శుక్రవారం 05 జూన్ 2020
Editorial - Mar 31, 2020 , 22:37:05

వీరివైపు చూడరూ..!

వీరివైపు చూడరూ..!

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌రావు గారికి...

ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ కరోనా వైరస్‌ కోరలు చాస్తూ విజృంభిస్తున్న తరుణంలో మీ ఆధ్వర్యంలో  తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో సానుకూల ఫలితాలిస్తున్నాయి. వైరస్‌ విస్తరణను నిలువరించాయి. కోవిడ్‌-19 ప్రమాదం కూడా నామమాత్రం చేయబడింది. క్లిష్ట సమయాల్లో క్లిష్ట నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందనేది మీకు తెలిసిందే. నెలవారీ ఆదాయం, చిన్న మధ్యతర హా వ్యాపారాల మీద ఆధారపడిన మధ్యతరగతి మీద పడిన ప్రభావం ప్రధానమైనది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ కూడా అన్నివర్గాల వారికి బ్యాం కు రుణాలపై మారిటోరియం ప్రకటించటం గమనార్హం.

ఈ నేపథ్యంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృతరంగంలోని వారికోసం ఈ ఆదేశాలు జారీ చేయాలి.

గృహాలతో పాటు చిరు వ్యాపారా లు చేసుకొని జీవించే చిన్న, మధ్యతర హా రిటేల్‌ వ్యాపారుల నుంచి బాడుగ (రెంట్‌)ను వాయిదా వేయవలసింది గా సంబంధిత వర్గాలకు సూచిస్తూ, ఆదేశాలివ్వాలి.

ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇచ్చే రుణాలపై కూడా వడ్డీ వసూలును ఆపించివేయాలి.

వ్యవస్థీకృత, అవ్యస్థీకృతరంగంలో చిట్టీల చెల్లింపులను నిలిపివేయాలి.

అన్ని ఆర్థికలావాదేవీలను రెండు నెలల పాటు నిలిపివేయాలి.

ఈ మేరకు వ్యవస్థాగత, అవ్యవస్థాగత రంగాలు రెండింటికీ మీరిచ్చే ఆదేశాలు ఊరటనిస్తాయని మనవి.

- తమ విధేయులు


logo