శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:47:53

కనపడని శత్రువుతో యుద్ధం

కనపడని శత్రువుతో యుద్ధం

ప్రస్తుతం సమస్త మానవాళిని కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమైంది. పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం ‘నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.

‘ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా వినబడే మాట. ఈ మాటలు అనేవాళ్లు ముందు అర్థం చేసుకోవాల్సిందొక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి రోజుల వ్యవధిలోనే ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మన దేశం లో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశం లో కాలుమోపింది.ఈ కరోనా ఎలా పోతుందో తెలియదు. విరుగుడేమిటో అసలే  తెలియదు. అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు. 

ఇతరేతర వ్యాధు లు ప్రబలినప్పుడు బాసటగా బంధుమిత్రులు వుంటారు. చికిత్స చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు అనేకం అందుబాటు లో ఉంటాయి. వ్యాక్సిన్లు, మందులుంటా యి. కానీ కరోనా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా అనుమానం ఉన్న రోగిని బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వారిని ఐసోలేషన్‌ గదుల్లో ఉంచాలి. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హాని ఉండదు. కానీ మూడో దశకు చేరుకుం టే ఇక ఆ రోగిని కాపాడటం కష్టమంటున్నా రు వైద్యులు. మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పు డు బాహ్య ప్రపంచమంతా మామూలుగానే ఉంటుంది.  రైళ్లు, బస్సులు, కార్లు విమానాలతోసహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తా యి. ఆర్థికవ్యవస్థపై ప్రభా వం అతిస్వల్పంగా ఉంటుం ది. అదే కరోనా విషయం వేరు. ఈ వైరస్‌ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందుచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు. 

అందుకే, ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నా యి.ప్రజలు ఒకరినుంచి మరొకరికి ఈ వ్యాధి ని సంక్రమింపజేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలుచేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయమేమంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తున్నదని తెలుస్తున్నది. వ్యాధి సోకినవారినందరినీ ఇప్పు డు వెతికి పట్టుకొని పరీక్ష లు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్ర పు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభు త్వం వెనుకాడటం లేదు. 

శాంతా బయోటిక్‌ వ్యవస్థాపకులు వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇం టర్వ్యూలో చెప్పారు. వారి అమ్మాయి కేరళ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఇటీవల ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాల్లేవని నిర్ధారించుటకు వెళ్లిందట. ప్రభు త్వం తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి ఆయ న ఆశ్చర్యపోయారట. అలాగే హైదరాబాద్‌ నగరంలోని హఫీజ్‌పేటలో ఉన్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్లింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున, పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో ఉంటున్నా రు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శుల ను అడిగితే వాళ్లు నివ్వెరపోయారట. 

విదేశాల నుంచి ఎవరు వచ్చా రో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లిచూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధం లో ఉండాలని చెప్పారట. అప్పటినుంచి ప్రతి రోజూ ఫోన్‌లో వారిని సంప్రదించి వారి ఆరో గ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారట. గత పదిహేను రోజుల్లో వివిధ దేశాల నుంచి వేల మంది హైదరాబాద్‌ వచ్చి ఉంటారు. అలా వచ్చిన వాళ్లు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి ఉంటా రు. ఈ క్రమంలో వారిలో ఎవరికైనా ఈ వ్యాధి సోకి ఉంటే అది ఇతరులకు అంటుకు నే ప్రమాదం ఉన్నది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలించి కనిపెట్టడం  సామాన్యమైన విష యం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామా లు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారి కోసం జల్లెడ పట్టి గాలిస్తున్నది.

కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోందని మెటిక లు విరిచేవాళ్లు ఈ విషయాలను గమనంలో ఉంచుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడమన్నది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో లేదు. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే కరోనా ను అడ్డుకోవడం సాధ్యమవుతుంది. అదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చెబుతున్నారు. అదే ప్రభుత్వాధికారులూ చెబుతున్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరుగవద్దంటున్నా రు. ఇంటిపట్టునే ఉండమంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామంటున్నారు. కొద్దిరోజులు ఓపిక పడితే పరిస్థితి సర్దుకుంటుందని కూడా చెబుతున్నారు. విన డం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువైన పని మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది.


logo