శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 03, 2020 , 06:33:52

కేంద్రం కన్నా ముందే అప్రమత్తం

కేంద్రం కన్నా ముందే అప్రమత్తం

దుబాయిలో పని చేసే రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన కటుకం రవి ఫిబ్రవరిలో వచ్చినప్పుడు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయనకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయలేదు. అప్పటికి కరోనా మహమ్మారి పీడిస్తున్న చైనా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, ఇరాన్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే పరీక్షలు నిర్వహించారు, అప్పుడు దుబాయి, ఇతర గల్ఫ్‌ దేశాలలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు.

హైదరాబాద్‌కు చెందిన 24 ఏండ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒక ప్రాజెక్టు పని నిమి త్తం దుబాయికి వెళ్ళి బెంగుళూరుకు వచ్చా రు. ఆయనకు అక్కడ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఆనారోగ్యం పాలైన తర్వాత గానీ కరోనా సోకినట్టుగా తెలియలే దు.ఈ ఉదంతం తర్వాత, గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వారి ద్వారా ఇక్కడ కరోనా సోకే  ఆవకాశాలున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారు. అప్పటికి కేంద్రం ఈ దిశగా అడుగులు వేయలేదు. విమానాల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు పలు రాష్ర్టాలలో మరణించిన కరోనా రోగులలో అనేకులకు గల్ఫ్‌ సంబంధం ఉన్నది.

సౌదీఅరేబియా నుంచి వచ్చిన 76 ఏం డ్ల వ్యక్తి కర్ణాటకలో చనిపోయిన తర్వాత గానీ కేంద్ర సర్కారు ఈ ప్రమాదాన్ని అంచ నా వేయలేకపోయింది! గల్ఫ్‌తో పాటు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ర్టాలకు అందజేసింది. తద్వారా తెలంగాణ రాష్ర్టానికి చెందిన 19,313 మంది ప్రయాణికుల వివరాలను అందించింది. కానీ ముందు చూపు కలి గిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే జాబితా కోసం వేచి చూడకుండా క్షేత్ర స్ధాయిలో ఉన్న తన పటిష్ట యంత్రాంగం ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిం చింది. వారి ఇండ్లకు వెళ్ళి స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన అవశ్యకతను చెప్పింది. అదే విధంగా, కరీంనగర్‌లో బయటపడ్డ ఇండోనేషియా మతప్రచారకుల విషయమై కూడా ముఖ్యమంత్రి సత్వర చర్యలు తీసు కున్నారు. వీసా వ్యవహారాలు కేంద్ర ప్రభు త్వ పరిధిలోని ఆంశం అయినా..,  వారు బస చేసిన ప్రాంత పరిసరాలను పూర్తిగా దిగ్భంధం చేసింది. అనుమానితులను ‘క్వారంటైన్‌'కు తరలించి తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది. 

పోలీసులు, ఆశావర్కర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగులు తరచుగా విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వారిని సందర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొంటున్నారు. ఈ రకమైన ముందు జాగ్రత్త చర్యలకు దేశంలో అందరి కన్నా ముందు శ్రీకారం చుట్టిన ఘనత తెలంగాణ సర్కారుకు దక్కుతుంది.ఈ విధంగా కటు కంరవిని కూడా కలిసిన వైద్య సిబ్బంది అతడిని స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేసి ఒప్పించారు. అందుకు ఆంగీకరించిన రవి గ్రామంలో ‘హోం క్వారంటైన్‌'లో గడుపుతున్నాడు.

విదేశాల నుంచి వచ్చిన వారు ముంద స్తు జాగ్రత్త చర్యలు పాటించాలని ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినంతగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పలేదు. ప్రవాసీయులు, వారి సమస్యల విషయంలో ఎంతో అవగాహన కలిగి    ఉన్న రాష్ట్రం గా కేరళకు పేరున్నది.కానీ కేరళ ప్రభుత్వం కూడ తమ ప్రవాసీల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేయలేక పోయింది. అందుకే కేరళలో నమోదైన మొదటి కరోనా మరణానికి దుబాయి కోణం ఉన్నదన్నది వెలుగు చూసింది. దీంతో గల్ఫ్‌ వలసలకు కేంద్ర మైన కాసర్ఘోడ్‌ ప్రాంతం అతాలకుతలమైంది. ఈ పరిస్ధితి గల్ఫ్‌ హబ్‌గా పేరు గాంచిన ఉత్తర తెలంగాణలో లేకపోవడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపే అనటంలో సందేహం లేదు. ఆయన సూచనలను అనుసరించి ప్రవాసీయులు తమ నివాసంలోనే ఉంటూ భౌతిక దూరా న్ని పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వా ములవుతున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఒకప్పటి తమ కరువు గ్రామంలో ఇప్పుడు వరి పంటలు కళకళాడుతున్నాయి. వ్యవసాయ పనులు చూడటానికి తన మనస్సు పరవళ్ళు తొక్కుతున్నదనీ, కానీ సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ఇంట్లో ఉంటున్నానని ఇదే జిల్లాకు చెందిన మరో దుబాయి ప్రవా సీ పెర్కొనటం గమనార్హం.

 గల్ఫ్‌ దేశాలలో బుధవారం వరకు నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణించారు. కరోనా పీడితుల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉన్నది. అమెరికాలో, యూరప్‌ దేశాలలో తెలంగాణ, అంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వారు అనేక మం ది ఉన్నారు.  గల్ఫ్‌ దేశాల ఖతర్‌ ఏయిర్‌ వేస్‌, ఇత్తేహాద్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా వీరు ప్రయాణిస్తుంటారు. దీంతో ఏ దేశం వారైనా గల్ఫ్‌ మీదుగా వచ్చే అవ కాశం ఉన్నది.అందువల్ల తెలంగాణ రాష్ట్రం ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదైంది. 


  • ముజఫర్‌ శ్‌ఖ్‌


logo