ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Apr 02, 2020 , 23:51:18

బతుకు పుట్టి ముంచుకోకు

బతుకు పుట్టి ముంచుకోకు

ప్రపంచాన్ని ఊగించి

యుద్ధభేరి మోగించి

కరోనా నవ్వుతోంది

మనుషులనే విభజించి!


చేయి చేయి కలుపుకోకు

చేటును కొని తెచ్చుకోకు

నిర్లక్ష్యంగ నువ్వుండి

బతుకు పుట్టి ముంచుకోకు!


కౌగిలింత కరువాయెను

పలకరింత చేదాయెను

ఎదురు తిరిగినోడి శవము

పాడెకైన బరువాయెను!


అది తాగిన రాదన్నరు

ఇది వాడిన చాలన్నరు

సుద్ది చెప్పినోళ్లంతా

తమ ఇండ్లే మేలన్నరు!!

వెన్నెల సత్యం, 

9440032210


logo