సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Apr 08, 2020 , 22:07:38

భద్రతకు పూచీ.. పేదలకు భరోసా

భద్రతకు పూచీ.. పేదలకు భరోసా

మంచి మనసు, దయాగుణం కలవాడే రాజు అయితే ఆ రాజ్యంలోని ప్రజలంతా ఎంతటి విపత్తు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఒక రాజు వలె తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కరోనా కాలంలో ఆయన ప్రదర్శిస్తున్న చొరవను, కరోనా కట్టడి కోసం రాష్ట్రప్రజలకు ఆయన సూచనలను యావత్‌ దేశం హర్షిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్య మ స్ఫూర్తితో కరోనాపై కేసీఆర్‌ పోరు సల్పు తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కరోనా రక్కసికి బలికాకూడదనే లక్ష్యంతో ప్రజలను అప్రమత్తం చేశారు.ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన వేలాది మందిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసి రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో మనోధైర్యం కోల్పోకూడదని వరుసగా మీడి యా సమావేశాలు నిర్వహించి మనోనిబ్బరాన్ని పెంచారు. ఆయన చేసిన సూచనలను ప్రజలు  స్వీకరించారు. ఆయన మార్గదర్శనం లో నడుస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉంటున్నా రు. కష్టమైనా సరే కరోనాకు బలికాకూడదని ఇంట్లోనే ఉంటున్నారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ఎలాగైతే చర్చోపచర్చలు, మేధోమథనాలు చేశారో.., అలాగే కరోనా నిరోధానికి సైతం ఉద్యమస్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు.ప్రజల సంక్షేమం కోసం అహో రాత్రులు శ్రమిస్తున్నారు. కరోనా వైరస్‌ నివారణ కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభు త్వం చేస్తున్న సూచనలు, నిబంధనలను విధి గా ప్రజలు పాటించవలసిన అవసరం ఎంతై నా ఉన్నది. అప్పుడే కరోనా రక్కసి నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తులయ్యే అవకాశం ఉం టుంది.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్క తెలంగాణ, ఒక్క భారత్‌ మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌ అయ్యింది. వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతబడినాయి. పేద ప్రజలకు ఉపాధి కరువైంది. దిన కూలీలు రోడ్డున పడ్డారు. 

కేసీఆర్‌ పేదల బాధలను అర్థం చేసుకొని బాసటగా నిలిచా రు. ఈ సంక్షోభ సమయంలో స్వాంతనగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెల్ల రేషన్‌ కార్డ్‌ కలిగిన కుటుంబంలోని ప్రతి వ్యక్తి కి 12కిలోల బియ్యం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి నిత్యావసరాల కోసం రూ.1500లు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ విధం గా పేదలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. అంతేకాదు, వలస కూలీలు లాక్‌డౌన్‌తో ఉపా ధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అలాంటి వారిని తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములుగా గుర్తిస్తూ ప్రతి ఒక్కరికి రూ.500లతో సహా 12కిలోల రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నది తెలంగాణ ప్రభు త్వం. 

సంక్షోభ సమయాల్లో, విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలువడం నాయకు ని లక్షణం. ఇలాంటి అరుదైన నాయకుల్లో కేసీఆర్‌ ఒక్కరంటూ యావత్‌ దేశం కీర్తిస్తున్నది. తమను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం అని ఇతర రాష్ర్టాల నుం చి వచ్చిన కూలీలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతుండటం గమనార్హం.

కరోనా నివారణ కోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే. ఆయన సూచనలను అనుసరిస్తూ లాక్‌డౌన్‌లో భాగంగా ఇండ్లల్లోనే ఉం డటం. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలం టే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. అందుకోసమే రాష్ట్ర ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌లో ఉంటూ వెంటనే దవాఖానను సంప్రదించాలి. సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతు లు శభ్రం చేసుకోవాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకు, వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు. క్వారంటైన్‌ పాటిద్దాం.. కరోనా నివారణకు కృషిచేద్దాం. 

(వ్యాసకర్త: వరంగల్‌ తూర్పు  నియోజకవర్గం శాసనసభ్యులు)


logo