీయకు

చైనా వసంతమా.. రా...

మెల్లగా మెల్లగా రా తోటంతా

బీభత్సంగా వుంది

పరిమళహీన పరాగం

ఓ మచ్చలా పడివుంది.. ప్రేమాస్పదమైన తోట

నెత్తురుతో తడిసిపోయింది....!

- హిందీ: సుభద్ర కుమారీ చౌహాన్‌

అనువాదం: హిమజ్వాల 

(జలియన్‌వాలాబాగ్‌ ఘటన జరిగి 101 ఏండ్లు గడిచిన సంధర్భంగా..)


logo