బుధవారం 03 జూన్ 2020
Editorial - Apr 07, 2020 , 23:21:25

భస్మాసుర హస్తమా?

భస్మాసుర హస్తమా?

దేశ రక్షణ కోసం సైనికులు ఉపయోగించేందుకు తయారుచేసిన ఏకే-47 తుపాకీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతుల్లో పడి అమాయక ప్రజలు, సైనికులు మరణించడాన్ని చూసి మైఖేల్‌ టిమోఫెవిచ్‌ కలష్నికోవ్‌ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తాడు. ఇదే తరహాలో అమెరికా వ్యాపార ఏజెంట్‌ అయిన జాన్‌ పెర్కిన్స్‌ తన ఆత్మకథలో ఇలాంటి పశ్చాత్తాపాన్నే ప్రకటిస్తాడు.

ఒక దళారి పశ్చాత్తాపం (a confession of an economic hitman): జాన్‌ పెర్కిన్స్‌ తన ఆత్మకథగా రాసిన పుస్తకం. 2004లో ప్రచురితమై ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకంలోని ప్రధాన అంశం.. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారీ దేశమైన అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికపరమైన తాయిలాలను ఇస్తామని ఆశ చూపి, దీర్ఘకాలంలో వాటిని ఆర్థికం గా దెబ్బతీసి తమ చెప్పుచేతల్లో  ఉండేలా చేయడం. ఇందుకోసం పెర్కిన్స్‌ వంటి ఆర్థికవేత్తలను అమెరికా తన ఏజెంటుగా నియమించుకుంటుంది. తాను దెబ్బతీయాలనుకున్న దేశాలకు పంపి, వారికి కొన్ని అభివృద్ధి నమూనాలను (అవి ఆయా దేశాల ప్రజలకు ఉపయోగపడుతాయా లేదా అన్నది అమెరికా ఏజెంట్‌కు అనవసరం) చూపిస్తుంది. వాటికి అమెరికా ఆర్థిక సహాయం చేస్తుందనీ, ఆ పనుల కాంట్రాక్టును అమెరికాకు చెందిన, అనుబంధంగా ఉన్న సంస్థలకే ఇచ్చేవిధంగా చేస్తుంది. ఫలితంగా ఆయా దేశాలు అమెరికా నుంచి అప్పులను తీసుకొని దీర్ఘకాలంలో ఆ దేశానికి దాసోహమైపోయి అమెరికా చెప్పుచేతల్లో ఉంటాయి. 

ప్రపంచంలో తనకు పోటీ అని భావించిన అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఇలాంటి ఏజెంట్ల ద్వారా తన ముగ్గులోకి దింపి దొంగదెబ్బ తీస్తుంది. దాంతో ఆయా దేశాలు అప్పు ల ఊబిలో కూరుకుపోయి దీర్ఘకాలంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటాయి. ఇది అమెరికా అనుసరిస్తున్న ఒకరకమైన ఫైనాన్షియల్‌ పరోక్ష యుద్ధమని పెర్కిన్స్‌ అంటారు. ఇరువయవ శతాబ్దంలో ప్రపంచ దేశాలను ఆర్థికంగా కుంగదీయడమే లక్ష్యంగా అమెరికా ఎంచుకున్నది. ఒకసారి ఏజెంటు గిరిని చేయడానికి అంగీకరించి, ఆ ఉద్యోగంలోకి దిగిన తర్వాత, ఇక ఆ కూపంలోంచి బయటికి రాలేరు. రావడానికి ప్రయత్నిస్తే అంతిమంగా ఆ వ్యక్తి ఎవరికీ అనుమానం రాని (ఏదో ఒక విష ప్రయోగంతో) మరణం చెందుతాడని పెర్కిన్స్‌ తన ఆత్మకథను ఒక పశ్చాత్తాపంగా రాశాడు.

ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కూడా ఇలాంటి నేపథ్యమే ఉన్నది. ఈ ‘బయో వెపన్‌'ను చైనా తయారుచేసిందా? అమెరికా తయారుచేసిందా? అనే చర్చను పక్కనపెడితే..,  ప్రపంచంపై ఆధిపత్యాన్ని సంపాదించి, అన్నిదేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే సామ్రాజ్యవాద కాంక్ష ఉన్న ది. భవిష్యత్తులో శత్రు దేశాలను భౌతిక ఆయుధాలతో దాడిచేసి నాశనం చేయడం సాధ్యం కానప్పుడు ఇలాంటి కనిపించని జీవాయుధాలను వాడి, ఆ దేశాలను ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నం చేయాలనే కుట్రపూరితమైన కాంక్ష ఉన్న దేశం తయారుచేసిన కృత్రిమ వైరస్‌ కరోనా. ఇలాంటి జీవాయుధాల ను కొన్ని సంపన్న దేశాలు తయారుచేశాయనీ, రాబో యేరోజుల్లో వీటిని ప్రపంచంపై ప్రయోగించబోతున్నాయని 2011లోనే ‘సెవెన్త్‌ సెన్స్‌' అనే సినిమాలో తెరకెక్కించారు. కొందరు సినిమాను, సినిమాగానే చూసి వదిలేశారు. ఇంకొందరు ‘ఆ.. ఇదం తా ఓ కల్పితం’ అని తేలికగా తీసిపారేశారు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవ్వడంతో అంతా వణికిపోతున్నారు. చాలా సినిమాలు వాస్తవాలు కాకపోవచ్చు, కొన్ని సినిమాలు వాస్తవాల ఆధారితంగానే తెరకెక్కుతాయనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అలాంటిదే ‘సెవెన్త్‌ సెన్స్‌' సినిమా అని అనుకోవచ్చు.

కరోనా వైరస్‌ను చైనా అత్యంత సైనిక రక్షణ కలిగి న వూహాన్‌ ప్రాంతంలో తయారుచేసిందని, అవస రం వచ్చినప్పుడు శత్రు దేశాలపై ప్రయోగించాలని దాచుకున్న రోగవ్యాప్త క్రిమి (డీఎన్‌ఏ) కొన్ని సాంకేతిక కారణాల వల్ల  లాబోరేటరీ నుంచి లీకయి మొద ట చైనా దేశాన్నే భస్మాసురుని హస్తంలా దహిం చి వేసిందన్నది అమెరికా వాదన. కాదు, అమెరికానే తయారుచేసి తమ దేశాన్ని నాశనం చేయడానికి తమ పై ప్రయోగించిందని చైనా అంటున్నది. ఎవరివాదన నిజమో.. కానీ, ఇప్పుడు ఆ రెండు దేశాలు తాము తయారుచేసుకున్న కరోనా వైరస్‌ బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇప్పుడు అది ప్రపంచ దేశాలను చెరబట్టింది. ఏదేమైనా ఇప్పుడు కరోనా వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలే దానికి విరుగుడు మందు ను కనుక్కోవాలి. లక్షలాదిమంది వైరస్‌ బారినపడి మరణించకముందే దాన్ని సమాధి చేయాల్సిన అవసరం ఎం తైనా ఉన్నది.


logo