సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Apr 04, 2020 , 23:09:33

దక్షిణ కొరియా బాటలో జర్మనీ

దక్షిణ కొరియా బాటలో జర్మనీ

కరోనాను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా విజయవంతమై ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జర్మనీ కూడా దక్షిణ కొరియా మార్గాన్నే ఎంచుకున్నది. ప్రజానీకంలో భారీ ఎత్తున పరీక్షలు జరపడం, సోకినవారిని ఏకాంతంలోకి పెట్టడం, తద్వారా ఒకరినుంచి మరొకరికి సోకకుండా అడ్డుకోవడమనేది జర్మనీ అనుసరిస్తున్న విధానం.

ఆరోగ్య వ్యవస్థలోని తనకున్న అనుకూలాంశాలను జర్మనీ సద్వినియోగం చేసుకుంటున్నది. జర్మనీలోని పదహారు రాష్ర్టాల్లో కలిసి మొత్తం జనాభా ఎనిమిది కోట్ల ముప్ఫై లక్షలు. ఈ జనాభా లో వీలైనంత మందికి పరీక్షలు జరిపించడమే కాకుండా, రోగుల ను పర్యవేక్షించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది. 

జర్మనీ భిన్నమైన పరిస్థితులు గల దేశ మైనప్పటికీ, ఆసియా దేశమైన దక్షిణ కొరి యా అనుసరించిన వ్యూహం తమకు ఉదా హరణగా నిలుస్తుందని రాబర్ట్‌ కోచ్‌ వ్యాధు ల నియంత్రణ అధ్యయన సంస్థ అభిప్రా యపడ్డది. మరే యురోపియన్‌ దేశంకన్నా మిన్నగా జర్మనీ వారానికి మూడు నుంచి ఐదు లక్షల చొప్పున పరీక్షలు నిర్వహి స్తున్నది. రోజుకు రెండు లక్షల పరీక్షలు నిర్వహించే స్థోమతను సంతరించుకోవా లని భావిస్తున్నది. ఇప్పుడు కరోనా రోగుల ను,  వారిని కలుసుకున్న వ్యక్తులను మాత్రమే పరీక్షిస్తున్నారు. ఇక ముందు మరింత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తారు. రోగి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా అతడు ఎక్కడెక్కడ తిరి గిందీ ఆరాతీసి, జబ్బు సోకిన వారిని గుర్తించి ఏకాంతంలో పెట్టాలని భావిస్తున్నది. అయితే సెల్‌ఫోన్‌ ద్వారా వ్యక్తుల కదలి కలను ఆరా తీయడం ప్రజల గోప్యతకు భంగకరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాజీ పాలనను, కమ్యూనిస్టుల హయాంలో రహస్య పోలీసుల నిఘాను అనుభవించినందున జర్మనీలో ఇటువంటి ఆందోళన తలెత్తుతు న్నది. కరోనా సోకిన వారిలో మృతుల సంఖ్య జర్మనీలో తక్కువగా 1.4 శాతం ఉన్నది. కానీ ఇటలీలో పది శాతం, ఫ్రాన్స్‌లో తొమ్మిది శాతం, స్పెయిన్‌లో ఎని మిది శాతం, స్విట్జర్లాండ్‌లో నాలుగు శాతం ఉన్నది. ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరణా లు ఎక్కువగా ఉన్నాయి. 

జర్మనీ భిన్నమైన పరిస్థితులు గల దేశమైనప్పటికీ, ఆసియా దేశమైన దక్షిణ కొరియా అనుసరించిన వ్యూహం తమకు ఉదా హరణగా నిలుస్తుందని రాబర్ట్‌ కోచ్‌ వ్యాధుల నియంత్రణ అధ్యయన సంస్థ అభిప్రాయపడ్డది.

జర్మనీలో ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండటమే మరణాల శాతం తక్కువ కావడానికి కారణమని చెప్పవచ్చు. మిగతా యురో పియన్‌ దేశాలతో పోలిస్తే వైద్య వసతులు, పరికరాలు జర్మనీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. జర్మనీలో వెంటిలేటర్లు అమర్చిన ఇంటెన్సివ్‌ కేర్‌ పడకలు 28వేలు ఉన్నాయి. కానీ ఇటీవల తగినం త సిబ్బంది లేక కొన్నింటిని పక్కన పెట్టారు. 17వేల నర్స్‌ ఉద్యోగా లు భర్తీ చేయవలసి ఉన్నది. వైద్య నిపుణుల కొరతను అధిగమిం చడానికి పదవీ విర మణ పొందినవారిని, వైద్య విద్యార్థులను ఉపయోగించుకోవా లని ఆస్పత్రులు భావిస్తున్నాయి. జర్మనీలో రోజు రోజుకు ఈ వైరస్‌ సోకిన వారు పెరుగుతున్నారు. దీంతో వచ్చే కొన్ని వారా ల్లో కరోనా కేసులు ఉప్పెనలా వచ్చి పడ వచ్చునని జర్మన్‌ ఆరోగ్య మంత్రి జెన్స్‌ స్పాన్‌ హెచ్చరించారు. ఇటలీ ఆస్పత్రుల లోని పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొన వచ్చునని ఆరోగ్య నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. అందుకని జర్మనీ ప్రభు త్వం కూడా తన వ్యూహాన్ని మార్చుకు న్నది. పరిస్థితిని ధ్రువపరుచుకు నేందుకు పరీక్షలు జరపడం కాకుండా, పరిస్థితిని అధిగమించేందుకు పరీక్షలు నిర్వహించాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించింది. 

దక్షిణ కొరియా విస్తృత ప్రజాబాహుళ్యాన్ని పరీక్షిస్తూ, రోగుల ను గుర్తించి వారికి ఏకాంత వాసాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రజా జీవనానికి అంతరాయం కలుగకుండానే, వైరస్‌ కట్టడి జరిగింది. ఈ విధానమే ఇతర దేశాలకు ఆదర్శప్రాయ మైంది. చైనా మాదిరిగా దక్షిణ కొరియా కర్ఫ్యూలు విధించలేదు. ఈ నేపథ్యంలో జర్మనీ పరీక్షలు నిర్వహించే స్థోమతను వేగంగా పెంచుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఏప్రిల్‌ 13 నుంచి రోజుకు లక్ష మందికి, ఈ నెల చివరి నాటికి రోజుకు రెండు లక్షల మందికి పరీక్షలు నిర్వహించే స్థోమత పొందాలని సూచిస్తున్నారు. జర్మనీలో ప్రస్తుతం వారానికి ఐదు లక్షల మందికి పరీక్షలు జరుగుతున్నాయని బెర్లిన్‌కు చెందిన అంటువ్యాధుల వైద్య నిపుణుడు క్రిష్టియన్‌ డ్రాస్టెన్‌ గత గురువారం వెల్లడించారు.

(వ్యాసకర్త : శాసనసభ్యులు)


logo