మంగళవారం 07 జూలై 2020
Editorial - Mar 27, 2020 , 22:27:55

భగవద్గీత.. మన హిత

భగవద్గీత.. మన హిత

యత్రగీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్‌

తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవహి॥

‘వరాహ పురాణం’లోని ఈ శ్లోకం గీతా మహాత్త్యాన్ని గురించి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే అమ్మవారికి చెప్పిన సందర్భం లోనిది. ‘ఓ భూదే వీ! ఎక్కడైతే భగవద్గీతపై విచారణ జరుగుతుందో, ఎక్కడైతే ఈ గ్రంథాన్ని చదువడం, వినడం, బోధించడం జరుగుతుందో.. అక్కడంతా ఎల్లప్పుడూ తప్పక నేనుంటాను’ అన్న స్వామివారి పలుకులను లోతుగా విశ్లేషించుకొంటే ‘భగవద్గీత’ ఔన్నత్యం మనకు అర్థమవుతుంది.

‘భగవద్గీత’ సర్వ ఉపనిషత్తుల సారం. ‘భగవద్గీత’ బ్రహ్మ విద్య. ఇదొక యోగశాస్త్రం. ‘భగవద్గీత’ ఔన్నత్యాన్ని, అవసరాన్ని గుర్తించిన శంకర భగవత్పాదుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు తమ తమ ఆలోచనలతో భాష్యాలు రచించారు. మన పూర్వు లు దీన్ని ప్రస్థాన త్రయంలో ఒకటిగా సంభావించా రు. యావత్‌ విశ్వంలో ఇంతటి హితాన్ని బోధించే గ్రంథం మరొకటి లేదని తత్తవేత్తల అభిప్రాయం. స్వాతంత్య్ర పోరాట సందర్భంలోను లోకమాన్య బాలగంగాధర తిలక్‌, మహాత్మా గాంధీ వంటి మహామహులు భగవద్గీతా గ్రంథాన్ని ఎంతో గొప్పగా గౌరవించి ప్రజల్లో ప్రచారం చేశారు. నరనారాయణులు ఇద్దరూ నారాయణ స్వరూపులే. అంటే, నారాయణుడు తానే గురువుగా, తానే శిష్యునిగా అవతరించి, తన అంశావతారమైన వేదవ్యాస మహ ర్షి ముఖ్యంగా దీన్ని లోకానికి అందించాడు. ఇదొక పవిత్ర గ్రంథంగా విశిష్ఠ ఆదరణను పొందడానికి, ఇందరు మహా పురుషుల ప్రమేయం ఉన్న దీని పుట్టుక ఒక కారణమైతే, అంతఃస్సారాన్ని గ్రహించినప్పుడు అన్నివిధాలా విశ్వ మానవజాతికి కర్తవ్యా న్ని బోధించే ఉత్తమ ప్రయోజనకర గ్రంథంగానూ దీనిని తెలుసుకోవచ్చు.

పదునెనిమిది అధ్యాయాలుగా విస్తరించిన భగవద్గీత అర్జునునిలోని నిర్వేదాన్ని పరిహరించాలన్న శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర సంగ్రామానికి పూర్వం చెప్పిన ఈ ‘గీత’లోని అన్ని అధ్యాయల్లోనూ ప్రపంచంలోని ప్రతి మానవునికి ఉపయోగపడే అనేక సత్యాలు ఆవిష్కృతమయ్యాయి. వ్యక్తి సమాజానికి కేంద్రం కనుక వ్యక్తి వల్లనే ఏ సమాజమైనా పటిష్ఠమవుతుంది. వ్యక్తి సంస్కరణ అంటే, సమాజ సంస్కరణే అన్నది అందరూ అంగీకరించే సత్యం.

భగవద్గీతను కేవలం ఆధ్యాత్మిక గ్రంథంగానో, ఏదో ఒక మత గ్రంథంగానో భావించడం వల్ల దానిలోని అనేక పార్శాలను మనిషి కోల్పోయే ప్రమా దం ఉన్నది. ప్రతి మనిషి ముందుగా తనను తాను ఉద్ధరించుకొనే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చెయ్యాలి. అప్పుడే అతని ఆత్మోద్ధరణానికి భగవంతుని సాయం అందుతుంది. తాను కర్తవ్య విముఖుడై సర్వం భగవంతుడే చెయ్యాలని అనుకోవడం అత డు తన కర్తవ్య నిర్వహణ నుంచి దూరమవుతున్నాడని తెలుసుకోవచ్చు. యుద్ధం ద్వారా కురువీరుడైన అర్జునుడు దుష్టశిక్షణ చెయ్యాలి. అది అతని కర్తవ్యం. కానీ, బలహీన మనస్కుడై, కర్తవ్య పరాన్ముఖుడైన అర్జు ణుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు.. 

‘ై క్లెబ్యం మాస్మగమః పార్థ నై తత్త య్యుప పద్యతే

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరం తప’॥ (2-3) అని బోధించాడు.హేయమైన మానసిక దుర్బలత్వాన్ని వదిలి లేచి నిలబడి శత్రువును సంహరించాలని బోధించడం, చేతకానితనాన్ని దరిచేరనీయక, నిర్వేదాన్ని పొందకుండా కర్తవ్య నిర్వహణకు ప్రతి వ్యక్తి పూనుకోవాలన్న సందేశాన్ని భగవద్గీత మానవాళికి అందిస్తున్నది. అందుకే, ఇది అంతటి విలువైన మానవహిత గ్రంథమైంది.


logo