మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 23, 2020 , 22:45:59

అప్రమత్తతే ఔషధం

అప్రమత్తతే ఔషధం

శరీరంలోని రోగ నిరోధకశక్తి మాత్రమే కరోనా నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది. కరోనా వైరస్‌ ఉన్నవారందరికీ జబ్బు లక్షణాలుండకపోవచ్చు. వారితో అత్యంత ప్రమాదం. దాదాపు 14 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు తెలుస్తాయి. అందుకోసం కనీసం రెండు వారాలు పర్యవేక్షణ అవసరం. ఇలాంటి వ్యక్తుల నుంచి దగ్గు, తుమ్ముల ద్వారా ఇది గాల్లోకి, తర్వాత మన పరిసరాల్లో ఉంటే అనేక వస్తువులతో (టేబుల్స్‌, కుర్చీలు, ఫైల్స్‌, తలుపులు, డోర్‌ హ్యాండిల్స్‌) డైరెక్ట్‌ కాంటాక్ట్‌ ద్వారా ఇతరులకు సోకుతుంది. ఒకవిధంగా కరోనా ఒక మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ లాగా వ్యాపిస్తుంది.

కంటికి కనిపించని ఒక వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. కరోనా విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. నిశ్శబ్దం గా వ్యాప్తిచెందే తీవ్రమైన అంటువ్యాధి కరోనాకు ఇంతవరకూ చికిత్స లేదు. ఈ వ్యాధి సోకినవాళ్లలో 16 శాతం మందికి తీవ్రమైన జబ్బు వస్తే, 60 ఏండ్లు పైబడినవాళ్లలో 6 శాతం చనిపోయే అవకాశం ఉన్నది. కరోనా నివారణ కోసం ‘తెలుసుకుందాం, జాగ్రత్త వహిద్దాం, నిరోధిద్దాం’ అనే మంత్రాన్ని పాటించాల్సి న అవసరం ఉన్నది. కరోనా రావడానికి ఎవరూ అతీతులు కాదు. అం దుకే మనకేం రాదులే.. అనే నిర్లక్ష్యం వద్దు. చైనాలో మాదిరిగా 136 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వ్యాపిస్తే మనకున్న హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏ మాత్రం సరిపోదు. చిన్న జనాభా ఉన్న ఇటలీ, స్పెయిన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే విలవిలలాడుతున్నవి. ఇదొక హెల్త్‌ ఎమర్జెన్సీ. మున్ముందు ఇది ఆర్థిక ఎమర్జెన్సీగా మారుతుంది.

కరోనా అంటే ఏమిటి? వ్యాధి లక్షణాలేమిటి?

జంతువుల నుంచి ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ ‘కొవిడ్‌-19’ చైనా హుబెయి రాష్ట్రంలో మొదట వెలుగుచూసింది. మామూలు ఫ్లూ అయినప్పటికీ ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ప్రధానంగా జ్వరం, శక్తి లోపించడం, తీవ్రమైన ఒంటి నొప్పులు, దగ్గు, గొంతులో ఏదో తట్టుకున్నట్టుండటం, శ్వాస సమస్య, చివరికి మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌.. ఇదీ కరోనా. కేవలం జబ్బు లక్షణాలకు మాత్రమే చికిత్స అందించగలం. శరీరంలోని రోగ నిరోధకశక్తి మాత్రమే కరోనా నుంచి మనల్ని విముక్తి కలిగిస్తుంది. కరోనా వైరస్‌ ఉన్నవారందరికీ జబ్బు లక్షణాలుండకపోవచ్చు. వారితో అత్యంత ప్రమాదం. దాదాపు 14 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు తెలుస్తాయి. అందుకోసం కనీసం రెండు వారాలు పర్యవేక్షణ అవసరం. ఇలాంటి వ్యక్తుల నుంచి దగ్గు, తుమ్ముల ద్వారా ఇది గాల్లోకి, తర్వాత మన పరిసరాల్లో ఉంటే అనేక వస్తువులతో (టేబుల్స్‌, కుర్చీలు, ఫైల్స్‌, తలుపులు, డోర్‌ హ్యాండిల్స్‌) డైరెక్ట్‌ కాంటాక్ట్‌ ద్వారా ఇతరులకు సోకుతుంది. ఒకవిధంగా కరోనా ఒక మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ లాగా వ్యాపిస్తుంది.

కరోనా ఎలా వ్యాపిస్తుంది?

ఇది పూర్తిగా ఇతర దేశాల నుంచి వస్తున్న సమస్య. ఒకపక్క మన భారతీయులు, మరో పక్క విదేశీయులు దీన్ని మనకు దిగుమతి చేశారు, చేస్తున్నారు. తెలిసో, తెలియకో వారితో దగ్గరగా వెళ్లినవారందరికీ ఈ వ్యాధి సోకుతుంది. ఉదాహరణకు కరోనా సోకిన వ్యక్తి ఇతర దేశం నుం చి ఇండియాకు వచ్చినప్పుడు తనతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు, ఎయిర్‌ స్టాఫ్‌కు అంటించవచ్చు. తాను దిగిన తర్వాత గమ్యానికి చేరుకోవడానికి డొమెస్టిక్‌ ఫ్లైట్‌, బస్సు, రైలు ద్వారా ప్రయాణం చేసినప్పుడు సహచర ప్రయాణికులందరికీ అంటించవచ్చు. అలానే ఒక టాక్సీ లేదా కారులో ప్రయాణిస్తే ఆ కారు ఒక కరోనా సెంటర్‌గా మారి ఆ కారులో ప్రయాణం చేసే ఇతరులకు సోకవచ్చు. విదేశాల నుంచి వచ్చి న వ్యక్తి తన కుటుంబసభ్యులకు అంటించవచ్చు. ఆ వ్యక్తి హోటల్స్‌, మాల్స్‌, ఫంక్షన్స్‌, పెళ్లిళ్లు, ప్రార్థనా మందిరాలు, ఇతర జన సమూహం ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు అందరికీ అంటించవచ్చు.

జబ్బున్న ఒక వ్యక్తి సగటున ఇద్దరి నుంచి ముగ్గురికి వ్యాప్తి చేయవ చ్చు. వందమందికి రిస్క్‌ కలిగించవచ్చు. కరోనా వైరస్‌ సోకి, జబ్బు లక్షణాల్లేనివారు ఎక్కువ మందికి వ్యాప్తి చెందించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో 195 దేశాల్లో ఇప్పటివరకు 186 దేశాలకు సోకింది. మొత్తం 3 లక్షల 20 వేల మందికి సోకితే 11,885 మంది చనిపోయా రు. ఇరాన్‌ తప్ప చైనా, ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, దక్షిణకొరియా, జర్మ నీ, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనే ప్రధానంగా సోకింది. ఇందుకు ప్రధాన కారణం నిర్లక్ష్య ధోరణి. ‘మాకు ఎందుకు వస్తుందిలే’ అనే అహంకార అజ్ఞానం. ప్రభుత్వాలు చెప్పినా ప్రజలు వినకపోవడం. కఠినమైన చర్యలు లేకపోవడం. దాని ఫలితం యూరప్‌లో కరోనా వ్యాధిగ్రస్థులు రోడ్ల మీద నిస్సహాయస్థితిలో చనిపోతున్నారు. ఇప్పటివరకు ఇరువై వేల మంది ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. ఇప్పుడు వారి నడవడి మీద కరోనా వ్యాప్తి ఆధారపడి ఉన్నది.

భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు..

కరోనా వ్యాధి దిగుమతి మొత్తాన్ని అరికట్టడానికి ముందుగా చేయాల్సిన పని-మొత్తం విమానాలు, సముద్ర ఉపరితల విదేశీ ప్రయాణికు లు రాకుండా బ్యాన్‌ చేయడం ప్రథమ కర్తవ్యం. ప్రస్తుతం ఇది అమల్లో కి వచ్చింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను అక్కడి ప్రభుత్వం సహకరిస్తే అక్కడే వారికి మన వైద్య బృందాలతో సహకారం అందజేయాలి. లేదా తక్కువ కరోనా కేసులున్న దేశాల నుంచి వచ్చిన వారిని కచ్చితంగా వైద్య క్వారంటైన్‌లో ఉంచాలి. కేవలం టెంపరేచర్‌ స్క్రీన్‌ చేయడమనేది విదేశీ వ్యాధి దిగుమతిని అరికట్టలేదు. విదేశీ ప్రయాణికులందరినీ 7 నుంచి 14 రోజులుగా విభాగించి, ఆ వ్యక్తుల జబ్బు లక్షణా లు, స్వీయ నియంత్రణ పాటించే అవకాశాలు, కుటుంబసభ్యుల వివరాలు, బాధ్యత తీసుకుంటున్న కుటుంబసభ్యులు మొదలైన వివరాలు నమోదు చేసుకోవాలి. ఆయా ప్రాంతాలలో రిపోర్ట్‌ చేసే కరోనా టీంను, జియో ట్యాగింగ్‌, ఫోన్‌ ట్రేసింగ్‌, డైలీ వాట్స ప్‌, వీడియో కాల్స్‌, పర్యవేక్షణ, టెలిమెడిసిన్‌ వంటి అనేక అంశాల ద్వారా మనం అద్భుతంగా నియంత్రించవచ్చు. ‘ఐడెంటీఫై, ఐసోలేట్‌, ట్రీట్‌' అనే పద్ధతిలో తక్కువ ఖర్చుతో, ఎక్కువ నియంత్రణ చేయవచ్చు. ఇవి అన్ని రాష్ర్టాలు కలిపి ఒక దేశీయ విధానం తయారుచేయాలి. అంత ర్రాష్ట్ర ప్రయాణానికి ఒక నియంత్రణ వ్యవస్థ, రెండు వారాలు పాటించేటట్లు ఒక విధానపరమైన చట్టం తీసుకురావాలె. స్వీయ నియంత్రణ ఉల్లంఘించేవారి మీద కఠినమైన ఆర్థిక నిర్బంధం లాంటి శిక్ష ఉంటుంద నే అవగాహన కల్పించాలె. విదేశీ ప్రయాణికులు నియంత్రణను ఉల్లంఘిస్తే వారి గురించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసే ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ఉండాలి. అవసరమైతే పారితోషికంతో కూడిన కరోనా ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ప్రభుత్వ, ప్రైవేటురం గంలోని అన్ని సదుపాయాలను వాడుకోవాలి. ఎక్కువ పరీక్ష కేంద్రాలను, టెస్ట్‌ అండ్‌ రెస్ట్‌ పాలసీని ఏర్పాటుచేయాలి. కరోనా టెస్టును ఉచితంగానే కాకుండా స్థోమత ఉన్నవాళ్లకు పెయిడ్‌ కరోనా టెస్టుల వ్యవస్థ ను ముందుకుతేవా లి. అన్ని రాష్ర్టాలు విధిగా అమలుచేసే విధంగా ఒక పాలసీ ఆర్డినెన్స్‌ తీసుకురావా లె. కరోనా ఫండ్‌ ఏర్పాటుచేసి, అవసర మైతే భారతీయులందరూ స్వచ్ఛందంగా కరోనా ఫండ్‌ కోసం విరాళాలు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టాలి. ఇది ప్రజలను భాగస్వామ్యం చేయడానికి దోహదపడుతుంది.

క్వారంటైన్‌

ప్రజలకూ, విదేశాల నుంచి వచ్చిన వారికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. క్వారంటైన్‌లో ఉన్న వసతులు సంతృప్తికరంగా ఉండా లి. ఒక జబ్బు లేని వ్యక్తి 14 రోజులు నిర్బంధంగా ఉండగలిగేలా వాళ్లను మానసికంగా, శారీరకంగా తయారుచేయాలి. హోమ్‌ క్వారంటైన్‌ పకడ్బందీగా అమలయ్యేటట్లు చూడాలి. 136 కోట్ల ప్రజలకు రక్షణ కవచం ఇవ్వడం ఒకెత్తయితే, తక్కువ ఖర్చుతో భారత్‌లోకి దిగుమతి కాకుండా కరోనాను నివారించడం మరో ఎత్తు. బయటిదేశాల నుంచి ఇప్పుడు వచ్చే వారిని కనీసం 72 గంటలు ప్రభుత్వ క్వారంటైన్‌లో పెట్టాలి. ఎం దుకంటే దాదాపు 90 శాతం మందికి మొదటి ఐదు రోజుల్లో జబ్బు లక్షణాలు కనిపించవు. తదుపరివారిని వారివారి సొంత స్థలాలకు స్థానిక కరోనా టీం (పోలీస్‌, హెల్త్‌, పర్యవేక్షణాధికారి)కు సమాచారం ఇచ్చి, ఒక ఎస్కార్ట్‌ వాహనంతో హోం క్వారంటైన్‌కు పంపిస్తే చాలావరకు కట్ట డి చేయవచ్చు.

(వ్యాసకర్త: పార్లమెంట్‌ మాజీ సభ్యులు)

సామాజిక క్వారంటైన్‌ 

నిర్బంధం లేకుండా మనిషి నియమాలు పాటించడు. వచ్చే రెండు వారాలు ప్రభుత్వం సామాజిక నిర్బంధంగా నియమా లు తయారుచేయాలి. ప్రజలు పాటించాలి. పాటించనివారికి కఠినమైన ఫైన్‌తో కూడిన శిక్ష ఉండాలి. నిత్యావసర వస్తువు లు, అత్యవసర కేంద్రాలు తప్ప అన్ని వ్యాపారకేంద్రాలు మూసివేయాలి. అన్ని సమూహ కార్యక్రమాలు బందుపెట్టాలి. అవ సరమైతే తప్ప బయటికి వెళ్లకుండా నియంత్రణ చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, అన్ని వర్క్‌ ప్లేసెస్‌లో కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలుచేయాలి. అన్ని నిత్యావసర సరుకుల కోసం ఒక క్లస్టర్‌ విధానం అమలుచేయాలి. హోమ్‌ పార్టీలు, అన్నిరకాల మీటింగులు క్లుప్తంగా చెప్పాలంటే కరోనా కట్టడి చేసే మీటింగులు తప్ప అన్నీ నిలిపివేయాలి. ఈ చర్యల ద్వారా కమ్యూనిటీలో కరోనా వ్యాప్తికాకుండా నిరోధించవచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకుందాం.


హోమ్‌ క్వారంటైన్‌

నిబంధనలు పాటించడమనేది సేఫ్‌ పద్ధతి. కానీ హోం క్వారంటైన్‌ ఉన్నవాళ్లు, వారి కుటుంబసభ్యులతో కూడా దూరంగా ఉండా లి. వారి మధ్య కరోనా నిబంధనలు పాటించాలి. ప్రత్యేక గదికి పరిమితం కావాలి. కలిసి భోజనం, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండొద్దు. ఇంట్లోనే ఐసోలేట్‌ కావాల్సిన అవసరం ఉన్నది. ఇంట్లో 60 ఏండ్లు దాటినవాళ్లు లేకుండా చూస్తే మంచిది. కరోనా పూర్తిగా నెగెటివ్‌ వచ్చేవరకు కుటుంబసభ్యులు మొత్తం ఐసోలేట్‌ అయ్యేటట్లుగా చూడాలి. వారికి నిత్యావసరాలు బయటివ్యక్తుల ద్వారా నాన్‌ కాం టాక్ట్‌ పద్ధతుల్లో అందజేయాలి. హోమ్‌ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక బ్రోచర్‌ అందరికీ అందించాలి. కరోనా ను ఇంటికి కట్టడి చేయగలిగితే మనం విజయం సాధించవచ్చు.  కరోనా యావత్తు ప్రపంచానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనం నెగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 


logo