ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Apr 10, 2020 , 23:05:11

ఏక్‌ నిరంజన్‌

ఏక్‌ నిరంజన్‌

చీరల కొంగుల్లో, పంచెల అంచుల్లో

బర్మన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో

బర్‌బర్‌ మని చీదేసుకున్నాం

చల్లగాలినాస్వాదిస్తూ మోరపైకెత్తి

సూరీడు ముఖం మీదే తుమ్మేసాం

పొదలు, చెరువులు, దొరువుల సాక్షిగా

కాలకృత్యాలన్నీ ఆనందో బ్రహ్మంటూ

బహిర్భూముల్లోనే తీర్చేసుకున్నాం

జర్దాపాన్లు కసికసిగా నమిలి

మహానగర వీధుల్లో, గోడల మీద

మేడల మెట్లమీద, కాలిబాటల గట్లమీద

ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ చిత్రాలుగా ఉమ్మేసాం

ఇండిపెండెంట్‌ ఇళ్లని,

ఉమ్మడి కుటుంబాల్ని

నిలువునా పాతిపెట్టిన పాదుల్లో

అపార్ట్‌మెంట్‌ వృక్షాల్ని ఏపుగా పెంచేసాం

ముసలెద్దుల్ని, ఆవుల్ని తరిమేసి

చిటారు కొమ్మల్లో 

చిన్న కాపురాలు పెట్టేసాం

టూ బీహెచ్‌కేలు, త్రీ బీహెచ్‌కేలు కాదు

ఇకనుంచీ వెంచర్స్‌ అన్నీ

ఐసొలేషన్‌ అపార్ట్‌మెంట్లే

లోపలి గదులన్నీ మైల వార్డులే

అన్ని బంధాలూ

అలఖ్‌ నిరంజన్‌లో కలిసే చోట

ఇన్నాళ్ళనుంచీ

ప్రపంచమే నువ్వు

ఇప్పుడు 

నీకు నువ్వే ఓ ప్రపంచం

ఏక్‌ నిరంజన్‌!!!

- ‘చినవ్యాసుడు’, మాఊరు

[email protected]


logo