బుధవారం 03 జూన్ 2020
Editorial - Apr 09, 2020 , 23:09:49

ఆరోగ్యం ఉంటేనే ఆర్థిక పుష్టి

ఆరోగ్యం ఉంటేనే ఆర్థిక పుష్టి

కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక సం క్షోభం నుంచి ప్రజలు బయటపడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే స్పందించారు. ఆహార, నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, పండ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబానికి రూ.1500 లు, 12 కిలోల బియ్యాన్ని సరఫరా చేసింది.

2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచం బయటపడుతున్న క్రమంలో యురోపియన్‌ ‘యూరో మాంద్యం’ వచ్చింది. దీనినుంచి ప్రపంచ దేశాలు ఆర్థికంగా కోలుకుంటున్న దశలో మళ్లీ ‘కరోనా’ కత్తి  దేశాల ఆర్థికాభివృద్ధిని కత్తిరించడానికి కాలు దువ్వుతున్నది. ఆరోగ్యంగా ఉంటేనే ఆరికాభివృద్ధి సాధ్యం అవుతుందనే భావనతో ప్రపంచదేశాలు పనిచేయవలసిన పరిస్థితి కరోనా ద్వారా ఏర్పడింది. ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థల్లో నేడు ఏర్పడిన అస్థిరత, రెండవ ప్రపంచయుద్ధంలో వచ్చిన ఆర్థిక అస్థిరత కంటే ఎక్కువని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. 2019, జూలైలో ఐఎంఎఫ్‌ వెల్లడించిన ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీ వాటాలో భారత్‌ కన్నా అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలు ముందున్నాయి. 

మొదటి నాలుగు అతిపెద్ద ఆర్థికదేశాల జీడీపీ ప్రపంచ జీడీపీలో 44.6 శాతం. ప్రపంచంలోని దాదాపు 40 శాతం కరోనా వైరస్‌ బాధితులు ఈ నాలుగు దేశాలకు చెందినవారే కావడం గమనార్హం.అమెరికా సేవలరంగంలో, చైనా ఉత్పత్తిరంగంలో, జపాన్‌, జర్మనీ ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగంలో ముందున్నాయి. ఈ దేశా లు ఆయా రంగాల్లో అద్వితీయమైన అభివృద్ధిని కనబరుస్తూ ఆర్థిక ఎదుగుదలకు భూమికగా ఉంటున్నాయి. అలాంటిది కరోనా మూలంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాలపాలయ్యా యి. అమ్మకాలలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. 2020లో మొదటి త్రైమాసికం జనవరి-మార్చిలో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌లో మదుపరులు 20 శాతం పాయిం ట్లు నష్టపోయారు. మిగతా దేశాల్లోనూ స్టాక్‌ మార్కెట్‌ నష్టాల ఊబిలో కూరుకుపోవటంతో ప్రపంచవ్యాప్తంగా మదుపరుల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పన్నెండేండ్ల కనిష్ఠానికి చేరుకొని 20 డాలర్లకే ఒక బ్యారెల్‌ లభ్యమవుతున్నది. దీంతో రష్యా, సౌదీ అరేబియా దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల సాంకేతిక, సాంకేతికేతరరంగాల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి. అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం.. ఈ మధ్యకాలంలో 33 లక్షల మంది నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. అనేక సర్వేలు, సూచికల ప్రకారం రానున్నరోజుల్లో ఈ సంఖ్య యాభై లక్షలకు పెరుగుతుందని అంచనా. అమెరికాలో 1986లో 65 లక్షలుగా నమోదై న తర్వాత ఇదే అతిపెద్ద నిరుద్యోగిత రికా ర్డు. ప్రపంచంలోని హోటల్‌, హాస్పిటాలిటీ రంగా ల్లో ఆదాయం 85 శాతం, అన్నిరకాల ప్రయాణికుల ద్వారా ఆదాయం 95 శాతం తగ్గిపోయింది. మార్చి 31 నాటికి టూరిజం ఆదా యం వంద శాతం పడిపోయింది. కరోనా మాం ద్యం వల్ల రిటైల్‌, హాస్పిటల్‌ రంగంలో పనిచే స్తున్న మహిళలకు కొత్తగా ఉద్యోగావకాశాలు లభించగా, పురుషులకు ఎలాంటి ఉద్యోగం లభించలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి నిరుద్యోగులుగా మారారు. స్పెయిన్‌లో మాస్కు ల కొరత, జర్మనీలో టాయిలెట్‌ పేపర్‌ కొరత ఆయా దేశా ల పరిశ్రమలు ఏ విధంగా కరోనా దెబ్బకు మూతపడినాయో తెలియజేస్తున్నది.

ఐఎంఎఫ్‌ 2019 అంచనా ప్రకారం ప్రపం చ జీడీపీ 2020లో 3.3 శాతం, 2021లో 3.4 శాతం పెరుగుతుందా? లేదా ఇప్పుడు 2019 లో నమోదైన 2.9-2.5 శాతం. ఇంకా తగ్గుతుందా అనేది ఈ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆర్థిక విశ్లేషకులకు పెద్ద ప్రశ్నగా మారింది. దేశంలో కూడా 2020 జనవరి-మార్చి మొదటి త్రైమాసికంలో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12.700 లేదా 31 శాతం పాయింట్లు కోల్పోవడంతో మదుపరులు రూ.42.6 లక్షల కోట్లు నష్టపోయారు. దీంతో 112.6 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ పడిపోయింది. నిఫ్టీలో అయితే మీడియా, రియాల్టీ రంగంలో 37.6 శాతం పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ కాలంలో కార్ల కొనుగోలు 50 శాతం, ద్విచక్ర వాహనాల కొనుగోలు 40 శాతం తగ్గాయి. టీసీఎస్‌ కంపెనీ తమ ఉద్యోగులు ‘ఇంటి నుంచి పని’ చేయడం కోసం 6000 ల్యాప్‌టాప్‌లను అం దజేసింది. సాఫ్ట్‌వేర్‌రంగంలో మార్చి 20న ఇంటినుంచి పని చేసేవారు రోజుకు 1000 మంది ఉంటే, మార్చి 31 వరకు ఆ సంఖ్య 45 లక్షలకు చేరింది. దీంతో ఇంటర్నెట్‌ హై స్పీడ్‌ లేకపోవడం బ్యాండ్‌ విడ్త్‌ తగ్గిపోవడం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నా యి. కరోనా భయంతో వర్తకులు, రిటైలర్లు 15 నుంచి 20 రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు గోడౌన్‌లో నిల్వ ఉంచితే, వినియోగదారులు నెలరోజులకు సరిపడా దాదాపు వెయ్యి రకాల జనరల్‌ వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో బ్రాండెడ్‌ ఉత్పత్తులైన డెటాల్‌ సెల్వం, శానిటైజర్‌, మ్యాగీ, గోధుమ పిండి, సబ్బులు, కేక్‌, బ్రెడ్‌ లాంటి వస్తువులు మార్కె ట్లో లభించకపోవడం దేశంలోని మార్కెట్‌ మాంద్యాన్ని, సంక్షోభాన్ని సూచిస్తున్నది.

కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక సం క్షోభం నుంచి ప్రజలు బయటపడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే స్పందించారు. ఆహార, నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, పండ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబానికి రూ.1500 లు, 12 కిలోల బియ్యాన్ని సరఫరా చేసింది. కేంద్రం కూడా లక్షా 70 వేల కోట్లను ప్రజలకు ఉద్దీపనలుగా ప్రకటించడం, ఇటు రిజర్వ్‌ బ్యాంకు రేపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గాయి. మూడు నెలలపాటు ఈఎంఐల చెల్లింపు వాయిదా వేశారు. మరోవైపు ప్రపంచ ఆర్థికమాంద్యం నుంచి గట్టెక్క డం కోసం వరల్డ్‌ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు సం యుక్తంగా 5 లక్షల ట్రిలియన్ల మేర కరో నా బాధిత దేశాలకు సహా యం చేస్తున్నాయి. అమెరి కా కూడా రెండు లక్షల ట్రిలియన్‌ డాలర్లతో ఆ దేశ అవసరాల కోసమే కాకుండా కరోనా బాధిత ఇతర దేశాలకు కూడా సహా య సహకారాలు అందిస్తామని ముందుకురావడం హర్షణీయం. 

(వ్యాసకర్త: కేయూలో అధ్యాపకులు)


logo