మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 06:35:08

సమరంలోనూ ఆగని సంక్షేమం

సమరంలోనూ ఆగని సంక్షేమం

తెలంగాణలో అడుగు పెట్టిన కరోనా వైరస్‌ను కట్టడి చేస్తూ, ప్రజలకు మార్గదర్శనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోవైపు బంగారు తెలంగాణను సాకారం చేయవలసిన తన బాధ్యతను విస్మరించకపోవడం ప్రశంసనీయం. ఇంత ఒత్తిడిలోనూ ఆయన వ్యవసాయదారుల కష్టసుఖాలను పట్టించుకుంటున్న తీరు ఆశ్చర్యకరం.

కొత్త రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా సాగించడం, కరెంటు కొరత తీర్చడం, రైతులకు పెట్టుబడి ఖర్చు ఇవ్వడం మొదలైన కేసీఆర్‌ విధానాల వల్ల వ్యవసాయం పండుగగా మారింది. లక్షల ఎకరాల బీడు భూములు పంటపొలాలుగా మారాయి. అయితే ఆ పంట కోతకు వచ్చిన ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నందు వల్ల మార్కెట్లను మూసివేయ వలసి వచ్చింది. తమ పం టలు ఎలా అమ్ముకోవాలో తెలియక రైతాం గం మనోవేదనకు గురైంది. కానీ ఉద్యమనా యకుడు కేసీఆర్‌ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తక్షణమే ఆదుకోవడానికి చేపట్టి న చర్యలు రైతుల పాలిట వరంగా మారాయి.

ప్రస్తుత పరిస్థితులు  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సవాలుగా ఉన్నాయి. అయినప్పటికీ అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేం ద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందే విధంగా పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇప్పటికే మార్క్‌ఫెడ్‌కు 3200 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 25 వేల కోట్లు కేటాయించడం కేసీఆర్‌ అంకిత భావానికి నిదర్శనం. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ రబీ సీజన్‌ లో 53 లక్షల ఎకరాల్లో పంట వచ్చే అవకాశం ఉన్నది.  ఇందులో 39 లక్షల ఎకరాలలో కోటి మెట్రిక్‌ టన్నుల వరి, 6 లక్షల ఎకరాల్లో 15 లక్షల టన్నుల మక్క, లక్ష ఎకరాల్లో మిర్చి పండుతున్నది. వరికి 1815 నుంచి 1835 రూపాయలు, మక్కకు 1760 రూపాయలతో  కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేయడానికి ప్రభుత్వం దగ్గర 24 లక్షల మెట్రిక్‌ టన్ను ల స్థోమత ఉండగా ఇంకా అవసరం అయితే బడులు, కాలేజీ భవనాలలో నిలువ చేయడా నికి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు దాదాపు  16 కోట్ల గోనె సంచులు అవసరం కాగా, ఇప్పటికే  8 కోట్ల గోనె సంచులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయి తే  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సైతం మిగిలిన వాటిని  సమకూర్చేందుకు పశ్చిమ  బెం గాల్‌ ప్రభుత్వంతో మాట్లాడి, తెచ్చేందుకు కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. పంట కోతకు కూలీలు అవసరం కనుక వారిని బిహారు, ఛత్తీస్‌ గఢ్‌ తదితర రాష్ర్టాల నుంచి పిలిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు  చేసింది.  తెలంగాణలో ఉన్న వరికోత యంత్రాలు సరిపోకపోతే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తెప్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.     

కరోనా విలయతాండవం చేస్తున్న తరుణం లో రైతులందరూ ఒకేసారి ధాన్యాన్ని మార్కె ట్‌ యార్డులకు తీసుకురాకుండా పక్కా వ్యూహంతో, రైతులు భౌతిక దూరం పాటించేలా   చూడాలనేది కేసీఆర్‌ ఆలోచన. ఇందు కు పట్టణాలలో ఉన్న వ్యవసాయ మార్కెట్లను మూసివేసి గ్రామాల్లోనే ధాన్య సేకరణ జరిపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 6వేల కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.   ఇక్కడ కూడా రైతులందరూ ఒకేసారి గుమిగూడకుండా ఉండేందుకు  టోకెన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు.  

వచ్చే ఖరీఫ్‌సీజన్‌కు సైతం ఎటువంటి సమ స్య లేకుండా విత్తనాలు, ఎరువులు తయారుచేసే కంపెనీలు పనిచేస్తూనే ఉన్నాయి.   ప్రస్తు తం ప్రపంచం, దేశం కరోనా నివారణ చర్య ల్లో నిమగ్నమైంది.  ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అటు నివారణ చర్యలు చేపడుతూనే, ఇటు రైతాంగానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే. 

భారత దేశంలో వైద్యుడు - రోగుల నిష్పత్తి చాలా తక్కువ.  ఆస్పత్రుల కొరత కూడా ఎక్కువే. ఇటువంటి అనుకోని తీవ్ర విపత్తులు సంభవించినప్పుడు ఆసుపత్రులు,  వైద్యుల అవసరం ఎక్కువ అవుతుంది.  దూరదృష్టి కలిగిన మన ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా,   దవాఖానలలో కావలసిన మౌలిక వసతులు  ఏర్పాటు చేస్తున్నారు.  డాక్టర్ల కొరత తీర్చేందుకు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది తాత్కాలిక నియామకానికి ఆదేశాలు ఇచ్చారు. 

తెలంగాణలో భిన్నప్రాంతాల, సంస్కృతు ల ప్రజలు జీవిస్తున్నారు. కూలి పనుల కోసం, వ్యాపారం కోసం అనేక ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వస్తుంటారు. అసంఘటి త రంగంలో చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌ తదితర రాష్ర్టాల నుంచి వల స వచ్చిన వారి సంఖ్య దాదాపు 8 లక్షలు ఉం టుంది. తెలంగాణ రైస్‌ మిల్లుల్ల్లో 95 శాతం కార్మికులు బిహార్‌ రాష్ట్రం నుంచి వచ్చిన వారే. కరోనా కారణంగా వారు సొంత ప్రాంతాలకు వెళ్లడం  కుదరదు.  ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక రాజనీతిజ్ఞుడిగా కేసీఆర్‌ ఆలోచించా రు. విపత్తులప్పుడే మానవ స్వభావం బయటపడుతుంది. కేసీఆర్‌ ఇలాంటి నిరుపేద కూలీల ను తెలంగాణ అభివృద్ధిలో  భాగస్వాములుగా గుర్తించి, వారు ఆకలితో అలమటించకుండా  కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరో సా ఇచ్చారు. ఈ విధంగా యావత్‌ దేశానికి మార్గదర్శకంగా నిలిచారు. ఈ వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదుతోపాటు, వారు నివసించడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించా రు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల తో ఇతర రాష్ర్టాల కూలీలకు ‘అక్షయ పాత్ర’ ద్వారా ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం విజయవంతంగా జరుగుతున్నది.  

భారత దేశంలో వైద్యుడు - రోగుల నిష్పత్తి చాలా తక్కువ. ఆస్పత్రుల కొరత కూడా ఎక్కువే. ఇటువంటి అనుకోని తీవ్ర విపత్తులు సంభవించినప్పుడు ఆస్పత్రులు, వైద్యుల అవ సరం ఎక్కువ అవుతుంది.  దూరదృష్టి కలిగిన మన ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, దవాఖానలలో కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నా రు.  డాక్టర్ల కొరత తీర్చేందుకు డాక్టర్లు, నర్సు లు, పారామెడికల్‌ సిబ్బంది తాత్కాలిక నియామకానికి ఆదేశాలు ఇచ్చారు.  

ప్రజల్లో ఉన్న భయాన్ని, వదంతులను తొలిగించి వారికి భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న కృషిని చూస్తూనే ఉన్నాం. ఇందులో మూడు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 1. ప్రపంచంలో ఏ నాయకుడు చేయని రీతిలో విపత్తును దాని పరిణామాలను వర్తమానం లో, భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో వివరి స్తూ వాస్తవాలను అంకెలతో వెల్లడి చేస్తూ అప్రమత్తం చేశారు. 2.ఈ  విపత్తు కాలంలో ఆర్థిక వ్యవస్థ,  అభివృద్ది, సంక్షేమ రంగంలో ఎదుర య్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటామో తెలియజేస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను అశేష జన బాహుళ్యం నుంచి బుద్ధి జీవుల వరకు వివరించి ఆత్మ విశ్వాసం కల్పించారు. 3. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులతో పాటు రెవె న్యూ, వైద్య, పోలీస్‌ శాఖలను, స్థానిక సంస్థ లను సమన్వయంతో పనిచేసేలా సత్వర చర్యలకు సన్నద్ధం చేస్తూ ముందుకు తీసుకు పోవడంలో సీఎం నూటికి నూరు శాతం విజయం సాధించారు. కరోనా కరాల నృత్యాన్ని నియంత్రిస్తూ , వైద్యం ద్వారా  మన ప్రాణాన్ని కాపా డే ప్రయత్నం చేస్తున్నారు.   మరోవైపు సామాజిక భద్రతను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనకు దన్నుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలను విధిగా పాటించాల్సిన అవసరమున్నది. ఎమ రుపాటు, దుస్సాహసాలు ప్రాణంమీదికే తెస్తా యన్నది గ్రహించాలి. ఇది వ్యక్తి స్థాయి నుంచి సామాజికంగా అందరూ అనుసరించాలి.

(వ్యాసకర్త: ఎమ్మెల్సీ, ఛైర్మన్‌ రైతు బంధు సమితి)


logo