సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 12, 2020 , 22:29:06

మెరుపులా మెరిసేదే కవిత

మెరుపులా మెరిసేదే కవిత

కవిత్వ నిర్మాణ పద్ధతుల్లోని మెలకువలను గమనించాలి. వచనాన్ని వీలైనంత తక్కువగా వాడితే మంచిది. వచన కవితాప్రక్రియలో కవిత్వానికి పెద్దపీట వేయాలి.

కవిత్వ పోకడలు నానాటికి వింతదారులు తొక్కుతున్న సందర్భంలో.. ఏది సుకవిత్వం, ఏది కుకవిత్వం అని ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. వచన కవిత్వం వచ్చిన తర్వాత, ఛందోబద్ధ నియమాలు లేకపోవడం వల్ల, సాహిత్య  పరిచయం కాస్తో కూస్తో ఉన్న ప్రతి వ్యక్తీ తనదైనశైలిలో కవిత్వాన్ని రాయగలుగుతున్నాడు. కానీ కాలగమనంలో అన్ని కవిత్వాలు నిలబడుతాయా అనేది ప్రశ్న? 

సమకాలీనంగా నేడు రాసిన, రాస్తున్న కవులకు ఒక నిబద్ధత, ఒక ప్రమాణం, ఒక సాహిత్య సాంగత్యం, ఒక కవి గురువు లేకపోవడమే కారణం.

ద్వేష, విద్వేషరహితంగా, సిద్ధాంతపరంగా ఉన్న విమర్శలు నిలదొక్కుకుంటాయి. విమర్శకులకు, సమీక్షకులకు కవిత్వ పరిజ్ఞానం మెండుగా ఉండాలి. అనుభవపూర్వకంగా కవితలను అర్థం చేసుకోవాలి. బాగా చదువాలి. విమర్శకులు కవులైనా, కాకపోయినా పరవాలేదు. వారికి విమర్శనా శక్తి ఉంటే చాలు. ఒక కవిత్వాన్ని తీసుకొని, అందులోని గుణగణాలను, లోటుపాట్లను సద్విమర్శ చేయగలుగాలి. ఇక్కడ సద్విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ప్రతి కవి లేదా కవయిత్రి తాను రాసిన కవిత చాలా గొప్పదిగా తలపోస్తారు. ముక్కుసూటిగా విమర్శించకుండా వివరణాత్మకతతో వివరించాలి. ఎలా రాసినా కవిత్వమనిపించుకోదు. వచనాన్ని ముక్కలుముక్కలుగా విరిచి దొంతరులుగా పేర్చి, కవితను మమః అనిపిస్తున్నా రు. ప్రతి భావాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ కవిత్వం చెయ్యా లి. ప్రతి కవితకూ ఒక ఆత్మ  ఉంటుంది. జీవం ఉంటుం ది. కొన్ని కవితల్లో అక్షరాలు మనతో మాట్లాడినట్లుంటా యి. మనల్ని పలకరిస్తాయి కూడా! కవి భావావేశానికి మనం మంత్రముగ్ధులైపోతాం. కవిత్వానికి, చదువుకు సంబంధం లేదు. ఏమీ చదువని నిరక్షరాస్యులు కూడా గొప్ప పాటల్ని, అందులో గొప్ప భావావేశాన్ని పొదిగా రు. వాల్మీకి గొప్ప పండితుడు కాదు. అతనొక బోయవాడు. మహత్తరమైన రామాయణాన్ని మనకందించా డు. కబీరు, వేమన, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి పండితులు కారు. కానీ నేటికీ గుర్తుండిపొయే పద్యాల్ని మనకు అందించారు. కవిత్వమనేది ఒక టెక్నిక్‌. సామాజిక స్పృహ ఉన్న కవి కవిత్వం రాయడమనే టెక్నిక్‌ తెలియకపోతే గొప్ప కవి కాలేడు. పూవు నేలరాలితే  పరిమ ళం గాయపడుతుంది. మృదుత్వం మౌనంగా రోదిస్తుందన్నాడో కవి. ఈ పదాల్లో కవిత్వం పారాడుతోంది. మనల్ని ఈ భావాలు వెంటాడుతూనే ఉంటాయి.

తెలంగాణ కవులు ఆలిశెట్టి ప్రభాకర్‌, కాళోజీ సామాన్యులకు చేరువయ్యే కవిత్వాన్ని అందించారు. కవిత్వం రాయడమనేది అందరికీ అబ్బే విద్య కాదు. శ్రీ శ్రీ కవిత్వంలో అగ్నిపర్వతాలు బద్ధలైనట్లు ఉంటుంది. అలాగే కృష్ణశాస్త్రి కవిత్వం మృదు మధురంగా వసంతకోకిల గానం చేసినట్లుంటుంది. సినారె కవిత్వం భావ గర్భితం గా, గంభీరంగా ఉంటుంది. ఇలా ప్రతి కవి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు. చివరగా.. ‘కప్పి ఉంచితే కవి త్వం.. విప్పి ఉంచితే విమర్శ’ అన్నాడు ఒక మహాకవి. మరి సమీక్షకులు, విమర్శకులు ఆలోచిస్తారు కదూ! కవి తా సమీక్ష అంటే వారి కవితలోని విషయాలను తిరగరాయడం కాదు. కవిత్వ నిర్మాణ పద్ధతిని సమీక్ష చెయ్యా లి. విమర్శ అంటే కవితలోని లోటుపాట్లను విడమరచి చెప్పాలి.

కవిత్వ నిర్మాణ పద్ధతుల్లోని మెలకువలను గమనించాలి. వచనాన్ని వీలైనంత తక్కువగా వాడితే మంచిది. వచన కవితా ప్రక్రియలో కవిత్వానికి పెద్దపీట వేయాలి. భావాత్మకత ఉన్నా, కవిత్వ ప్రేరకాలు లేకపోతే ఆ కవిత పండదు. కవిత్వాలు వచన పంక్తులు కాకూడదు.

మాట్లాడే భావాన్ని సంభాషణగా మలుస్తూ కవిత్వా న్ని చేయవచ్చు. వచన కవిత్వంలో కొన్ని మెలకువలను విధిగా అనుసరించాలి. కానీ వచన కవిత్వం ప్రమాణాల ను పాటించాలి. కవితలో చెప్పవలసినదాన్ని నాలుగైదు మెటాఫర్ల ద్వారా చెబితే అది మంచి కవిత అవుతుంది. ఎత్తుగ డ గానీ, ముగింపు గానీ ఒక మెరుపులా మెరిస్తే కవిత గుర్తుండిపోతుంది.

- వారణాసి భానుమూర్తిరావు 

99890 73105


logo