గురువారం 04 జూన్ 2020
Editorial - Mar 30, 2020 , 22:56:33

వికేంద్రీకరణే మంత్రం

వికేంద్రీకరణే మంత్రం

కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఏప్రిల్‌ 14 వరకు గీసుకున్న లక్ష్మణరేఖను ప్రజలు దాటుతారా లేక కరోనానే దాటుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర పర్యవేక్షణతో కరోనాను అంతమొందించడానికి సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. మోదీ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండి అమూల్యమైన జాగ్రత్తలు-చర్యలు తీసుకుంటున్నాయి. మోదీ ‘మన్‌ కీ బాత్‌' ద్వారా ప్రజలకు చేరువై ధైర్యాన్ని నింపుతున్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానాలో ఉన్న కరోనా బాధితునితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దాంతో కరోనా సోకినా భయకంపితులు కావాలిసిన అవసరం లేదనే సంకేతాన్ని దేశ ప్రజలకు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వివిధ శాఖల పనితీరును విశ్లేషించి, కరోనా గణాంకాలను పరిశీలించి తెలంగాణ ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏప్రిల్‌ 7 వరకు తగ్గుముఖం పడుతుందని, అయినా జాగ్రత్తపడటం మంచిదని, అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదని ప్రకటించటం వల్ల ప్రజలకు, బాధితులకు ధైర్యాన్ని కలిగించడం హర్షించదగిన ది. కరోనా తప్పకుండా నిర్మూలించబడుతుందని ఆశిద్దాం. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వైరస్‌ను తక్కువ అంచనా వేయకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ‘ప్లాన్‌-బీ’ని కూడా ఏర్పాటు చేసుకొని అట్టడుగుస్థాయి వరకు సేవా కార్యక్రమాలను నిరంతరంగా అందించే వ్యవస్థను రూపొందించుకోవాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎన్జీవోలను, లయన్‌, రోటరీలను ఇతర కార్యకర్తలను భాగస్వాములను చేసి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా కరో నా వైరస్‌ సృష్టిస్తున్న భయానక పరిస్థితి కళ్ళకు కట్టినట్లు గా ప్రచార, ప్రసార సాధనా ల ద్వారా ప్రతి ఇంటికి చేరిం ది. ముందు జాగ్రత్త చర్యల గురించి కూడా ఈ సాధనా లు ప్రజలకు అవగాహన కలిగించడంలో సఫలీకృతమయ్యాయి. ఇతర వ్యవస్థలతో ఇంత త్వరగా ప్రజల ను అప్రమత్తం చేయడం అసంభవం. వీరికి సమాజం ఎంతో రుణపడి ఉన్నది. అయితే వివిధ దేశాల్లో కరోనా వల్ల జరుగుతున్న హృదయవిదారక సంఘటనల ను పరిగణనలోకి తీసుకొని, ప్రజలందరూ రాజకీయాలను, కులాలను, వర్గ వైషమ్యాల ను పక్కనబెట్టి, ఒక వినూత్నమైన ఆమోదయోగ్యమైన, ఆచరణయోగ్యమైన, సమగ్రమై న కార్యచరణతో ముందుకుపోవాలి. ప్రజల కు ధైర్యాన్ని కలిగించడంతో పాటు వారిని భాగస్వాములను చేసి మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వాలు తెలియజేయాలి. ముందు జాగ్రత్తల గురించి ప్రచార, ప్రసార సాధనాలు ఉపయోగపడి నా, ఈ వ్యాధి బారిన పడినవారికి ప్రత్యక్ష సేవలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక సిబ్బంది, వైద్య అనుబంధ విధులు నిర్వహిస్తున్నవారు అవసరం. కేవ లం ప్రభుత్వమే అన్నీ చేస్తుందనుకోవడం సరికా దు. కొన్ని పొరపాట్లు జరిగి నా మన సమాజం మంచి కోసం కలిసికట్టుగా నిలబడుతుందని ఎన్నో సందర్భా ల్లో రుజువు చేసుకున్నది.

ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఆదేశించకపోయి నా అనూహ్యమైన స్వీయ నియంత్రణను వేలా ది గ్రామ పంచాయతీలు స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి. ఏండ్ల తరబడి పంచాయతీ వ్యవస్థ ల్లో ఉన్న స్వావలంబన, స్వపరిపాలన స్ఫూర్తి గ్రామగ్రామాన పెల్లుబుకింది. ప్రభుత్వ యం త్రాంగం, పోలీసు వ్యవస్థ ప్రమేయం లేకుం డా స్వీయ నియంత్రణను పాటించి, ప్రపంచానికి చాటిచెబుతున్న విధానం, అనన్య సామా న్యం అనితర సాధ్యం. అరువై శాతానికిపైగా ‘స్వపరిపాలన’ ఈ దేశంలో కొన్ని గంటల్లో రూపుదిద్దుకొని కొనసాగుతు న్న సందర్భాన్ని, సమయం వచ్చినప్పుడు ఈ వ్యవస్థను కూడా చప్పట్లతో గౌరవించడం మన ధర్మం.

ఏప్రిల్‌ 14 తర్వాత అమలుచేయాల్సిన కార్యాచరణను ప్రభుత్వం ఈ లోపే రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వీయ నియంత్రణలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మండలస్థాయి వరకు బాధితుల చికి త్స కోసం వ్యవస్థను రూపొందించడం అత్యవసరం. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద దవాఖానాలు, చిన్న నర్సింగ్‌హోంలు దాదాపు మూతపడ్డాయి. వీటికి అనుబంధంగా ఉన్న డాక్టర్లు, నర్సులు అనుబంధ సాంకేతిక సిబ్బం ది, ఆర్‌ఎంపీలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ సంప్రదించాలి. మూసివేయబడిన విద్యాసంస్థలు, ఇతర భవనాలను, సిబ్బందిని జాగ్రత్తగా ఉపయోగించి ఈ కార్యాచరణను వికేంద్రీకరిస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. దీంతో ప్రజలు కూడా భాగస్వాములవుతారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం, పర్యవేక్షించడం అధికారులకు సులభమవుతుం ది. వికేంద్రీకరణ మంత్రమే ఈ కల్లోల పరిస్థితికి సమాధానం. 

ఈ కరోనా వైరస్‌ ఏప్రిల్‌ 14 తర్వాత బలహీన పడుతుందని భావిస్తున్నాం. ఒకవేళ కరోనా సోకినా మనకు రోగ నిరోధకశక్తి, స్వీయ నియంత్రణ ప్రభుత్వాల సత్వర చర్య ల వల్ల త్వరలోనే కోలుకుంటారని, మృత్యుంజయులవుతారని నమ్మకం ఉన్నది. అయినా ముందస్తు జాగ్రత్తలు అనివార్యం.

(వ్యాసకర్త: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌)


logo