గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Apr 02, 2020 , T00:05

కేసీఆరే ఓ మెడిసిన్‌

కేసీఆరే ఓ మెడిసిన్‌

శత్రువుల నోటి వెంట కూడా పొగడ్తలు వచ్చేలా చేయడమే నాయకుడి లక్షణం. ప్రజలు మెచ్చేలా పాలన చేయడమే కాదు, అతిపెద్ద విపత్తు సంభవించినప్పుడు తన తెలివితో, అనుభవంతో దానిని ఎదుర్కొనగలిగే యుక్తి పాలకుడికి తెలిసి ఉండాలి. అంతటి శక్తి, ధైర్యం ఉన్న నాయకుడే కేసీఆర్‌. అందుకే ప్రపంచంలోని సుమారు రెండు వందల దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ‘నేనున్నాను.. మీరు అధైర్యపడవద్దు’ అంటూ తెలంగాణ ప్రజలకు గొప్ప భరోసా ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ర్టాన్ని ఒంటిచేత్తో సాధించిన నాయకుడు కేసీఆర్‌.. ఉద్యమ నేతే ఇప్పుడు పాలానధీషుడ య్యారు. ఈ ఆరేండ్లుగా కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. కేసీఆర్‌ను పాలకుడితో పాటు ఓ రక్షకుడిగానూ గుర్తించడం ఉత్తమం.

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణుకుతున్నది. ఆ ప్రభావం మన దేశాన్ని ఆలస్యంగా తాకింది. అయితే మన వాతావరణం దృష్ట్యా మనం వైరస్‌ బారిన పడకుండా కొంతమేరకు తప్పించుకు న్నా.. మిగిలిన దేశాలు  ఈ మహమ్మారి వైరస్‌కు దారుణంగా బలవుతున్నాయి. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా కరోనా వైరస్‌కు అతలాకుతలమవుతు న్నది. అందాల దేశం ఇటలీ గురించి ఇప్పుడు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక, చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్‌ ఆ దేశాన్నీ అల్లాడించింది. అయితే మిగతా దేశాలు వేరు, చైనా వేరు. ఇప్పుడు ప్రపంచ దేశాల ఆగ్రహాన్ని చైనా చవిచూస్తున్నది. కరోనా వైరస్‌ గురించి ప్రపంచం పడుతున్న ప్రత్యక్ష నరకాన్ని మనం కండ్లారా చూస్తున్నాం. అందుకు మన దేశమూ మినహాయింపేమీ కాదు. క్రమంగా మన దగ్గరా కేసులు పెరిగి చివరికి మరణాలనూ చూస్తున్నాం.. మున్ముందు ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం!

దేశంలోని ఏ రాష్ర్టాన్నీ వదలకుండా అన్ని రాష్ర్టాలను పట్టి పీడిస్తున్నది కరోనా వైరస్‌. అయితే ఇలాంటి పెను విపత్కర సమయాల్లోనే పాలకుల సమర్థత, విజ్ఞత, పాలనాదక్షతలు అవసరం. తనను నమ్ముకొని ఉన్న రాష్ట్ర బిడ్డలను కాపాడుకోవడం నాయకుడి ధర్మం. పాలనా అనుభవమే కాదు, ఒక విస్ఫోటనాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా పాలకుడికి ఉం డాలి. తుపాన్లను ఎదుర్కొని, సునామీలను తట్టుకొని, ఏటికి ఎదురీదు తూ రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కేసీఆర్‌ ఇప్పుడు తన అనుభవాన్ని రాష్ర్టానికి ధారపోస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ మెడిసిన్‌ లా ఉపయోగపడుతున్నారు.

పాలనా యంత్రాంగానికి కర్తవ్య బోధ చేస్తూ.. కనిపించని శత్రువుపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్‌ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పగలూ రాత్రి నిద్రాహారా లు కూడా లెక్కచేయకుండా వరుస సమీక్షలతో కార్యాచరణ రూపొందిస్తూ అమలుపరుస్తున్నారు. ఇక ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు తరచూ నిర్వహిస్తున్న మీడి యా సమావేశాలు ఈ కరోనాను తప్పక జయిస్తామనే ఆశను పెంచుతున్నాయి. కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలి, మనవంతు బాధ్యత ఎలా నిర్వర్తించాలి, లాక్‌ డౌన్‌ పీరియడ్‌ కఠినమే అయినా ఎలా స్వీయ నియంత్రణ పాటించాలి వంటి విషయాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కర్తవ్యాలన్నీ విస్పష్టంగా ఆయన చెబుతున్న తీరు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలనే కాదు, యావత్‌ దేశాన్నీ ఆకర్షిస్తున్నది. కరోనా వైరస్‌ కట్టడికి మిగతా రాష్ర్టాల కంటే భిన్నంగా ముందుకువె ళ్తూ చాలా వరకు కట్టడి చేయడంలో కేసీఆర్‌ ఒక శాస్త్రవేత్తలా విజయవంత మవుతున్నారు. సాధిస్తారు కూడా. కరోనాను కూడా కట్టడి చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రాష్ట్రం లోని ప్రతి ఇంటికీ 12 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం కుటుంబానికి రూ.1500, తెలంగాణ లో ఉన్న ఇతర రాష్ర్టాల వారికి రూ. 500 సహా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. సామాన్యుడిపై పట్టింపును ఇంత దూరదృష్టి తో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడగలడు? కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసు. తెలంగాణ బంద్‌ పెడితే ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతారో ఒక సామాన్యుడిలా కేసీఆర్‌ అంచనాకు రాగలరు. అందుకే కరోనా పై ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల కంటే యుక్తిగా యుద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజలను భాగస్వాముల ను చేస్తున్నారు. కాకపోతే ఆయన ఫీల్డ్‌లో ఉంటూ, ప్రజ లు ఇంటిపట్టునే ఉండాలని చెప్తున్నారు. అలా చేస్తేనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమని ప్రజలకు వివరిస్తున్నారు. కలెక్టర్లకు సూచనలిస్తూ మానిటరింగ్‌ చేయడం కేసీఆర్‌ పాలనా పరిణతికి అద్దం పడుతున్నది.

కరోనా కట్టడికి కేసీఆర్‌ చూపిస్తున్న పరిపక్వతను ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు. అందుకే సోషల్‌మీడియాలో దేశంలో కరోనాను జయించిన రాష్ట్రం తెలంగాణే అవుతుందన్న ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణకు కేసీఆర్‌ గొప్ప వరమంటూ కితాబిస్తున్నారు. 

కేసీఆర్‌ లాంటి సీఎం తెలంగాణకు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమంటున్నారు. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టే పోరాటంలో అనే కరంగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తెలంగాణకు కీలకరంగమైన వ్యవసాయంపైనా కేసీఆర్‌ తన ప్రత్యేక తను చాటుకున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ రైతులు పండించే ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి బేషరతుగా కొంటుందనే హామీని మరోసారి ప్రకటించారాయన. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానిచుట్టూ అల్లుకొని ఉన్న సమస్యలను సవివరంగా విశ్లేషించడం వెనకున్న పరిశీలన, అవగాహన రైతాంగ సమస్యలు వాటి పరిష్కారాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నవి.

జనతా కర్ఫ్యూ దేశమంతా 14 గంటలే ఉన్నది. కానీ, కేసీఆర్‌ ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో 24 గంటలు చేశారు. అలాగే, దేశమంతా లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకే ఉన్నది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో అడుగు ముందుకేసి ఒకరోజు ముందుకు జరిపా రు. అంతేకాదు, లాక్‌డౌన్‌ కట్టుదాటే వాళ్లకు గట్టి హెచ్చరికలు కూడా చేశారు. అవసరమైతే ఆర్మీని దింపి ‘షూట్‌ ఎట్‌ సైట్‌' ఆదేశాలివ్వాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితిని కొనితెచ్చుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించడం కేసీఆర్‌కే సాధ్యం. కరోనా కట్టడికి కేసీఆర్‌ చూపిస్తున్న పరిపక్వతను ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు. అందుకే సోష ల్‌ మీడియాలో దేశంలో కరోనాను జయించిన రాష్ట్రం తెలంగాణే అవుతుందన్న ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణకు కేసీఆర్‌ గొప్ప వరమంటూ కితాబిస్తున్నా రు. కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉం డ టం రాష్ట్ర ప్రజల అదృష్టమంటున్నారు. కేసీఆర్‌ ఇప్పు డు దేశానికే కాదు, ప్రపంచానికే రోల్‌మోడల్‌.

(వ్యాసకర్త: తెలంంగాణ రాష్ట్ర మంత్రి)

తాజావార్తలు


logo