శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 04, 2020 , 23:12:56

ఇది కష్టం కాదు..! ఇబ్బందే!

ఇది కష్టం కాదు..! ఇబ్బందే!

ఒక తరం వారు కనీవినీ ఎరుగని ఒక మహా విపత్తు నేటి తరం అనుభవంలోకి వస్తోంది. గతంలో మన పెద్దవాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి పరిస్థితులను గురించి చెప్పడం పాత తరం వారికి గుర్తుండే వుంటుంది. అది ప్రపంచదేశాల మధ్య జరిగిన యుద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచదేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక మహమ్మారి వైరస్‌తో సాగిస్తున్న సమరం. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్‌ ట్రంప్‌ అభివర్ణించినట్టు కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం’ ఇది. ఏ యుద్ధంలోనైనా గెలుపోటములు వుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో గెలిచి తీరాల్సిన అవసరం వుంది. ఎందుకంటే సమస్త మానవాళి మనుగడ ఈ విజయం మీదనే ఆధారపడి వుంది.

కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులందరూ ఇంతకాలం మూడో ప్రపంచ యుద్ధం గురిం చే ముచ్చటిస్తూ వచ్చారు. వారు ఏనాడు కూడా ఇటువంటి ముప్పొకటి యావత్‌ ప్రపంచాన్ని ఉడ్డుగుడుచుకునేలా చేస్తుందని లేశమాత్రం కూడా ఊహించలేదు. ఏదేశం ఎన్ని మారణాయుధాలను కలిగివున్నది, ఏ అగ్రరాజ్యం వద్ద నిమేష కాలంలో శత్రు దేశాలను భస్మీపటలం చేసే అణ్వాయుధాలు పోగుపడి వున్నది లెక్కలు కట్టి చెప్పి మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే అందులో విజేతలు, పరాజితులు అంటూ ఎవ్వరూ మిగలరని, ఆ సంగ్రామం లో మొత్తం మానవ సమాజం తుడిచి పెట్టు కుపోవడం మినహా నిర్దిష్ట ఫలితం శూన్యమని హెచ్చరిస్తూ వచ్చారు.

సరే! ఈ సంగతులు ఇలా ఉంచుదాం.

ఈ ఉదయం మా పనిమనిషి మూతికి గుడ్డ కట్టుకుని పనులు చేయడానికి వచ్చిం ది. ఆవిడ మా వాచ్‌ మన్‌ భార్య. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. రాగానే సానిటైజర్‌తో చేతులు కడుక్కుని పనులన్నీ పూర్తి చేసుకుని వెడుతోంది. మామూలు రోజుల్లో అయితే, పక్కనే వున్న మరో రెండు ప్లాట్లలో పనిచేస్తుంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వెళ్ళడం లేదు. రేణుకా! ఏదైనా డబ్బు ఇబ్బందిగా వుంటే చెప్పు’ అన్నాను, వెళ్లిపోయేటప్పుడు.

ఆవిడ చెప్పిన జవాబు నా కళ్ళు తెరిపించింది. డబ్బుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే కాని కష్టంగా లేదు’

ఇబ్బందులు వేరు, కష్టా లు వేరు అనే భగవద్గీత ఆమె నాకు బోధించింది.

చదువుకున్న వాళ్ళం, ఇంట్లో వొంట్లో కాస్త వున్నవాళ్ళం ఈ వారం పది రోజులకే నానా హైరానా పడిపోయి ఎందుకు పరిస్తితుల్ని తిట్టుకుంటూ కూర్చు న్నాం. అంతే కాదు ఈ కష్టాలకు ఎవరినో బాధ్యులను చేసి వాళ్ళ చేతకానితనం వల్లనే దేశం ఇన్ని ఇబ్బందుల్లో చిక్కుకుపోయిందని హాయిగా తీరి కూర్చుని ఫేసుబుక్కుల్లో పోస్టులు పెడుతున్నాం. నిజానికి మనం ఇబ్బందులు అనుకునేవి ఇబ్బందులేనా!

రోజూ ఆర్డరు వేసి తెప్పించుకునే పిజ్జాలు దొరక్క పోవడం, పనివున్నా లేకపోయినా బైకో, కారో వేసుకుని నాలుగు బజార్లు చక్క ర్లు కొట్టిరావడానికి వీలులేకపోవడం, చేతి సంచీ పట్టుకుని మార్కెట్టుకు వెళ్లి గీసి గీసి బేరాలు చేసి కూరలు కొనుక్కువచ్చే అవకాశం లేకపోవడం, పెద్ద పెద్ద మాల్సుకు వెళ్లి, కలయతిరుగుతూ అవసరమైనవీ లేనివీ సమస్తాన్ని ట్రాలీల్లో నింపుకుంటూ షాపింగ్‌ చేసే వీలు లేకపోవడం, అర్ధరాత్రి దాకా బార్లలో, పబ్బుల్లో గడుపుతూ డ్రంకెన్‌ డ్రైవింగ్‌ లో పట్టుపడి పోలీసులతో యాగీపడుతూ, టీవీ ల్లో కనబడే సందర్భాలు కోల్పోవడం ఇవేనా మనం అనుకునే ఇబ్బందులు, కష్టాలు. నిజానికి ఇవన్నీ చిన్న గీతలు.

పగలూ రాత్రీ ఇళ్ళల్లోనే వుండి, కాలుమీద కాలువేసుకుని టీవీలు చూస్తూ కరోనాపై సాగిస్తున్న యుద్ధంలో వైద్య సిబ్బం ది, పోలీసులు పడే కష్టాలను చూస్తూ మన తలలో దూరిన ప్రతి ఐడియాను సలహాల రూపంలో సాం ఘిక మాధ్యమాల్లో గుప్పించడం, వాటికి లైకు లు తగినన్ని రాలేదనో, లేదా వాటిని ఖండి స్తూ కామెంట్లు వచ్చాయనో జుట్టు పీక్కుం టూ కూర్చోవడం ఇవేనా మనం పడే కష్టాలు, ఇబ్బందులు. నిజానికి ఇవన్నీ చాలా చిన్న గీతలు.

మనం ఇలా ఇళ్ళల్లో వున్నామంటే ఎవరో మనకోసం వీధుల్లో మండుటెండలో నానా కష్టాలు పడుతున్నారని అర్ధం చేసుకోవాలి. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి కాసేపు కరెంటు పొతే, అసలే ఎండాకాలం, కరెంటు లేకపోతే ఎల్లాగా, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని విమర్శలు చేసే నైతిక హక్కు మనలో ఎవరికైనా ఉందా!

తగినన్ని సంఖ్యలో క్వారంటైన్‌ కేంద్రాలు లేవు, మాస్కుల ఉత్పత్తి సరిపోను లేదు అం టూ సన్నాయినొక్కులు నొక్కుతూ కాలక్షేపాలు చేయడం బాధ్యత అనిపించుకుంటుందా!

ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటి? ఆ మంటల్ని ఆర్పడం లేదా అవి పక్క ఇళ్ళకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అంతే కాని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ ఇంట్లో తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని నోళ్ళు పారేసుకోవడం వల్ల ఉపయోగమేమిటి? ముందు నష్ట నివారణ చర్యలు తీసుకుని, ప్రాణ నష్టం నివారించి ఆ పిదప తీరిగ్గా ఈ విషయాలు చర్చించి బాధ్యులను నిర్ధారించి శిక్షలో జరిమానాలో వేయిస్తే ఆక్షేపించేవారు ఎవరుంటారు? నిజానికి ప్రభుత్వాలు చేస్తున్నది అదే! ఆ ప్రయత్నాలను ఆక్షేపించడం వల్ల ఉపయోగం ఏమిటి?

ఈ లాక్‌ డౌన్‌ వల్ల సమాజంలో కష్టపడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు వేరే వున్నా రు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకుని జీవనం గడిపే వాళ్ళు, రెక్కాడితేకాని డొక్కాడనివాళ్ళు ఎందరో వున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ కూడా. కానీ వాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎంతసేపూ ఇఎంఐలు, వాయిదాలు, వడ్డీ గొడవలు ఇవే రోజువారీ చర్చల్లో కనబడుతున్నాయి. వీటిని తక్కువ చేసి చెబుతున్నానని అనుకోవద్దు. కానీ ఇవి ఇబ్బందులు మాత్రమే, కష్టాలు కాదు.

మా పనిమనిషి మాటలతో నాకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నాను. నేను వెంటనే నా గీత పక్కనే పెద్ద గీత గీసుకున్నా ను. దాంతో నాది చిన్నగీత అయింది. మన సు తేలికపడింది.

అందరం పెద్ద గీత గీసుకుందాం రండి! కష్టాలు అనుకున్నవి ఇబ్బందులుగా మారతాయి. మనసు తేలికపడ్డకొద్దీ ఇబ్బందులు కూడా దూదిపింజల్లా ఎగిరిపోతాయి. 


logo