సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 25, 2020 , 22:42:09

కరోనా క్యా హోనా?

కరోనా క్యా హోనా?

కరోనా భయం కళ్లల్లో కనబడినా

చావు భయం మాత్రం

ముఖంలో ప్రస్పుటమవుతోంది


మునుషుల్ని భౌతికంగా

విడదీసిన కరోనా

మనసుల్ని దగ్గర చేసింది


కరోనా యుద్ధానికి

ప్రపంచమంతా బలి అయినా

ఖండాంతరాల్ని కలిపింది


మనిషి పుట్టుక

ఏదేశంలో నయినా

చావు మాత్రం అందరిదీ అయ్యింది


బాల్కనీల నుంచి చావు కేకలు

వీధుల్లో పారాడుతున్నాయి

నిరంతరం ప్రవహించే జన ప్రవాహం

మంచు నయాగారా జలపాతంలా

స్థంభించి పోయింది


గాలికి పెట్టిన దీపాల్లా 

మనుషుల ప్రాణాలు

గాల్లో కలిసి పోతున్నాయి


జాతి మొత్తం ఏకమై

కరోనా భూతాన్ని తరిమేద్దాం

స్వచ్ఛ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ

వైరస్‌లేని సమాజాన్ని నిర్మిద్దాం..

-వారణాశి భానుమూర్తి రావు


logo