బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Apr 06, 2020 , 10:28:41

నువ్వు నా అతిథివి మాత్రమే అధినాయకుడివి కావు!

నువ్వు నా అతిథివి మాత్రమే అధినాయకుడివి కావు!

నువ్వు నా అతిథివి మాత్రమే అధినాయకుడివి కావు!

మనం మన లోకంలో నిద్రపోయాం 

లేచేసరికి మరో లోకంలో ఉన్నాం 

డిస్నీ తన మ్యాజిక్‌ను కోల్పోయింది

ప్యారిస్‌ ఇక రొమాంటిక్‌ కాదు 

న్యూయార్క్‌ ఆకర్షణీయం కాదు

చైనా గోడ దుర్గమ దుర్గం కాదు

మక్కా ఖాళీగా ఉంది కదూ!

హఠాత్తుగా కౌగిలింతలూ ముద్దులే ఆయుధాలైపోయాయి 

ఇప్పుడు తల్లిదండ్రులను, మిత్రులను కలవకుంటేనే ప్రేమున్నట్టు!

అకస్మాత్తుగా అధికారం, అందం, డబ్బు అన్నీ నిష్ఫలమే 

అవేవీ మనకు ప్రాణవాయువునివ్వలేవు 

ప్రపంచం సాగుతూనే ఉంది 

అది అందంగానే ఉంది 

కేవలం అది మనుషులను బోనులో బంధించింది. 

ఇది ప్రకృతి ఇస్తున్న సందేశమేమో!

మనిషీ

ఈ భూగోళంపై నీ అవసరమేమీ లేదు 

నీవు లేకుంటేనే ఈ భూమి, గాలీ నీరూ ఆకాశం స్వచ్ఛంగా ఉంటాయి. 

నీవు మళ్ళీ వస్తే- ఇల్లు దాటి వస్తే... గుర్తుంచుకో- 

నా అతిథిగా మాత్రమే ఉండాలి

అధినాయకుడిలా కాదు

(వాట్సాప్‌లో కనిపించిన ఓ మంచి పోస్ట్‌..)


logo