ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Apr 07, 2020 , 00:45:04

ఈ సంక్షోభం.. సంస్కరణలకు నాంది

ఈ సంక్షోభం.. సంస్కరణలకు నాంది

ఆర్థిక కోణంలో చూస్తే మన దేశం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కనీవిని ఎరుగని ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నది. 2008-09లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం గట్టి షాక్‌ను ఇచ్చింది. అయినా మన దేశం తట్టుకొని నిలబడగలిగింది. మన కార్మికులు ఉపాధి కోల్పోలేదు. మన కర్మాగారాలు వృద్ధి చెందాయి. ఆర్థికవ్యవస్థ బలంగా ఉంది. ప్రభుత్వాల ఆర్థిక సత్తువ దెబ్బతినలేదు. కానీ, కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న ఇప్పటి పరిస్థితి వేరు. అయినప్పటికీ నిస్పృహ చెందవల్సిందేమీ లేదు. ఉత్తమ సంకల్పం, తగిన ప్రాధాన్యాలు కలిగి ఉండి, మన శక్తులన్నీ కూడగట్టుకోగలిగితే కరోనా వైరస్‌ను తిప్పి కొట్టడమే కాదు, మన భవిష్యత్‌ను కూడా ఆశాజనకంగా మార్చుకోగలం.

విస్తృత పరీక్షలు, కఠినమైన ఏకాంతవాసం, పరస్పర దూరం పాటించడం ద్వారా ఈ మహమ్మారిని అణిచివేయ డం తక్షణ ప్రాధాన్యం. ఇందుకు 21 రోజుల లాక్‌డౌన్‌ మొదటి అడుగు. ఈ మూడువారాల కాలం భారత్‌ కరోనా వైరస్‌పై పోరుకు సిద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. మన సాహసవంతులైన వైద్య సిబ్బందితో పాటు, ఇతరత్రా వనరులను కూడగట్టడానికి ప్రభుత్వానికి వ్యవధి లభిస్తుం ది. పబ్లిక్‌, ప్రైవేట్‌ రక్షణరంగాల నుంచే కాకుండా పదవీ విరమణ పొందినవారిని కూడా సమాయత్తపరుచవచ్చు. ఇదంతా ఎంతో వేగంగా సాగించవలసి ఉన్నది. మహమ్మా రి వ్యాపించిన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించగలగాలి. ఎక్కడ వైరస్‌ వ్యాపిస్తే, అక్కడికి వైద్య బృందాలను వేగంగా తరలించగలగాలి. వైరస్‌ను ఓడించలేకపోతే లాక్‌డౌన్‌ తర్వాతి పరిస్థితి ఎలా ఉంటుందనే దానిని బట్టి ప్రణాళిక ను సిద్ధం చేసుకోవాలి. లాక్‌డౌన్‌ను ఎంతోకాలం పొడిగించుకుంటూ పోలేము. కరోనా వైరస్‌ ఉనికి పెద్దగా లేని ప్రాం తాలలో అతి జాగ్రత్తలతో కొన్ని కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చు. ఇందుకు వ్యాధి వ్యాప్తికి సంబంధించి తగినంత ముందస్తు సమాచారం కూడా ఉండాలి. 

కార్మికులను పరీక్షిస్తుండటం, రవాణా కిక్కిరిసి ఉండకుం డా చూడటం, వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వడం, పనిచే సే చోట పరస్పర దూరం పాటించడం మొదలైన అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు వ్యాధిని గుర్తించి చికిత్స చేయడం సాగుతుండాలి. హాస్టళ్లలో పరస్పర దూరం పాటించే యువ కార్మికులతో కార్యకలాపాలను ప్రారంభించాలి. కొన్ని యాజమాన్యాలే కార్మికులకు తగిన భద్రతను ఇవ్వగలవు. వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగకుండా ఉత్పత్తి రంగం క్రియాశీలకంగా ఉం డటం అవసరం. అందువల్ల ఆయా యాజమాన్యాలకు జాగ్రత్తలను సూచించాలి. కార్మికులు విధులకు పోయివచ్చేవిధంగా ప్రభుత్వ యం త్రాంగం సహకరించాలి. నిశ్చిత వేతనాలు లేని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు సుదీర్ఘకాలం పనులకు పోకుండా ఉండవలసి వస్తుంది. వీరి పోషణ విష యం ప్రభుత్వం చూసుకోవలసి ఉంటుంది. వీరికి నేరుగా డబ్బులివ్వడం (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌- డీబీటీ) మం చిదే. కానీ ఇది అందరికీ చేరదు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము నెల గడవడానికి సరిపోదు. పేదలను ఆదుకోవడానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. ఆహారం, ఆరోగ్యం, ఆశ్రయం కల్పించడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. రుణాలు వసూలు చేయకుండా, పేదలను ఇంటి నుంచి వెళ్ళగొట్టకుండా కొన్ని నెల ల పాటు సామాజికంగా కట్టడి చేయగలగాలి. డీబీటీని కొన్నినెలల పాటు అందించాలి. ఇటువంటి చర్య తీసుకోకపోవడం వల్లే కార్మికుల వలస సాగింది. తమ మనుగడకే కష్టమైతే కార్మికులు లాక్‌డౌన్‌ను ధిక్కరించి పనులకు వెళ్తుంటారు.

ప్రభుత్వానికి ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం ఆం దోళనకర విషయమే. అయినప్పటికీ మనది మానవీయ దేశం కావడం వల్ల, వైరస్‌ను కట్టడి చేయడం తప్పనిసరి కనుక ఈ దశలో వనరులను ఉపయోగించుకోక తప్పదు. బడ్జెట్‌ పరమైన ఇబ్బందులను పట్టించుకోవద్దని కాదు. పైగా ఈ సంవత్సరం ఆదాయం బాగా తగ్గిపోతుందనుకునే విష యం తెలిసిందే. అమెరికా,  యూరప్‌ దేశాలు తమ జీడీపీలో పది శాతాన్ని నిర్భయంగా వెచ్చించగలవు. కానీ,  మన పరిస్థితి వేరు. ఇప్పటికే భారీ ఆర్థిక లోటులో ఉన్నాం. రేటింగ్స్‌ తగ్గి ఇన్వెస్టర్ల  విశ్వాసం కూడా కోల్పోతే ఎక్స్‌చేంజ్‌ తగ్గిపోతుంది. లాంగ్‌ టర్మ్‌ రేట్లు తగ్గిపోతాయి. ఆర్థిక సంస్థలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని ఖర్చులను వాయిదా వేసుకొని, మరికొన్నింటిని తగ్గించుకొని, తక్షణావసరాలపై దృష్టిసారించాలి. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించాలి. ఆర్థిక విచక్షణ చూపిస్తామనే నమ్మకం కలిగించా లి. ఎన్‌.కె.సింగ్‌ కమిటీ సూచించినట్లు మీడియం టర్మ్‌ రుణ లక్ష్యం నెలకొల్పుకోవడానికి, స్వతంత్ర ఆర్థిక మండలి ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయాలి. 

కొన్నేండ్లుగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బలహీనపడ్డాయి. ఇప్పుడు వాటికి నిలదొక్కుకునేంత వనరులులేవు. అలాగని మనకున్న కొద్దిపాటి వనరులతో అన్ని సంస్థలనూ ఆదుకోలేము. కొన్ని ఇంటి నుంచి పనిచేసే చిన్న సంస్థలను డీబీటీ ద్వారా ఆదుకోవాలి. ఇక కొన్ని పెద్ద సంస్థల విషయానికి వస్తే, వీటికి చెప్పుకోదగిన మానవ, భౌతిక వనరులు అవసరమవుతాయి. వీటికి ప్రభుత్వం తోడ్పాటునందించాలి.

కొన్నేండ్లుగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బలహీనపడ్డాయి. ఇప్పుడు వాటికి నిలదొక్కుకునేంత వనరులులేవు. అలాగని మనకున్న కొద్దిపాటి వనరులతో అన్ని సం స్థలనూ ఆదుకోలేము. ఇంటి నుంచి పనిచేసే  కొన్ని చిన్న సంస్థలను డీబీటీ ద్వారా ఆదుకోవాలి. ఇక కొన్ని పెద్ద సం స్థల విషయానికి వస్తే, వీటికి చెప్పుకోదగిన మానవ, భౌతి క వనరులు అవసరమవుతాయి. వీటికి ప్రభుత్వం తోడ్పాటునందించాలి. బ్యాంకు రుణాలకు సంబంధించి సిడ్బీ చేత రుణ హామీ ఇప్పించాలి. అయినా ఇప్పటి పరిస్థితుల్లో బ్యాంకులు రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవు. అందువల్ల ఈ సంస్థలు గత ఏడాదిలో చెల్లించిన పన్నును బట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ సంస్థలకు ఇప్పుడు నిధులు సులభంగా అందించగలిగితే భవిష్యత్తులో పన్ను లు చెల్లించగలుగుతాయి. అయితే బ్యాంకులు ఈ రుణాల ను పాత బాకీల కింద జమచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద సంస్థల చేత చిన్న సరఫరా దారులకు నిధులు అందింపజేయవచ్చు. అవి బాండ్‌ మార్కెట్‌ నుంచి నిధు లు పోగు చేసుకొని బదిలీ చేయవచ్చు. దురదృష్టవశాత్తూ కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లు నేటి అవసరాలకు అనుగుణం గా స్పందించడం లేదు. బ్యాంకులు, బీమా సంస్థలు, బాం డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఇందుకు ప్రోత్సహించాలి. ఇం దుకు ఆర్‌బీఐ చట్ట సవరణ ద్వారా సహకరించాలి. ప్రైవేటు సంస్థలకు తమ బిల్లులను వెంటనే చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 

చివరగా- గృహ, కార్పొరేట్‌ రంగాలలో ఉండే ఆర్థిక ఇబ్బందులు తప్పనిసరిగా ఆర్థికరంగంపై ప్రభావం చూపుతాయి. బ్యాంకులకు నిధుల కొరత లేకుండా ఆర్బీఐ చర్య లు తీసుకున్నది. అయితే మరింత ముందడుగు వేసి ఉత్త మ నిర్వహణలో ఉన్న ఎన్‌.బి.ఎఫ్‌.సి.లకు రుణ సదుపా యం కల్పించే ఏర్పాట్లు చేయాలి. అయితే రుణాల వల్ల ఇబ్బందిని మరింత లిక్విడిటీ అధిగమించలేదు. ఆర్థిక సం స్థలు డివిడెండ్‌ చెల్లించకుండా ఆర్‌బీఐ మారటోరియం విధించాలె. దీనివల్ల క్యాపిటల్‌ రిజర్వ్స్‌ పెరుగుతాయి. కొన్ని సంస్థలకు మరింత క్యాపిటల్‌ అవసరం పడుతుంది. దానికి అనుగుణంగా ఆర్‌బీఐ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 

దేశంలో విస్తారంగా ఉన్న ఆర్థిక నిపుణుల శక్తిసామర్థ్యాలను ప్రభుత్వం వినియోగించుకోవాలె. గతంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే అనుభవం కలిగినవారు ప్రతిపక్షంలో ఉన్నా సరే వారి సహకారం తీసుకోవాలె. పీఎంవో నుంచి ఇప్పటికే అలసిపోయి ఉన్న అదే సిబ్బందితో నడిపిస్తామనుకుంటే ఫలితం ఉండదు. ఉష్ణ ప్రాంతమైన భారత్‌లో వైరస్‌ వ్యాప్తి కట్టడి జరిగితే  భవిష్యత్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. కరో నా వైరస్‌ దాడి చేయడానికి ముందే ఆర్థిక పరిస్థితి బలహీన పడ్డది. సామాజిక, ఆర్థిక పరిస్థితి క్షీణించింది. మళ్లీ ఆ పరిస్థితి రావాలని ఎవరికీ లేదు. సంక్షోభంలోనే భారత్‌ సంస్కరింపబడుతదని అంటారు. ఈ సంక్షోభం మూలం గా మనం ఒక సమాజంగా ఎంత బలహీనంగా మారామో తెలిసివస్తుందని,  ఇక మన రాజకీయాలను ఆర్థిక, ఆరోగ్యపరిరక్షణ రంగాలను పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తామని ఆశిద్దాం. 

(వ్యాసకర్త: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌,

షికాగో విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌)

‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సౌజన్యంతో.. 


logo