బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 08, 2020 , 22:03:30

బాధ్యతగా నడయాడు

బాధ్యతగా నడయాడు

అజ్ఞాతంగా ఉంటూ మిక్కిలి తెలివితో 

కలిగించెనొకటి విధి వైపరీత్యము..

కరోనా నామముతో జగమునెల్ల 

గడగడలాడిస్తోందిది నిత్యమూ..!


కానీ .. కాపాడటానికి మన చెంత 

వీరున్నారన్న ధైర్యంతో కొంత నిశ్చింత!


మన జీవనాడికై 

             తమ ప్రాణాల్ని అడ్డువేస్తూ 

నిత్యం మానవ సేవలోనే తరిస్తున్న 

వైద్యులను - 

           వైద్య సిబ్బందిని చూస్తుంటే 

దేవదూతలా లేక సాక్షాత్తు దేవుళ్ళా..

అని అన్పిస్తోంది కదూ ..!


అగ్నిగోళంలా ప్రజ్వరిల్లుతున్న సూర్య తాపాన్ని సైతం 

తమ కనుసన్నల్లోకి రానీకుండా కాఠిన్యం- కరుణ 

తమ రెండు కళ్లుగా చేసుకొని అనుక్షణం 

ఆపద నుండి రక్షించటానికి తపిస్తున్న 

రక్షకభటులను చూస్తుంటే ..

బాధ్యతాయుతమైన తండ్రులా.. లేక 

సరిహద్దుల్లో వుండి దేశాన్ని

                       కాపాడే సిపాయిలా 

అని అన్పిస్తోంది కదూ..! 


అందరినీ తమ బిడ్డలుగా భావిస్తూ 

ఎవ్వరికీ హాని కలుగకుండా క్షణక్షణం 

శుచి - శుభ్రత కోసం పరితపిస్తూ 

శ్రమిస్తున్న శ్రామికులను చూస్తుంటే..

కన్నతల్లులా లేక ఆదిశక్తులా 

అని అన్పిస్తోంది కదూ..! 


ఆర్థిక మాంద్యము కూడా లెక్క చేయక 

నిద్రాహారాలు మాని 

             ప్రజా రక్షణే మా లక్ష్యమని 

ప్రతిక్షణం యోచిస్తున్న 

         ప్రభుత్వమును చూస్తుంటే..

ధర్మ పరిపాలన చేసే రారాజులా లేక

అంతకు మించా..

               అని అన్పిస్తోంది కదూ..! 


జనులారా.. మీకన్పించటం లేదా!?

మన కోసం గీచిన లక్ష్మణరేఖ లాంటి 

రక్షణరేఖ దాటకుండా 

          వారు చెప్పిన నియమాలను 

పాటించాలని .. మనల్ని కాపాడుకొని 

వారందరికీ విముక్తి కలిగించాలని 

వారికి అందరం సెల్యూట్‌ చేయాలనీ..!


నాడు లక్ష్మణరేఖ దాటితే రావణ హతంతో

జరిగెను లోక కళ్యాణము..

కానీ .. నేడు రక్షణరేఖ దాటితే మనల్ని 

అంతం చేసే ప్రత్యర్థి మహమ్మారికి 

కలుగును కదా విజయము..!

అందుకే..

బాధ్యతగా నడయాడు.. 

నిర్లక్ష్యం విడనాడు...

-మాదారపు వాణిశ్రీ,

9247286668


కూర్చుండే గుర్రాలు మలుపు!

చాటుగా నిలబడి

బాణాన్ని గురిపెట్టటమూ

నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూసి

వేలాడుతున్న చేపను కొట్టటమూ

ఇవేమంతా గొప్పవి కావు!

కనిపించని శత్రువును

ఎలా మట్టు పెట్టాలన్నదే

ఈనాటి లాక్‌ డౌన్‌!!

ఇంట్లో నువ్వుండి

బయట నుండి ఇంటికి 

       తాళం పడ్డట్టుండాలి  

సెల్లు ఒక్కదగ్గర ఉండే 

సకల  పనులు నెరవేస్తున్నట్టు-

అలాగే నువ్వూ 

ఇంట్లో కదలకుండా

కూర్చుండే గుర్రాలు మలుపు..!!

- కందుకూరి శ్రీరాములు

9440119245


logo