శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 01, 2020 , 21:48:35

ఆపత్కాలంలో రైతుకు అండ

ఆపత్కాలంలో రైతుకు అండ

కరోనా వైరస్‌పై దేశం పదకొండు రోజులుగా యుద్ధం చేస్తున్నది. ‘సామాజిక దూరం’ లాంటి కఠిన నియమాలతో ఆ మహమ్మారిని పారదోలే ప్రయత్నంలో యావద్దేశం ముందుకు సాగుతున్నది. ఆ వైరస్‌ చైన్‌ను తుంచేయడమే లక్ష్యంగా 21 రోజుల ‘లాక్‌డౌన్‌' యజ్ఞంలో దేశం నిమగ్నమై ఉన్నది. ఇదొక అంటువ్యాధి విపత్తు. దాని తీవ్రతను జయించే సమర్థతను చాటుకోవాలసిన సందర్భం ఇది. ప్రజారోగ్యానికి కీలక సమ యం. ప్రభుత్వాల సమర్థతకూ పరీక్షా సమయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి బాగా కృషి చేస్తున్నాయని అందరూ అంగీకరిస్తు న్న విషయం. పాలకులు ఎంత సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకొని అమలును పర్యవేక్షించగలరో అనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే పాలకుల్లోని సమర్థత వెలుగు చూస్తుంటుంది.

‘జనతా కర్ఫ్యూ’ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా ప్రకటించారు. కేంద్రం కన్నా ఎక్కువగా మన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. చైనా దేశం జనవరి 7న కరోనా వైరస్‌ ప్రమాదాన్ని గుర్తించింది. జనవరి 21న ఆ వ్యాధి ‘ఔట్‌ బ్రేక్‌' అయ్యింది. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికతో మార్చి 11 నుంచి మన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయినా విదేశీ విమానాల రాకపోకలు మార్చి 22 వరకు కొనసాగాయి. 23 నుంచి నిలిచిపోయాయి. మరో పది రోజు ల ముందునుంచే (మార్చి 11 నుంచే) మూసివేసి ఉంటే, దేశంలో ఆ వ్యాధి తీవ్రత ఈ మాత్రం కూడా ఉండేది కాదేమో! ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులను మూసివేయాలని ప్రధా నికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లోనే సూచించారు. కరోనా విస్తరణను ప్రభుత్వం మొదట్లో అంచనా వేయడానికి ఏ దేశానికైనా కొంత సమయం పట్టొచ్చు. మన దేశంలోనూ కాస్త సమయం పట్టింది. అదే సమయంలో ఇతర దేశాల్లోనూ వ్యాధి విస్తరణను గమనించి త్వర గా విమాన రాకపోకలను నిలివేయాల్సింది. సమర్థ పాలకుడికి ఎప్పుడూ ముందుచూపే. కేసీఆర్‌ కూ అంతే!

విదేశాల నుంచి వచ్చిన వారిని కనిపెట్టడం, లాక్‌డౌన్‌ను అమలుచేయడం, క్వారంటైన్లు, కొత్త కేసులు, వైద్యులు, పోలీసుల సేవలు.. ఇలా అన్ని వ్యవస్థలనూ గాడిలో పెట్టి నడుపడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే! వైద్యరంగంలో మనకున్న వనరులు తక్కువ. కాబట్టి, కరోనా బాధితులకు డాక్టర్లు అందిస్తు న్న సేవలు అభినందనీయం. ఇక లాక్‌డౌన్‌ అమలు విషయంలో పోలీసుల పనితీరులో కొన్ని అనుకోని అపశృతులు (లాఠీ దెబ్బలు) ఉంటున్నా, తెలంగాణ పోలీసులకు వంద మార్కులు వేస్తున్నారు విశ్లేషకులు. సమస్య తీవ్రతను బట్టి పోలీసులకు కొంత స్వేచ్ఛ ఇచ్చి ఉంటారు! ఫలితంగానే లాక్‌డౌన్‌ మన రాష్ట్రం లో విజయవంతంగా సాగుతున్నది. ఇవాళ హైదరాబాద్‌ ఒక అంతర్జాతీయ నగరం. విదే శీ రాకపోకలు విపరీతంగా పెరిగాయి. కరోనా ప్రభావమూ ఎక్కువగా ఉండే అవకాశమూ ఉంది. ఏ మాత్రం అలసత్వం, అధికారుల్లో అప్రమత్తత లోపించినా ఇవాళ్టికి తెలంగాణలోనూ కరోనా బాధితుల సంఖ్య వందలు దాటేదేమో! డీజీపీ నుంచి హోంగార్డు దాకా పకడ్బందీగా పనిచేస్తుండటం, డాక్టర్లు, నర్సు లు, సిబ్బంది అహర్నిశలూ కష్టపడుతున్న ఫలితంగానే మన రాష్ట్రంలో చాలా మేరకు ఈ వ్యాధి కట్టడిలో ఉండగలుగుతున్నది. పాలకు డి సమర్థతపైనే పాలనా యంత్రాంగం సమర్థ త ఆధారపడి ఉంటుంది.

ఢిల్లీలో నిజాముద్దీన్‌లో మర్కజ్‌ సమావేశాలకు దేశ, విదేశాల నుంచి హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల మంది హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. మర్కజ్‌ సమావేశాలకు హాజరై వచ్చినవారిలో కరోనా వైరస్‌ కొందరికి సోకినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆరుగురు మరణించా రు. మరికొంత మందిని గుర్తించాల్సి వుంది. ఏదేమైనా ఇదొక దురదృష్టకర పరిణామం. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఢిల్లీ లో ఒక మతం సమావేశాలకు కేంద్ర హోం శాఖ ఏ విధంగా అనుమతించింది? దేశంలో వైరస్‌ విస్తరిస్తున్నప్పుడు ఇలాంటి సమావేశా లు అంత విచ్చలవిడిగా జరిగితే అది ఎవరి వైఫల్యం? ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తంగా లేవా అనే ప్రశ్న కేంద్రాన్ని వేలెత్తి చూపుతున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం యాభై బృందాలతో మర్కజ్‌ సమావేశాలకు హాజరైన వారిని గుర్తించడంలో నిమగ్నమైంది. కేంద్రం చేసిన చిన్న నిర్లక్ష్యానికి దేశమంతా మరింత ఇబ్బంది పడాల్సి రావడం దురదృష్టకరం.

ఇకపోతే, ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌. సామాన్యుని బతుకుకు అదొక సుదీర్ఘ కాలం. వలస కూలీలకు దినదిన గండం. ప్రతి పేద కుటుంబానికి 12 కేజీల బియ్యం, రూ.1500 నగదు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బాగుంది. ఇక రైతులకు పంటలు చేతికొస్తున్నాయి. మార్కెట్‌ కావాలి. లాక్‌డౌన్‌లో మార్కెట్‌ సౌకర్యం ఉండదు. కాబట్టి, ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్లి వారి పంటలు కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో రైతు లేని ఊరు ఉండదు. ఊర్లన్నీ స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. కాబట్టి వారి కష్టనష్టాలన్నీ తానే పట్టించుకుంటానని సీఎం భరోసానిచ్చారు. ఈ ఆపత్కాల సమయంలో ప్రభుత్వమే అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆషామాషీ కాదు. గోనె సంచుల కొర త, హమాలీలు, కోత యంత్రాల కొరత, అన్నింటికీ మించి ఖజానా కొరత ఉన్న ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంటల కొనుగోలుకు మాట ఇవ్వడం చూస్తే.. ఆయనొక ‘రైతు బాంధవుడు’ అని అనకుండా ఉం డలేం. ఈ పంటల కొనుగోలుకు ఏకంగా ముప్ఫై వేల కోట్ల రూపాయలు కేటాయించ డం చూస్తే ఇది పక్కా రైతు ప్రభుత్వమే అని స్వామినాథన్‌ సైతం చెప్పగలుగుతారు. ఈ ఆపత్కాల సమయంలో రైతాంగం పట్ల ఇంత టి శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో మరొకరు ఉండకపోవచ్చు. దేశంలోని ప్రభుత్వాలన్నీ కరోనా కట్టడిపైనే దృష్టి పెడుతున్నా యి. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం ఇటు కరోనా కట్టడిపై, అటు రైతాంగ కష్టనష్టాలపైనా దృష్టి పెట్టడం గొప్ప విషయం.

వ్యవసాయం ఆగమైతే మనకు తిండి  కూడా దొరుకదనే విషయాన్ని ఆ మధ్య కేసీఆ ర్‌ గుర్తు చేశారు కూడా. ఇలాంటి సమయంలో ప్రజల ఆరోగ్యంతో పాటు ఆహారానికీ ప్రాధాన్యం ఇవ్వడం పాలకుడి అవగాహనా సామర్థ్యమని చెప్పాలి. ఒకవేళ కరోనా పీడించినా, ఆహారోత్పత్తుల కోసం వ్యవసాయం ఆగం కాకూడదనే దూరదృష్టి అవసరం.

తెలంగాణలో రైతు లేని ఊరు ఉండదు. ఊర్లన్నీ స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. కాబట్టి వారి కష్టనష్టాలన్నీ తానే పట్టించుకుంటానని సీఎం భరోసానిచ్చారు. ఈ ఆపత్కాల సమయంలో ప్రభుత్వమే అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆషామాషీ కాదు. గోనె సంచుల కొరత, హమాలీలు, కోత యంత్రాల కొరత, అన్నింటికీ మించి ఖజానా కొరత ఉన్న ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంటల కొనుగోలుకు మాట ఇవ్వడం చూస్తే.. ఆయనొక ‘రైతు బాంధవుడు’ అని అనకుండా ఉండలేం.

నెలవారీ జీతాలు, షేర్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ల పై ఆధారపడి బతికే అమెరికా వంటి దేశాల కూ స్వయం సమృద్ధిలో ఆహారోత్పత్తులపై ఆధారపడి బతికే దేశాలకూ చాలా తేడా. అం దుకే అమెరికా సంపూర్ణ లాక్‌డౌన్‌ కాలేదు కూడా. మన దేశం ఇంకా మార్కెట్‌ సెన్సెక్స్‌ల పై పూర్తిగా ఆధారపడి లేదు. పాక్షికంగానే ఆధారపడి ఉంది. మన రైతు భూ కమతాలు చిన్న వి. ఇదే మన ఆహార స్వయం సమృద్ధి రహ స్యం. దేశాన్ని బతికిస్తున్నది కూడా అదే. కరోనా గడగడలాడిస్తుంటే ప్రపంచం రేపు కరెన్సీ నోట్లు తిని బతుకలేదు. ఆహారోత్పత్తులు కలిగి న దేశాలే రేపు ప్రపంచంలో నిలబడేవి. ఈ ఆపత్కాల సమయంలో సూక్ష్మ పరమార్థమెరిగిన ఏ పాలకుడైనా... ఓ వైపు కరోనాను కట్టడి చేసి తరిమేస్తూనే... మరోవైపు రైతును రక్షించుకునే పనిచేస్తారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పని కూడా ఇదే. పాలకుడి సమర్థతే సమాజానికి సంజీవని అవుతుంది.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)


logo