శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Apr 10, 2020 , 23:10:21

కేసీఆర్‌ మాట దేశానికి బాట

కేసీఆర్‌ మాట దేశానికి బాట

కరోనాను ఎదుర్కొనలేక అమెరి కా వంటి పెద్ద దేశాలే చేతులెత్తేసి, ఏం చేయాలో తోచక అతలాకుతలమవుతున్నాయి. సామాజిక దూరం పాటించడ మే దీన్ని అడ్డుకొనడానికి ఉన్న ఆయు ధం. ఒక కరోనా వ్యాధి పీడితుడు సమాజంలో సంచరిస్తూ తనకు తెలియకుండానే వందల మందికి రోగాన్ని వ్యాపిం చడం ఈ అంటురోగం ప్రత్యేక లక్షణం. అట్లా సంక్రమింపజేస్తున్నప్పుడు ఆ రోగి లో కరోనా వ్యాధి ప్రస్ఫుటంగా ఉండ దు. కనుక అది బయటపడేలోగానే అత ని ద్వారా వేలాది మందికి వ్యాధి సంక్రమిస్తుంది. ఈ విధంగా వ్యాధిగ్రస్థులు వ్యాధి లక్షణాలు బయటపడేలోగానే వేలాది మందికి తమకు తెలియకుండా నే వ్యాధిని సంక్రమింపజేస్తారు. అందువల్ల దీన్ని మానవజాతిని నాశనం చేసే మహమ్మారి అని గుర్తించాలి.

మహా మేధావీ, శాస్త్రవేత్త అయిన ఐన్‌స్టీన్‌ మహాశయుడు వెనుకట ప్రకటించినాడని చెప్పే ఉదంతం ఒకటి ఇప్పుడు గుర్తుకువస్తున్నది. ద్వితీయ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత ఆయనను మూడవ ప్రపంచయుద్ధం లో ఉపయోగించే ఆయుధాలను గురిం చి చెప్పవలసిందని అడిగితే ఆయన ‘అటువంటి యుద్ధం వస్తే అప్పటికి వృద్ధిచెందిన శాస్త్ర జ్ఞానం వల్ల ఎటువంటి ఆయుధాలు వస్తాయో నాకు తెలియదు కానీ, ఆ తర్వాత నాలుగో ప్రపంచయుద్ధంలో ఉపయోగించేవి మా త్రం కర్రలే అని నాకు తెలుసు’ అని ఐన్‌స్టీన్‌ సమాధానం చెప్పినాడట. ఇప్పుడు కరోనా మారణహోమంలో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే ఇది మూడవ ప్రపంచయుద్ధమే అనిపిస్తున్నది. ఏ మా త్రం ఉపేక్షించినా ఈ వైరస్‌ మొత్తం నాగరిక సమాజాన్నే మట్టుపెట్టే మహమ్మారి వలె కానవస్తున్నది. సర్వవిధాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో శవాలు గుట్టలుగా కానవస్తున్నట్టు వార్తలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితే మన దేశంలో సంభవిస్తే ఎంత భయంకరమో!.

అదృష్టవశాత్తు నేడు మన దేశ నాయకత్వం సమర్థులూ, స్వార్థరహితులూ, సర్వమానవ కళ్యాణాన్ని కోరేవారి చేతు ల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వ్యాధి నివారణకు ప్రయత్నాలు చేస్తున్నవి. కాబట్టి మన దేశం మిగితా దేశాలకంటే మంచి స్థితిలో ముందుకుసాగుతున్నది. దీనికి ప్రజల సహకారం కూడా తోడుగా ఉంది. దేశ క్షేమం, ప్రజాక్షేమం అన్నింటికంటే ముఖ్యమైంది. రోగ నివృత్తి కోసం అహరహం ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవ చేస్తున్న వైద్యుల సహకారం ప్రశంసనీయం. వారికి ప్రజలు కృతజ్ఞులుగా ఉండాలి. వైద్యులు రోగుల రక్షణ కోసం చేసే సేవను మరిచి వారిపై దాడులకు దిగడం సర్వదా గర్హింపదగిన విష యం. ఈ ప్రవృత్తి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి. 

కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్‌ అవి రళ కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగానే అందరికన్నా ముందు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించి దేశానికే ఆదర్శం గా నిలిచారు. ఈ విషయమై జాతీయ నేతలు సైతం కొనియాడారు. ‘దూర చికిత్స’ను పాటిస్తూనే మన దేశ ప్రజలందరూ ఈ మధ్య రెండుమార్లు సామూహిక మనో యజ్ఞా ల్లో పాల్గొనడం యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దానివల్ల సత్ఫలితాలు సా మాన్యమైనవి కావు. అదొక యౌగిక ప్రక్రి య. మానవులకున్న మనోశ్శక్తి అద్భుతమైంది. అది ఏకీకృతమైతే దానికి అసాధ్యమంటూ ఉండదు. కనుకనే మేధావులూ, నాయకులూ, ఆధ్యాత్మికవేత్తలూ, అధికారులూ స్త్రీ, పురుష భేదం లేకుండా, జాతి, మత, ప్రాంతీయ భావాలకతీతంగా ఈ సామూహిక మానసిక ప్రార్థనల్లో పాల్గొని తమ ఐకమత్యాన్ని చాటారు. ఇది మానవ జాతికి శుభోదయం. 

-ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ


logo