మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Mar 27, 2020 , 22:26:23

కడుపు నిండా తిను కంటినిండా కునుకు తీయ్‌..

కడుపు నిండా తిను  కంటినిండా కునుకు తీయ్‌..

కడుపు నిండా కమ్మగ తిని

ఇంట్లనే కంటినిండా నిద్రవోర్రి వయా అంటే..

లేదు, రోడ్డు మీద తిరుగుకుంటా

రోడ్‌ సైడ్‌ రోమియో లాగా బిహేవ్‌ చేస్తమంటే ఎవరేం చేస్తరు?

రెండ్రోజులకే మనమింత ఆగమాగమైతే? 

నెలల తరబడి లాక్‌డౌన్‌ చేయాల్సి వస్తే..! 

దేశాధ్యక్షులు సైతం గృహ నిర్బంధం చేసుకుంటూంటే..

దోస్తుల్లేరు, ముచ్చట్లు లెవ్వు

బంధువుల్లేరు, బతాకానీల్లేవు

కంటికి కనపడని వైరస్‌ నుంచి కాపాడటాని కోసం

ఇప్పుడు యావత్‌ దేశం లాక్‌డౌన్‌..!

అర్థం చేసుకోండి.. ఆలోచించండి.. 

మనల్ని మనం కాపాడుకుందాం

మన దేశాన్ని సంరక్షించుకుందాం

ఇంటిపట్టున ఉందాం..

పొద్దుగాళ్ల చాయ్‌ నుంచి

కంటిమీదికి కునుకు చేరే దాకా

ప్రతి నిమిషాన్ని మానవాళి శ్రేయస్సు కోసం వెచ్చిద్దాం

‘క్వారంటైన్‌'.. కష్టం అనుకోవద్దు

‘క్వారంటైన్‌' ఓ సదవకాశం

క్వారంటైనే మనల్ని కరోనా కష్టం నుంచి గట్టెక్కించేది

సామాజిక దూరమే.. సమాజాన్ని సంరక్షించేది

అవసరం పేరుతో అడుగు బయటపెట్టకు

ఉన్నదాంట్లోనే సర్దుకో

ఉన్న ఇంటినే ఉన్నతికి ప్రయోగశాలగా మార్చుకో

ప్రతి క్షణం ప్రయోజనకరమే..

పరోపకారార్థమే..

-  గడ్డం సతీష్‌, 99590 59041


logo