గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Apr 02, 2020 , 23:51:52

జర పయిలం

జర పయిలం

ఏడుంటివి ఎట్టుంటివి

ఏందయ్యా ఇదేందయ్యా?

పోరగాడు పల్లెనొదలి

విదేశాలు బోయాడని

డప్పుగొట్టి సెప్పుకోని

గొప్పలెన్నొ బోయినాము!


గుబులు గుబులవుతున్నది

కనపడని బయటపడని

కరోనా మహమ్మారి

ఊపిరి పట్టేత్తుందంట

ఆయువు తీసేత్తుందంట

దానిజోలి నీవెల్లబాక

పక్నోల్ల కలువబాక!


ఏడుంటివో ఆడేవుండు

గత్తిరి బిత్తిరిగాడివయ్యి

మూటముల్లె సదురుకోని

మాస్కుగట్టి ైప్లెటునెక్కి

మనదేశం రాబాక!


ఏదారిన కాపుకాచి

ఆ దెయ్యం ఎక్కేనో

క్వారెంటైన్‌ సెంటర్లల్ల

పరేషాను జేస్తరేమో!కన్నభూమి తల్లిరుణం

పాలించిన ఈ దేశరుణం


తీర్చే ఆరోజొచ్చింది

ఏడుంటివొ అట్టనే

ఎట్టుంటివొ అట్టనే

పెండ్లం పిల్లలతో

ఎపుడూ పాడేపాట

దొరకని దొంగకాలం

దాన్ని లాక్‌డౌన్‌ జెయ్యి

కిర్రాక్‌ పార్టీ జెయ్యి!


ఏడుంటివొ ఎట్టుంటివొ

కరోనాతొ జర పయిలం బిడ్డా!!


రవి కిషోర్‌ పెంట్రాల 

లాంగ్లీ లండన్‌


logo