బుధవారం 03 జూన్ 2020
Editorial - Mar 27, 2020 , 22:29:26

జనసాంద్రతకు తగిన జాగ్రత్త

జనసాంద్రతకు తగిన జాగ్రత్త

సూది మొనమీదనే పది కోట్ల సంఖ్యలో ఈ కరోనా వైరస్‌ నిలబడగలదట. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి ప్రపంచ ప్రజలందరినీ హడలగొడుతున్నది. గత అక్టోబర్‌లో దీని ఉనికిని గుర్తించినా దీని ప్రమాదం మొదలైంది డిసెంబర్‌ చివరివారంలో. నేటికి  అది 14వేలకు పైగా మందిని కబళించింది. సుమారు రెండు లక్షల మంది ఇంకా దీని విషపుకోరల్లో చిక్కుకున్నారు.  దీనికి ఇప్పటిదాకా మందులేదు. ఇప్పటిదాకా యాంటీబయాటిక్సే ప్రయోగాత్మకంగా చికిత్సలో వినియోగిస్తున్నారు. వ్యాధి ముదరక ముందు నిరోధకశక్తి ఎక్కువ ఉన్నవారు బతుకుతున్నారు. 

ఈ విష క్రిమి సోకకుండా మనల్ని మనం దూరంగా ఉంచుకోవడమే నివారణ. ఇది మనిషి నుంచి మనిషికి తుమ్ము, దగ్గు, స్పర్శ ల ద్వారా వ్యాపిస్తూ ఉన్నది. భారతదేశం లాంటి జన సమ్మర్థం ఉన్న దేశంలో ఒక మనిషి తుమ్మితే క్షణంలో కొన్ని వందల మందికి ఇది చేరే ప్రమాదం ఉన్నది. పటిష్టమైన వ్యూహంతో పది రోజుల్లోనే అసాధారణరీతిలో దవాఖాన సౌకర్యాలను అం దించి చైనా ప్రపంచ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. నిర్లక్ష్యం కారణంగా చైనా కన్నా ఇటలీ ఎక్కువ ప్రజానీకాన్ని చంపుకున్నది. చైనాతో పోలిస్తే ఇటలీ భౌగోళికంగా చాలా చిన్న దేశం. పదో వంతు వైశాల్యం కూడా ఉం డదు. చైనా జనాభా ఇప్పటికి 143 కోట్ల 33 లక్షలు. కానీ ఇటలీ జనాభా కేవలం 60 కోట్లు. కానీ చైనాలో మరణాల సంఖ్య నేటివరకూ 3,270 మంది కాగా,  ఇటలీలో మరణించిన వారు 5,476 మంది. ఇది కరోనా ప్రారంభస్థితిలో ఇటలీ చేసిన నిర్లక్ష్యానికి ఫలి తం. అక్కడ కరోనా మూడో దశలో ఉన్నది.జనసాంద్రత చైనా, ఇటలీతో పోలిస్తే మనదేశంలో ఎక్కువ. ఇక్కడ కరోనా ఈ రెండో దశలో అరికట్టలేకపోతే మనం ఇటలీ కన్నా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుం ది. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో మన ప్రభుత్వాలు సరైన వ్యూహాన్ని అవలంబించాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజారవాణా నిలుపుదల, 12 గంటల కర్ఫ్యూ ప్రధా నం.

తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం కన్నా మరింత జాగరూకతతో వ్యవహరిస్తున్న ది. కేంద్రం 12 గంటల జన తా కర్ఫ్యూను ప్రకటిస్తే, కేసీఆర్‌ రాష్ట్రంలో ఇది 24 గంటలు ఉంటుందని అమలుపరిచా రు. తెలంగాణ ప్రజలు మంచి స్ఫూర్తిని చాటారు. కేంద్రం కన్నా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కూడా కేసీఆర్‌ మరింత పటిష్టమైన ప్రణాళికను అందరికన్నా ముందే ప్రకటించారు. మార్చి 31 వరకూ రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందని, ర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసి, మహమ్మారి నిరోధక చట్టం-1879ని పూర్తిగా అమలుచేస్తామని ప్రకటించారు. చైనాలో జనసాంద్రత చదరపు కి.మీ. కు 145 అయితే, అదే మన దేశంలో 455 మంది. ఇదే తెలంగాణలో జనసాంద్రత చ.కి. మీకి 307. గుంపులుగా కూడి ఉండే పరిస్థితి ని పోలిస్తే సగటున భారత దేశంలో ఎంతమంది జనం ఉంటారో అంతమంది తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉన్నది. అంటే కరోనా వ్యాపిస్తే చైనాలో కన్నా భారతదేశంలోనూ అందు లో తెలంగాణలోనూ నాలుగు రెట్లు అధికంగా ఉండవచ్చు. ఈ దృష్టితో చూస్తే కరోనా నిరోధాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత ముందుచూపుతో నిరోధించడానికి నడుం కట్టిందో తెలుస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం పది రోజుల కర్ఫ్యూ ప్రకటించి ఊరుకోలేదు. రోజు పనిచేస్తే కానీ పూట గడువని ప్రజలు ఇలాంటి నిర్బంధ దినాల్లో ఎన్ని కష్టాలు పడుతారో ఆయనకు తెలుసు. అందుకే ఇలాంటి ప్రజల కు మనిషికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని అంతేకాకుండా కుటుంబానికి రూ.1500 ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. గర్భిణులకు ఏ లోటులేకుండా రవాణా, మందులకు ఏ లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని సంస్థల్లో పనిచే సే కార్మికులకు సెలవుదినాల్లో కూడా ఆ సం స్థలో జీతాలు చెల్లించాలని చట్ట ప్రకారంగా నిర్దేశించడం హర్షణీయం. కేసీఆర్‌ మీడియా సమావేశంలో చేసిన సమగ్ర ప్రణాళికా ప్రకటన ఆయన రాజనీతి సూచికగా నిలుస్తుంది. 

మనిషికి మనిషి దూరంగా ఉంటూ ఎవరి ఇండ్లలో వారు ఉండిపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తిని 90 శాతం అరికట్టవచ్చు. కొత్తగా సోకినవారిని తక్షణం దూరం పెట్టి చికిత్స అం దించడం వల్ల కొత్తగా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. కాబట్టి కరోనావ్యాప్తిని ఆరంభస్థితిలోనే నియంత్రించవలసి న అవసరం ఉన్నది. దీనిని ముందుగా గ్రహించి ప్రణాళికారచన చేసిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అభినందించాలి.ఈ సందర్భంలో తెలంగాణ పౌరులు ఉత్త మపౌరులుగా ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇంటికి పరిమితం కావాలి, పరిశుభ్రత పాటించాలి. ఇలా విజయవంతంగా ఈ మహమ్మారిని మన గడ్డ నుంచి మన దేశం నుంచి నిర్మూలించవలసిన సమయం ఇది. అందరూ జాగరూకతతో మెలుగుదాం. రక్షణచర్యలు తీసుకుందాం.

-ప్రొ॥ పులికొండ సుబ్బాచారి


logo