శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:43:25

తెలంగాణతనమే తరుణోపాయం

తెలంగాణతనమే తరుణోపాయం

ట్యాంక్‌బండ్‌పై సాగరహారం గుర్తుందా? పుట్టలు పగిలి చీమలు వచ్చినట్లు.. ఎక్కడెక్కడినుంచో జనం తరలివచ్చారు. అప్పట్లో మన నాయకుడు ఒక్క పిలుపు ఇచ్చాడంతే.. ఆ చివర ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుంచి, ఈ చివర ఉన్న ఖమ్మం నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పోలీసులు అడ్డుకుంటారేమోనని ముందురోజు రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. పోలీసులు అరెస్టులు చేస్తుంటే.. ఒక బ్యాచ్‌ తర్వాత మరొక బ్యాచ్‌గా బయటికి వచ్చారు. పోలీసులకు చుక్కలు చూపించి మరీ సాగరహారాన్ని విజయవంతం చేశారు. అప్పట్లో మన రాష్ర్టాన్ని మనం సాధించుకోవాలంటే బయటికి రావాలి. ఉల్లంఘనలను ఛేదించుకొని మరీ బయటికి రావాలి. అందుకే వచ్చాం. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైనది. మన రాష్ర్టాన్ని, మన కుటుంబాలను కాపాడుకోవాలంటే ఇప్పుడు బయటికి రాకూడదు. తెలంగాణలో ఒక్క ప్రాణం కూడా అన్యాయంగా బలయిపోకూడదంటే బయటికి రాకూడదు. ప్రభుత్వం విధించిన ఉల్లంఘనల కట్టు దాటకూడదు. అప్పట్లో పోలీసు ఆంక్షల ను దాటితే విజయం. ఇప్పుడు పోలీసులు ఆంక్షలు దాటితే పరాజయం. అప్పట్లో ప్రభు త్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సంతోషం. ఇప్పు డు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే విషా దం. అందుకే, బయటికి వచ్చి ఏ స్థాయి విజ యం సాధించగలమో చూపించిన మనం.. ఇప్పుడు బయటికి రాకుండా కూడా అదేస్థా యిలో తెలంగాణతనాన్ని చూపించాల్సిన తరుణం ఇది. ఇంట్లోనే ఉండి ప్రపంచంపై విజయం సాధించాల్సిన సమయం ఇది.

అసలు మన దాకా వస్తుందా?

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మనకెందుకు వస్తుంది? విదేశాలకు వెళ్లివచ్చిన వారికి అయితే సరే కానీ.. ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇవి చాలామందికి వస్తున్న ప్రశ్న లు. అత్యధికుల్లో నిర్లక్ష్యానికి కారణం కూడా ఇదే. కానీ, ఇప్పుడు ప్రపంచం అంటే వివిధ దేశాల సమూహం కాదు. అన్నింటినీ కలిపేసి న ఓ కుగ్రామం. దాదాపు ప్రతి ఊరి నుంచీ పదిమందో, పదిహేను మందో అమెరికాలో ఉంటున్నారు. ప్రతి గ్రామం నుంచి గల్ఫ్‌ దేశా ల్లో ఉంటున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉం టున్నది. జర్మనీ, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో ఉంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రతిరోజూ ఆయా దేశాల నుంచి ఊర్లకు మనవాళ్లు వస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్య విషయం కరోనా సోకితే దాదాపు ఐదురోజుల వరకూ బయటపడదు. ఆ తర్వాత చలిజ్వరం వంటి లక్షణా లే ఉంటాయి. దాంతో, విదేశాల నుంచి వచ్చినవాళ్లు యథావిధిగా ఇంట్లో, బయట తిరిగేస్తున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి ఓ వ్యక్తి వచ్చా డు. వచ్చినందుకు దావత్‌ ఇచ్చాడు. మనమం తా వెళ్లాం. అతనికి ఏ లక్షణాలూ లేవు. కానీ, అంతా కలిసి తిన్నాం, తాగాం. బంధువుల పెళ్లికి వెళ్లాం. దోస్తు గృహ ప్రవేశానికి కూడా వెళ్లివచ్చాం. ఓ ఐదు రోజుల తర్వాత అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అనుకుందాం. అప్పుడు.. అప్పటివరకూ అతనితో తిరిగిన మనకు కూడా ప్రమాదమే కదా. ఎక్కడో చైనా లో పుట్టిన ఆ వైరస్‌ మన ఊరికి కూడా వచ్చేసినట్టే కదా. విదేశాల నుంచి వచ్చి న వ్యక్తి ఒక్కడికే కరోనా వస్తే అతడు ఒక్కడినే దవాఖా నలో ఉంచి చికిత్స చేస్తారు. దానివల్ల, పెద్దగా వచ్చిన ప్రమాదం కూడా లేదు. కానీ, అతని కారణంగా కుటుంబసభ్యులకు, దోస్తులకు వచ్చిందనుకోండి.. ముప్పు రెట్టింపవుతుంది. అదే, దోస్తుల ద్వారా దోస్తుల కుటుంబాలకు, ఊరోళ్లకు వచ్చిందనుకోండి.. దాన్ని కంట్రోల్‌ చేయడం మన తరం కాదు. గతంలో కలరా, మశూచి వ్యాపించినట్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించేస్తుంది. ఊర్లకు ఊర్లను చుట్టబెట్టేస్తుంది. వేలు, లక్షల సంఖ్యలో రోగు లు తయారవుతారు. ఈ ప్రమాదాన్ని ఊహిం చే సీఎం కేసీఆర్‌ నెలాఖరు వరకూ అంతా ఇం ట్లోనే ఉండాలని నిర్బంధం విధించారు.

ఇంట్లో ఉండలేమా?

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన కుటుంబాన్ని, రాష్ర్టాన్ని, దేశా న్ని కాపాడుకోవడానికి మనం కొన్నిరోజులు సంయమనంతో ఉండలేమా? తెలంగాణను సాధించుకోవడానికి ఆరు దశాబ్దాల పాటు ఎంతో ఓపికతో ఎదురుచూసిన మనం ఒక్క పదిరోజుల పాటు అదే ఓర్పును చూపలేమా? ఇది మనం అక్షరాలా చేసి చూపించగల కార్యం. కలిసికట్టుగా పనిచేయగల సంఘటిత త్వం మన సొంతం. తెలంగాణ ఉద్యమమే దానిని మనకు నేర్పింది. ‘జనతా కర్ఫ్యూ’ అయినా ‘లాక్‌ డౌన్‌' అయినా విజయవంతం కావడానికి ఇదే కారణం. ఉద్యమ సమయం లో కేసీఆర్‌ అనేక పిలుపులు ఇచ్చారు. నాయకుడు ఒక పిలుపునిస్తే దాన్ని ఎలా ఆచరించి చూపాలో అప్పట్లోనే మనం నేర్చుకున్నాం. ఉదాహరణకు, ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలకు లక్షల్లో జనం స్వచ్ఛందంగా వచ్చేవారు. ఎవరో చెప్పినట్లు ఎంతో క్రమశిక్షణతో సభలో ఉండేవారు. సభ అయిపోయిన తర్వాత ఎక్కడా ట్రాఫిక్‌జామ్‌కు అవకాశం ఇవ్వకుండా, ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అత్యంత జాగరూకతతో సురక్షితంగా ఇళ్లకు వెళ్లిపోయేవారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసీఆర్‌ పిలుపునిస్తే తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. ఇం దుకు కారణం.. కేసీఆర్‌ మన కోసమే చెబుతాడనే నమ్మ కం. తెలంగాణ శ్రేయస్సు కోసమే చెబుతాడనే విశ్వాసం. అందుకే, దేశంలో ఎక్క డా లేనట్లు తెలంగాణలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఇంత సంయమనాన్ని, సాధ నాశక్తిని మనకు ఉద్యమమే ఇచ్చింది. మనమంతా కలిసికట్టుగా ఒక పనిచేసే ఐక్యతా బలాన్ని కూడా ఉద్యమమే ఇచ్చింది. ఇదిప్పు డు మాత్ర మే కాదు.. రాష్ట్రం వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో రుజువైంది కూడా. ఇప్పుడు మనమంతా మరొకసారి సంఘటితంగా స్పం దించాల్సిన సమయం వచ్చింది. మన ఐక్యతా శక్తిని, తెలంగాణతనాన్ని చూపించాల్సిన తరు ణం ఆసన్నమైంది. కరోనా ప్రమాదాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ అందరికంటే ముందు స్పం దించారు. సమీక్షలు జరుపుతూ ఎప్పటికప్పు డు తగు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ‘లాక్‌ డౌన్‌' విధిస్తే నిరుపేదల పూట గడవడం ఎలా? ఈ విషయాన్ని కూడా అందరికంటే ముందే సీఎం కేసీఆర్‌ గుర్తించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెల్లకార్డు దారులకు కుటుంబానికి రూ.1500, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 12 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. నెలలు నిండిన గర్భిణులకు ఇబ్బం ది ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించి.. వారి వివరాలను సేకరించడమే కాదు, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. ఇటువంటి నాయకత్వం ఉండటం మన అదృ ష్టం. నాయకుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించడం మన కర్తవ్యం.

నాకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు

కరోనా ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నది. దాదాపు 192 దేశాల్లో వైరస్‌ అనేకమందికి సోకి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. నిన్నటివరకూ మన దేశంలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఆ వైర స్‌ సోకింది. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉన్నవారికి కూడా ఈ వ్యాధి సోకడం ప్రారంభమైంది. దానికి ఇంతవరకూ వ్యాక్సిన్‌ లేదు. దానికి ఉన్నదల్లా ఒక్కటే.. అదే ముందు జాగ్ర త్త చర్యలు తీసుకోవడం. నేను మీ అందరినీ కోరేదొక్కటే. ప్రభుత్వం సూచించినవిధంగా ముందు జాగ్రత్తచర్యలు అందరూ పాటించం డి. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లోంచి బయటికి రాకండి. నిత్యావసరాలు, మందులు వంటి అత్యవసరాలు కావాల్సి వస్తే ఇంటినుంచి ఒక్కరు మాత్రమే వచ్చి సమీపంలోనే కొనుక్కొని తిరిగి వెంటనే ఇంటికి చేరాలని కోరుతున్నాను. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి వి వస్తే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి ప్రభు త్వం అన్నిచర్యలూ తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నా రు. సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా ఈనెల 31వ తేదీ వరకూ ప్రజలు ఎవరూ వీధుల్లోకి రావద్దు. నాకేమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇటలీలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో మృత్యువా త పడుతున్నారు. ముసలివాళ్లంతా చనిపోతున్నారు. ఇటలీకి పట్టిన గతి మన దేశానికి, మన రాష్ర్టానికి పట్టవద్దంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉం డండి. ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ఈ గొలుసుకట్టును ఛేదించడం ద్వారా మాత్రమే ఈ కరోనాను మనం కట్టడి చేయగలుగుతాం. ఇంత చెప్పిన తర్వాత కూడా వినకుండా, ప్రభుత్వ ఆజ్ఞలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారు. అవసరమైతే కేసులు పెడుతారు. చివరికి జైలుకు కూడా పంపాల్సి వస్తుంది. సైన్యాన్ని కూడా పిలువాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఆవేదన చెందుతు న్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. దయచేసి పోలీసులకు సహకరించండి. ప్రభుత్వం ఇస్తు న్న సూచనలను ఎప్పటికప్పుడు వింటూ వాటి ని ఆచరణలో పెట్టండి.

(వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి)


logo