శనివారం 28 మార్చి 2020
Editorial - Mar 26, 2020 , 22:29:16

దుష్ప్రచారాలతో అనర్థం

దుష్ప్రచారాలతో అనర్థం

ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు ప్రజలకు తగు సూచనలు చేస్తున్నాయి. దేశంలో మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటితమైంది. దీనికి ప్రాథమిక దశగా జనతా కర్ఫ్యూ పేరిట స్వీయ నియంత్రణను ఆచరణలో పెట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యా న్ని ఆచరణాత్మకం చేస్తున్నాయి.

కరోనా బారిన పడకుండా ఉండాలంటే మన దేశం లాంటి అభివృద్ధి చెందుతూ, జనసమ్మర్ధం అధికంగా ఉన్న దేశాలు జాగ్రత్తగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ కీలక సమ యంలో గత పది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వివిధ కోణాల్లో వస్తున్న ప్రచార సరళిని విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. సామాజిక మాధ్యమాలు ఈ వైరస్‌ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్ని వివరించడం ద్వారా ప్రజలను జాగరూకం చేయడంతో పాటు చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ ఆరో గ్య సంస్థ ఏకంగా వాట్సప్‌ ద్వారా సమాచారా న్ని అందించేందుకు పూనుకున్నది.

సామాజిక మాధ్యమాల విస్తరణ ప్రజలను అప్రమత్తం చేయటంలో విశేష కృషి చేసింది. చైనాలో ఈ వైరస్‌ లక్షణాల గురించి, వివిధ దేశా ల్లో వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన విజువల్స్‌ ద్వారా కరోనా దుష్ప్రభావాలు, ప్రాణాంతక అంశాలు వివరంగా తెలిశాయి.

ఇదంతా ఒక కోణం. వైరస్‌ విస్తరణాంశం మొదలు, ప్రజల్లో భయాందోళన కలిగించే సమాచారం కూడా మరోవైపు కొనసాగుతున్నది. దీని పట్ల అప్రమత్తత అవసరం. కరోనా వైరస్‌ బయో టెర్రరిజంలో భాగంగా చైనీయులు చేసిన యుద్ధం గా ప్రచారం జరుగుతున్నది. అలాగే కరోనా వైరస్‌ కు వాక్సిన్‌ కనుగొన్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతున్నది. ఆధుని క సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా వచ్చిన సోషల్‌ మీడియా సమాచార విస్తరణలో కీలక భూమికనే పోషిస్తున్నది. అయితే సామాజి క మాధ్యమాల్లో కరోనా నేప థ్యంలో వస్తున్న స్పందనలు వెర్రితలలు వేస్తున్నాయి. కరో నా ఊతంగా సామాజిక మాధ్యమాల్లో పెచ్చరిల్లుతున్న ఆందోళనకరమైన మిస్‌ ఇన్‌ఫర్మేషన్‌ క్యాంపెయిన్‌ పట్ల శాస్త్రీయతతో అర్థం చేసుకోవాలి. కొందరు సమాచారాన్ని అందిస్తున్నామనే ఉత్సాహంతో తామిచ్చే సమాచారం ఎంత ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు.

 భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఒక కరోనా బాధితుడి వీడియో అంటూ వాట్సప్‌ గ్రూపుల్లో ఒక విజువల్‌ వైరలయింది. ఆ విజువల్‌ తీవ్ర ఆందోళన కలిగించేదిగా ఉన్నది. ఏకం గా కోవిడ్‌ చివరి స్టేజీకి మనం వెళ్లిపోయామా అనే భయోత్పాతాన్ని అది సృష్టించింది. నిజాని కది ఇతర దేశానికి సంబంధించినది. ఈ విజువ ల్‌ వైరల్‌  చేసినవాళ్లు తాపీగానే ఉన్నప్పటికీ సమాజం యావత్తూ భయకంపితమైంది. వైరస్‌ విస్తరణ జరిగే ప్రమాదమున్న అంశాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం అవసరమే కానీ ఆ పేరిట సెన్సేషన్‌  కోసం చేసే చర్యలతో సామాజిక మాధ్యమాలంటే భయం పుట్టే పరిస్థితి ఏర్పడుతున్నది. మం గళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లో ఓ కరోనా వైరస్‌ బాధి తురాలిని హాస్పిటల్‌లో చేర్చడానికన్నట్టు చేసిన హంగామా వైర ల్‌ అయిన విధానం వణుకు పుట్టిస్తున్నది. వీటన్నింటినీ గ్రూపులలోనైతే అడ్మిన్లు, వ్యక్తులైతే స్వీయ నియంత్రణతో వ్యవహరిస్తే రానున్న రోజుల్లో  ఎదురవబోయే  సవాళ్లను అధిగమించగలుగుతాం.

సామాజిక  మాధ్యమాలు ప్రజలను చైతన్యం చేస్తున్న సందర్భాల్లో ఎంచుకుంటున్న సృజనా త్మక అంశాలు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైరస్‌ గురించి సృజ నాత్మకతతో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అలాగే మన ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ చూపిన పోస్ట్‌ కూడా ఇదే అంశాన్ని నొక్కిచెబు తున్నది.

కొన్ని భావనలు మూఢనమ్మకాలు, శాస్త్రీయ త గురించి తులనాత్మక పరిశీలనకు ఉపకరిస్తూ ప్రజల్లో మరింత చైతన్యాన్ని కలిగించేందుకు ఉపయోగపడుతున్నాయి. జనబాహుళ్యానికి చేరువగా ఉండే రీతిలో చమత్కారం మిళితమైన పోస్టులూ ఉంటున్నాయి. ఈ క్రమంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సామాజిక మాధ్యమం  వారధిగా ఉపయోగపడుతున్నది. మరోవైపు కరోనా పై తప్పుడు సమాచారాన్ని అందించే శక్తుల నియంత్రణ అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓ కుటుంబ పెద్దగా  సీఎం కేసీఆర్‌ కరోనా నియంత్రణ చర్యల్లో తీసుకుంటున్న చొరవ అనిర్వచనీయమైంది. మన రాష్ట్రంలో చేపడుతున్న చర్యలు, కార్యాచరణ  దేశానికే  ప్రేరణగా నిలుస్తున్నాయి. స్వీయ కార్యాచరణ మన విజయానికి నాందిగా నిలుస్తుంది. ఇక సామాజిక మాధ్యమాల్లో  అత్యుత్సాహపరులను  నియంత్రణ చేయాల్సిన కర్తవ్యం మనందరిది.

ఈ వైరస్‌ విషయంలో మన దేశం  చూపుతు న్న సన్నద్ధత గొప్పది. ఈ సందర్భంగా మొబైల్‌ ఫోన్లలో డయలర్‌ టోన్లతో సహా అన్ని  సమాచార వాహకాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న ది. వైద్యరంగ నిపుణులు తమదైన శాస్త్రీయ దృక్కోణంలో చికిత్సా అవసరాలను తీరుస్తున్నా రు. మున్ముందు సోషల్‌ మీడియా వేదికగా అపారమైన ఆశావహ దృక్పథాన్ని ప్రజల్లో నిం పాలి. అలాగే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ధీమా కలిగించేదిగా సమాచారం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలోనే కరోనాను దేశం నుంచి పారదోలేందుకు బాధ్యతాయుత పౌరులుగా ప్రతినబూనుదాం. కరోనా నిర్మూల న కోసం స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా ను పాతరేద్దాం.

-డాక్టర్‌ కడియం కావ్య


logo