శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 23, 2020 , 22:42:38

షట్‌డౌన్‌ తెలంగాణ

షట్‌డౌన్‌ తెలంగాణ

పెనుగాలులు వీస్తున్నప్పుడు

పిట్టగూళ్లను 

చెట్లే కాపాడాలి

గద్దల నుంచి పిల్లల్ని తల్లికోడే కాపుకాయాలి

ఎదురుతిరుగుతున్న అడ్డంకుల్ని

అడ్డుకుని నిలవాలి

ముంచుకొచ్చిన యుద్ధాన్ని

తక్షణాయుధాలతోనే ఎదుర్కొనాలి

నిశ్శబ్ద యుద్ధాలకు ధైర్యమే కవచం

ఈ నేలపైన ప్రతి గడ్డిపోచ

జనతా కర్ఫ్యూకు జై కొట్టింది

తల్లివొడిలోని బిడ్డలూ

జై కొట్టారు

ఈ నేల కోసం ఈ దేశం కోసం

సంకల్పాలు చప్పట్లయి మోగాయ్‌

చప్పట్లతో సమరాలు చేయించిన

నిశ్శబ్ద విప్లవకారుడు కేసీఆర్‌

నీ ప్రాణం పౌరసమాజమయ్యాక

కేసీఆర్‌.. నీ వెనుకే మేం

తెలంగాణ అంతా నీవెంటే

వజ్ర సంకల్పాల ముందు

కరోనాలెన్నైనా ఖతమే..

కేసీఆర్‌..

రెక్కాడితే డొక్క నిండని ఆకలి పేగుల్ని చూసినోడు

పేదవాని కంచంలో పిడికెడన్నంగా మారినవాడు

మన సమాజాన్ని మనమే రక్షించుకోవాలన్న

రక్షణ కవచమైనవాడు

నీ వెంటే తెలంగాణ.. నీ మాటే మాకు బాసట

షట్‌డౌన్‌ తెలంగాణ, షట్‌డౌన్‌ తెలంగాణ

మహమ్మారిని పారదోలే మౌనయుద్ధంలో

నువ్వూ నేనూ మనందరం సైనికులమే

ప్రాణం తీసే వైరస్‌కు వ్యతిరేక యుద్ధం

ప్రాణం నిలిపే ప్రయత్నానికి జీవనయుద్ధం...

- జూలూరు గౌరీశంకర్‌, 94401 69896


logo