ఆదివారం 07 జూన్ 2020
Editorial - Apr 03, 2020 , 22:58:19

ఈ సమయం

ఈ సమయం

ఈ సమయంగాని సమయంలో 

ఇక్కడెవరుంటారు?

బస్‌.. సాహిర్‌ లూధియాన్వీ.., 

నేనూ --- 

ఏకాంతంలో మిగిలిపోయాం!

అద్దంమీది పొగలమధ్యన 

తొంగిచూస్తోన్న జీవితం!

దీపంచుట్టూ రెక్కలాడిస్తున్న  

మహమ్మారి ‘కరోనా’ నృత్యం!

దూరందాకా  

భయం విస్తరించిన నిశ్శబ్దం!

బయట గస్తీ తిరుగుతోన్న 

మనుషుల్లాంటి  వైద్యులు!

ఈ ‘లాక్‌ డౌన్‌ ’ సమయంలో 

బస్‌.. ఇంట్లో నేనూ.., 

‘మాస్క్‌'లు తయారుచేయడం నేర్పుతున్న..,  

సాహిర్‌ లూధియాన్వీ 

మాత్రమే వున్నాం! 

... బస్‌ ! అంతే !!

ఆశారాజు ,9392302245


logo