శుక్రవారం 29 మే 2020
Editorial - Mar 30, 2020 , 22:58:04

కేంద్రానికి ముందుచూపు ఏది?

కేంద్రానికి ముందుచూపు ఏది?

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అందరికన్నా ముందుగా మేల్కొన్నది తెలంగాణ ప్రభుత్వం. రవాణా సదుపాయాలను కట్టడిచేసి, రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించి, వైద్య ఆరోగ్యసేవలను విస్తృతపరచి, విదేశాలనుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నవారిపై ఇరువై నాలుగు గంటలూ నిఘా వేసి, అవస రమనుకుంటే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది.

రెండో ప్రపంచ యుద్ధసమయంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదభూతం లక్షలాది మందిని కబళించినప్పుడూ, కొన్ని క్షుద్రదేశాలు వినాశకర ఆయుధాలను తయారుచేశామని ప్రకటించుకున్నప్పుడు కూడా ప్రపంచం ఇంతగా భీతిల్లలేదు. ఇవాళ కరోనా అనే మూడక్షరాల రక్కసి పేరు వింటేనే మానవాళి గజగజా వణికిపోతున్నది. ఎక్కడో విశ్వాంతరాళంలో లక్షల కిలోమీటర్ల దూరంలో గల గ్రహాల్లో ఏమున్నదో కూడా దర్శించగల మానవులు కళ్ళముందే వికటాట్టహాసం చేస్తూ యమపాశం విసురుతున్న కరోనా సమవర్తిని వీక్షించలేకపోతున్నారు.  ఈ దేశం ఆ దేశం అనే భేదం ఏ మాత్రం లేకుండా గొంతులకు ఉరితాళ్లు బిగిస్తున్న కరోనా యమధర్మరాజును నిరోధించడం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపినంత తేలిక కాదని తెలుసుకుంటే, ప్రకృతిప్రకోపం ముందు మానవ ప్రతిభ ఎంత అల్పమైనదో తలచుకుంటే కన్నీళ్లు రాక తప్పుతుందా?

ప్రకృతి బీభత్సాలు, ఉత్పాతాలు ఉపద్రవాలు సహజమే. చట్టసభల్లో మెజారిటీ, చేతి లో అధికారాలు ఉన్నంతమాత్రాన ప్రకృతి కన్నా మనం అధికులం కాము. కానీ, ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి అప్రమత్తం గా ఉండకపోతే, మన అజాగ్రత్త వల్ల దేశం మొత్తం క్షోభిస్తుంటే, అందుకు బాధ్యత ఎవరి ది? నిజానికి కరోనా వైరస్‌ గురించి గత నవంబర్‌ రెండో వారంలో తొలిసారిగా వినిపించిం ది. చైనాలోని వూహాన్‌ నగరంలో ఈ వైరస్‌ను  మొదట గుర్తించారు. ఆ తర్వాత అది ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌,  ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌, మొదలైన దేశాలన్నింటినీ చుట్టి మూడు నెలల తర్వాత చివరి మజిలీ అన్నట్లు మన దేశంలో ప్రవేశించింది.  మరి మూడునెలల పాటు మన కేంద్ర ప్రభు త్వం ఏం చేస్తున్నట్లు? కరోనా విపత్తును ఎం దుకు అంచనా వేయలేకపోయింది? ఫిబ్రవరి రెండోవారంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ఒక ట్వీట్‌ ద్వారా కేంద్రాన్ని కరోనా విషయమై హెచ్చరించారు.  ఆయన్ను పప్పు అంటూ కేంద్రం పరిహసించి నిర్లక్ష్యం చేసింది. అప్పటికీ ఇప్పుడున్నంత ఉధృతి లేదు. మన శాస్త్రజ్ఞులు, వైద్యులు, అధికారులు ఏం చేస్తున్నారు? ఆరోగ్యమంత్రి ఏం చేస్తున్నా రు? ప్రపంచదేశాల్లో ఈ కరోనా వ్యాపించి వేలాదిమంది బలైపోతున్నప్పుడు, ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నపుడు మన కేంద్ర పెద్దలు ఎందుకు మేలుకోలేకపోయారు? కనీ సం జనవరిలోనైనా విదేశాల నుంచి మన దేశానికి రాకపోకలు నిషేధించి, వీసాలు రద్దు చేసి,  ఎవరైనా మన దేశానికి రాగానే విమానాశ్రయాల్లోనే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అటు నుంచి అటే ఐసోలేషన్‌ సెంటర్స్‌కో, క్వారంటైన్‌ సెంటర్స్‌కో తరలించి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండేదా?  ఇది అంటువ్యాధి అని,  దీనికి వాక్సిన్‌ లేదని, చికిత్స లేదని, మూడో స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇక జీవించడం కష్టమని, నాలుగో స్టేజ్‌కు వచ్చాక మిగిలేది  శవాలదిబ్బలే అని కేంద్రం గుర్తించలేకపోవడం వారి వైఫల్యం కాదా? చేతులు కాలాక ఇప్పుడు హఠాత్తుగా లాక్‌డౌ న్లు, షట్‌డౌన్లు, జనతా కర్ఫ్యూలు అంటూ హడావుడి చేస్తున్నది. పోనీ, ఇప్పుడు తీసుకుంటున్న చర్యలైనా ప్రణాళిక ప్రకారం ఉన్నా యా? మరి కాసేపట్లో మీదగ్గరున్న పెద్దనోట్లు అన్నీ చిత్తుకాగితాలతో సమానం అని ప్రధాని ప్రకటించిన తీరు జ్ఞాపకం వస్తున్నది.

లక్షలాది మంది పర్యాటకులు, విద్యార్థు లు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు ఇంకా అనేకవర్గాల వారు తమ పను ల నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉం టారు. అక్కడినుంచి వారు తమ గృహాలకు చేరుకోవాలంటే కనీసం రెండుమూడు రోజు లు పడుతుంది. మరో రెండు గంటల్లో జనతా కర్ఫ్యూ మొదలవుతుందని ప్రకటిస్తే వారంతా ఏమైపోవాలి?  ఎక్కడికి పోవాలి? ఈ అర్ధరాత్రి నుంచే రైళ్లు, బస్సులు, లారీలు, ఆటోలు బంద్‌ అంటే వివిధ రాష్ర్టాల వారు తమ గ్రామాలకు ఎలా చేరుకుంటారు? రాష్ర్టాంత రం వెళ్లిన వేలాదిమంది కూలీనాలీ జనం వివి ధ రైల్వేస్టేషన్లలో ఇరుక్కొనిపోయారు. వారి దగ్గర డబ్బులుండవు. నగరాలు, గ్రామాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, షాపులు అన్నీ మూసేశారు. తినటానికి  తిండి లేక, పడుకోవడానికి బెత్తెడు జాగా లేక, చేతిలో డబ్బులు లేక, గమ్యం వెళ్లడానికి మార్గం కానరాక, లక్షలాదిమంది నరకం చూస్తున్నారు. ఇక వేలాదిమంది ఉత్తరదేశ యాత్రలు, దక్షిణదేశ యాత్ర లు, అంటూ గ్రూపులుగా బస్సుల్లో, రైళ్లలో తీర్థయాత్రలకు వెళ్లారు. వారిలో తొంభై శాతం మంది పండు వృద్ధులు, రోగులూ ఉంటారు.  చాలామంది మధుమేహం, రక్తపోటు, కాళ్లనొప్పులు, లాంటి వ్యాధులతో బాధపడుతుంటా రు. పది పదిహేను రోజులకు సరిపడా మం దులు, బట్టలు తీసుకెళ్తారు వీరంతా. హఠాత్తు గా వీరంతా వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోవడంతో, అక్కడి భాష తెలియక, ఎక్కడ నిద్రించాలో తెలియక అల్లాడిపోతున్నారు. హఠాత్తు గా కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తే వీరంతా ఏమైపోతారన్న కనీస ఆలోచన కేంద్రానికి లేకపోయింది! నాలుగు నెలలు నిర్లక్ష్యంగా వ్యవహరించినవారు మరో నాలుగురోజులు ఆగలే రా? కనీసం రెండు రోజులు గడువిచ్చి వేరేప్రాంతాల్లో ఉన్నవారు ఏ రైలో ఎక్కి  తమ ఇళ్లు చేరుకునే అవకాశం కల్పించకపోవడం ఘోరం కాదా! అవసరమైతే అలాంటి వారికోసం ప్రత్యేక రైళ్లను, విమానాలను ఏర్పాటు చెయ్యడం కేంద్రానికి ఎంత పని?  ఏ విధమై న ముందస్తు జాగ్రత్తలు లేకుండా హడావుడి గా తెలివి నిర్ణయాలు తీసుకోవడం,  అందు లో కూడా వ్యక్తిగత ఖ్యాతి కోసం పాకులాడ టం మన ప్రధానికి ఒక అలవాటుగా మారిపోయింది. మనకు మరణాలు తక్కువే అని చం కలు గుద్దుకోవడం కాదు. ఇతర దేశాల్లో నాలు గు నెలల నుంచి ఉన్న వైరస్‌ మన దేశంలో తన ఉనికిని చాటడం పది, పదిహేను రోజుల కిందటే మొదలైందని గ్రహించాలి. రెండు మూడు నెలల కిందటే మనం జాగ్రత్తపడినట్లయితే ఇవాళ పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. ఇది ముమ్మాటికీ కేంద్రప్రభుత్వ వైఫ ల్యమే.

ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి కేం ద్రం కేటాయించింది కేవలం పదిహేనువేలకోట్ల రూపాయలు! పటేల్‌ విగ్రహానికి, శివాజీ విగ్రహానికి కలిపి ఆరు వేల కోట్ల రూపాయల ను ఖర్చుచేసిన కేంద్రం కరోనా భూతాన్ని ఎదుర్కోవడానికి ముష్టి వేసినట్లు విదిల్చడం వారి చిత్తశుద్ధిలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నది.కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అందరిక న్నా ముందుగా మేల్కొన్నది తెలంగాణ ప్రభు త్వం. రవాణా సదుపాయాలను కట్టడిచేసి, రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించి, వైద్య ఆరోగ్యసేవలను విస్తృతపరచి, విదేశాలనుం చి, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నవారిపై ఇరువై నాలుగు గంటలూ నిఘా వేసి, అవస రమనుకుంటే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికార యంత్రాంగం  అప్రమత్తం గా వ్యవహరిస్తున్నది. అధికారులతో, మంత్రులతో అనేకసార్లు సమీక్షలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వారికి మార్గదర్శనం చేస్తూ, నిధు లు సమకూర్చుతూ కేసీఆర్‌ కరోనా మీద చేస్తు న్న సమరాన్ని యావత్‌ దేశం ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నది. ‘చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా.. వినకపోతే దండాలు (లాఠీలు) తీస్తం. ఇరువై నాలుగు గంటలు కర్ఫ్యూ పెడు తం.. పోలీసుల వల్ల కాకపోతే ఆర్మీకి అప్పచెప్తం.. షూట్‌ అటు సైట్‌ ఆర్డర్స్‌ ఇవ్వా ల్సి వస్తది. అంతవరకు తెచ్చుకొందమా?’ అని కేసీఆర్‌ హెచ్చరించి తనలోని నిజమైన రాజధర్మం తెలిసిన పాలకుడిని బయటపెట్టడం ఆయన సమర్థతకు మచ్చుతునక.  ఇరుగు పొరుగు రాష్ర్టాల ప్రజలు కూడా కేసీఆర్‌ పనితీరును మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసి న నాయకుడు కేసీఆర్‌ అని చెప్పుకుంటున్నారు ప్రజలు.ఇక చివరిగా మనం తప్పకుండా ప్రస్తావించుకోవలసింది మన పోలీసులను, మన వైద్య సిబ్బందిని, అధికార యంత్రాంగాన్ని, పారిశు ధ్య కార్మికులను.  దేశమంతా భయపడి ఇళ్లలో దాక్కుంటే, వీరు మాత్రం ఇళ్ళు, కుటుంబాలను వదిలేసి ఇరువై నాలుగు గంటలూ రోగులకు సేవలు చేస్తూ, రోడ్ల మీద కాపలా కాస్తూ, తిండీతిప్పలు కూడా సరిగా లేకుండా తమ విధులను నిర్వహిస్తున్నారు. వీరికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం.  

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

-ఇలపావులూరి మురళీమోహనరావు


logo