గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 10, 2020 , 23:08:54

అమావాస్యలో వెన్నెల

అమావాస్యలో వెన్నెల

అమావాస్యలో వెన్నెల

కురవడమే అందం

అపజయాలనోడించి

గెలవడమే అందం

నిశ్శబ్దంగా నీవు 

ఎదిగి ఎదిగిపోతుంటే

అడ్డుపడిన పల్లేర్లను

చిదమడమే అందం

హృదయంలో బడబాగ్నులు

ఎన్ని రగులుతున్నా

వదనంలో చిరునవ్వులు

చిందడమే అందం

ఆకాశం పిడుగులతో

గడగడలాడించినా

అలమటించు నేలమ్మను

తడపడమే అందం

అలజడితో సంద్రమెంత

ఘోషలు పెడుతున్నా

అలలు కిందపడినా 

పైకెగరడమే అందం

ఆవేదనలో కలాన్ని 

ముంచి నీవు ‘తిరునగరీ’

ఆనందం కవితలలో

పంచడమే అందం.


-తిరునగరి శ్రీనివాసస్వామి,94403 69939


logo