బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 29, 2020 , 22:14:42

ఆత్మ సాక్షాత్కారానికి వేళ ఇదే

ఆత్మ సాక్షాత్కారానికి వేళ ఇదే

భూమి ముఖ్యంగా సూర్యశక్తి వల్లే నడుస్తున్న ది. మనిషి శరీరం కూడా ఈ భూమిలో ఒక అం శమే. సూర్యశక్తిని మనమెంత గ్రహించగలమన్న దానిని బట్టే మీకెంత శక్తి ఉన్నదనేది నిర్ణయించబ డుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం కాలాన్నే గాక, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే, జీవానికి ప్రధాన అంశాలైన కాలమూ, శక్తి అనే ఈ రెండూ కూడా సూర్యుని వల్లనే నిర్దేశితమవుతున్నాయి. కనుకే, భూమిపై సూర్యుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సూర్యుని లాగా చంద్రుడు శక్తిని ప్రసరించలేకపో యినా, భూమికి అతి సమీపంలో ఉండటం వల్ల మనపై చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువే. అసలు మన పుట్టుకే చంద్ర గమనంపై ఆధారపడి ఉన్నది.  ఎలాగంటే, స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గమనానికి నూటికి నూరు శాతం సం బంధం ఉన్నది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణాలకు సంబంధించింది కాదు, అది అయస్కాంత పరమైంది. ఈ రోజు ఏదో ఒకదాని భ్రమణ, పరి భ్రమణాల వల్లనే విద్యుత్తు తయారవు తున్నది. అందుకు వేరే మార్గం లేదు. అదేవిధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణాల ద్వారా ఒక శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాడు. తద్వారా మనపై ప్రభావం చూపుతున్నాడు. బయటినుంచి మన జీవితాన్ని ప్రభావితం చేసే వాటిని అర్థం చేసుకోవాలంటే సూర్యుడిని పరిగణనలోకి తీసుకోవాలి. అం తరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రుడిని పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలండర్లలో ఈ పంచాంగం ఒకటి. దీనిపరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. భారతీయ (తెలుగు వంటి) పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజును ‘ఉగాది’ అం టాం. ఇప్పుడు భూమి సూర్యునికి అతి సమీపం లో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యంత అనుకూ లం. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగు తుంది. ఎందుకంటే, వాటి పెరుగుదలకు అవసర మైన కిరణజన్య సంయోగక్రియ ఈ సమయంలో బాగా జరుగుతుంది. కానీ, భూమిపై ఉండవలసిన వాటినన్నింటినీ మనం నాశనం చేశాం. కాబట్టి, ప్రస్తుతం వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలంగా మారింది. అసలు వేసవి అంటే ఎడారుల్లో మాత్రమే అసౌకర్యంగా ఉండాలి. మిగతా భూమిమీద జీవ నం ఎంతో ఉన్నతస్థా యిలో, ఉత్సాహంగా జరుగవలసిన సమయమిది.

ఎరుక (అవేర్నెస్‌)తో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది. మీ చుట్టూ ఉన్న జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు మీకు కావలసిన విధంగా మలచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైన సమయం. ఇది ఉత్తరాయణ కాలం కూడా. అంటే, భూమిపరంగా చూస్తే సూర్యగమ నం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో ఉన్న మనకు ఈ సమయం ఎంతో ముఖ్యమైంది. ఆత్మ సాక్షాత్కారానికి, ఆశయ సాధనకు అనువైన సమయం ఇదే మరి! వచ్చే సంవత్సరం కల్లా మీరు ఇప్పటికన్నా చాలా మెరుగైన మనిషిగా మారాలి. ఇంకా సంతో షంగా, శాంతంగా, ప్రేమ గా ఉండాలి. అంటే అన్ని రకాలుగా ఉత్తమమైన మనిషిగా తయారవ్వాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆ విధమైన ఆలో చనతో అడుగులు వేస్తే, మీలో మానవత్వం పొం గిపొర్లుతుంది. అప్పుడు దివ్యత్వం మీకు దానం తటదే సంభవిస్తుంది. 


logo