సోమవారం 25 మే 2020
Editorial - Mar 31, 2020 , 22:38:27

పౌరులే బాధ్యత మరిస్తే..?

పౌరులే బాధ్యత మరిస్తే..?

మన జీవితంలో కనీవిని ఎరుగని, ఊహకందని మహా విలయం కరోనా. ఈ విపత్తు నుంచి మనం తప్పకుండా బయటపడుతాం. మన దేశానికి సంబంధించినంతవరకు మనది అదృష్టమే. చైనా, ఇటలీ, అమెరికా, ఇరాన్‌, స్పెయిన్‌ లాంటి దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. భారత్‌ మీద కరోనా ప్రభావం అంతగా లేదు. అందుకే, అతితక్కువ మరణాలతో మనం ఈ మహమ్మారి బారినుంచి సురక్షితంగా బయటపడగలమనే ఆశాభావం ఉన్నది. రాజకీయాలను పక్కనబెట్టి కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి.

సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ప్రజల కు ఊరట కలిగించే చర్యలు చేపడుతూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. నిత్యావసరాలు అందుబాటులో ఉండేవి ధంగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడికి కృషిచేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకునే ప్రణాళికలు రచిస్తూ, అమలుపరుస్తున్నారు.

ప్రస్తుత సంక్షుభిత సమయంలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న డాక్టర్ల లాగనే తాము కూడా క్షేత్రంలోకి దిగి పనిచేయాలని ఆరాటపడుతున్న వ్యక్తులు, సంస్థల సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. వీరందరినీ రంగాలవారీగా లేదా అవసరా ల ప్రాతిపదికన నెట్‌వర్క్‌ చేయాలి. ముఖ్య మంత్రి చెప్పినట్టు డాక్టర్స్‌ పూల్‌ వలె సామాజిక సైనికుల పూల్‌ చేయాల్సిన అవసరం ఉన్నది.

ఇన్ని చర్యలూ, ఇంత ప్రణాళికా ఎందు కు అవసరం అంటే, ఈ విపత్తు ఇప్పుడిప్పుడే సమసేలా లేదు. ఉష్ణ ప్రదేశాల్లో కరో నా వైరస్‌ ఎక్కువకాలం మనలేదని నిపుణులు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఈ ఎం డాకాలం మనకు ఇంతటి శాపంలోనూ ఒక వరం లాంటిది. కానీ ఇదొక హెచ్చరిక కూడా. రాబోయే రెండు మూడు నెలల్లో వైరస్‌ సద్దుమణిగినా, డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో మళ్లీ విజృంభించే ప్రమా దం ఉన్నది. ఉత్పాతం పెద్దది కాబట్టి వ్యక్తులు, సంఘాలు, వేదికలు, సంస్థలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కరోనాపై  అంద రూ కలిసి పోరాడాల్సిం దే. విజయం సాధించాల్సిందే. వేరే మార్గం లేదు.

అయితే బాధ్యతగల పౌరులు ఏం చేయాలి? సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వా న్ని చూసే దృష్టి ఇలాంటి విపత్కర పరిస్థి తుల్లో పనికిరాదు. ప్రతి ఒక్కరూ తామే ప్రభుత్వమని భావించక తప్పని తరుణం ఇది. నిజానికి ఎల్లవేళలా ఆ అవగాహనే సరైనది. కానీ భారత్‌లాంటి అవిద్య, ఆక లి, పేదరికం రాజ్యమేలే చోట ప్రజా బాహుళ్యంలో ఇంతటి మనోవికాసాన్ని, చైతన్యాన్ని ఆశించలేం. రోజువారీ సమస్యలతో సతమతమయ్యే వారి ముందు ఈ ఆలోచన పెట్టడమే అన్యాయం. అయితే ప్రస్తుత సంద ర్భం వేరు. ఇప్పుడు పాలకు లు, పాలితులు కలిసి తమనుతాము రక్షించుకోకపోతే ఎవ్వరమూ మిగలం. అందుకే కొంచెం మనసువిప్పి మాట్లాడుకోవాలి.

డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అధికారగణం, సామాజి క కార్యకర్తలు, ప్రజాసం ఘాలు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీలు, అందరూ తమ వంతు కృషి చేస్తూ ఉంటే, ‘మెంబర్‌ ఆఫ్‌ ది పబ్లిక్‌' ఎంత బాధ్యతగా ఉండాలె? కానీ కొందరు సామాజిక దృష్టిని మర్చిపో యి వ్యవహరిస్తున్నారు. ఎక్కడెక్కడినుం చో వచ్చి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయమనడం ఎంత అమానవీయం? కరోనా బాధితులకు సపర్యలు చేస్తున్న వైద్యులు, ఆశావర్కర్లు, ఏఎ న్‌ఎంలను ఇళ్ళకు, కాలనీలకు రాకుండా కట్టడి చేయడం ఎంత దుర్మార్గం? సూపర్‌ మార్కెట్లలో ఉన్న తిండి సామగ్రి, శానిటైజర్లను పెద్దపెట్టున కొని ఇళ్ళల్లో దాచుకోవ డం ఎంత స్వార్థం? సామాజిక దూరాన్ని పాటించండని వృత్తాలు గీస్తే, బస్టాప్‌లో పెట్టుకున్నవిధంగా కర్చీఫ్‌లు, బ్యాగులు పెట్టుకొని తాము మాత్రం గుంపులుగా మాట్లాడుకోవడం ఎంత నిర్లక్ష్యం? ఏ మాత్రం నిర్ధారణ చేసుకోకుండా అసత్య వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం చేయటం బాధ్యతారాహిత్యం కదా?

కష్టకాలంలో నిత్యావసరాల ధరలు పెంచి అమ్మటం, కృత్రిమ కొరత సృష్టించడం అన్యాయం కాదా? ప్రైవేట్‌ సంస్థ లు, కర్మాగారాల యజమానులు ‘మీ దా రి మీరు చూసుకోండ’ని తమ ఉద్యోగుల ను వదిలేయటం ఎంత శోచనీయం?

ప్రజలారా! మీరు కూడా ప్రభుత్వమే అని గుర్తించండి. మీ సహకారం లేకపోతే ఈ మహమ్మారిని ఎదిరించలేమని తెలుసుకోం డి. బెదిరిస్తేనే తప్ప మాట వినమంటే ఎట్లా? ‘బలవంతంగా ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు’ అని హెచ్చరిస్తే తప్ప మానవత్వం మేల్కొనకపోతే ఎట్లా? సమాజం తోడులే నిదే ఎవరైనా ఎదగడం సాధ్యమా? డాక్టర్లను అడ్డుకోవద్దని ప్రభుత్వం పిలుపునివ్వాల్నా? 

నాగరికులు, చదువుకున్నవారు, ఎన్నారైలు మరీ ఘోరం! క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పారిపోవడం, విదేశాల నుంచి వస్తూ పరీక్షలకు దొరుకకుండా పారసిటమాల్‌ వేసుకొని రావడం ఎవరిని మోసం చేయడానికి? మీ కుటుంబాన్నే నాశనం చేస్తున్నామన్న ఎరుక ఉండొద్దా?

మిగిలిన దేశాలతో పోలిస్తే మన పరిస్థితి బాగున్నది. దీన్ని విషమించకుండా చూడాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కరో నా వ్యాప్తిని కేవలం ప్రభుత్వం, ఆర్మీ, ఆర్థి క ప్యాకేజీలు నిలువరించలేవు. సమరాని కి  ప్రతి ఒక్కరూ త్రికరణశుద్ధితో ముందు కురావాలి. ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలతో కలిసి నడువాలె.


logo