బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Mar 25, 2020 , 22:41:37

కరోనా ‘వైరి’స్‌

కరోనా ‘వైరి’స్‌

కవిత్వానికి 

కరోనా సోకింది

ప్రతి జీవన స్వప్నానికీ

మరణం జీర అంటుకుంది

ముల్లు ఎటు తిరిగీ

అటువైపే చూపుతుంది!


ప్రపంచమంతా

భయం ముద్దగా 

మారిపోయింది

ఇప్పుడు ఏ కష్టమైనా

కరోనా ముందు

కనిష్టంగా 

        కుంచించుకుపోయింది!


స్పర్శ వినా బతకలేని మానవుడు

దూరాలను అభ్యాసం చేస్తున్నాడు

అదృశ్య రాకాసిని

ఎదుర్కొనే అస్త్రశస్ర్తాలు 

లేక శూన్యంలో 

యుద్ధం చేస్తున్నాడు!


భగవంతుడా..

నేనేమైనా పరవాలేదు

ఎంతో జీవితం చూశాను

నాచుట్టూ ఉన్న వాళ్లు బాగుండాలి

కవిత్వానికి కరోనా సోకినా

మనిషి కరుణవీరాన్ని 

చిందించాలి..!

- డాక్టర్‌ ఎన్‌.గోపి


logo