మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 21, 2020 , 22:32:08

ఆర్థికానికి కరోనా కాటు

ఆర్థికానికి కరోనా కాటు

ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్నదనే అంచనాలు వెలువడుతుండటంతో ఉద్దీపన పథకాలను ఆయా దేశాల్లో ప్రకటించడం మొదలైంది. అమెరికా దాదాపు భారీ ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. యూరప్‌లోని పలుదేశాలు పన్నుల తగ్గింపును ప్రకటించాయి. మార్కెట్‌ను సుస్థిరం చేసేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కోట్లాదిరూపాయలు ఆవిరవుతున్నాయి. ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావం ఉంటుందనేది ఇప్పటికే తెలిసిపోయింది. కొంత అనుభవానికి కూడా వచ్చింది. కానీ ఈ ప్రభావం ఎంతనేది అంచనా వేసే పరిస్థితి లేదు. ఇందుకు కొన్ని నెలలు వేచి చూడాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యానికి దారితీస్తుందనే భయాలు కూడా ఉన్నాయి.

భారత స్థూల దేశీయోత్పత్తిని అంతర్జాతీయంగా పేరుపొందిన రెండు రేటింగ్‌ ఏజెన్సీలు తక్కువగా అంచనా కట్టాయి. భారత ఆర్థిక వృద్ధి రేటు తగ్గడానికి కరోనా వైరస్‌ వ్యాప్తి కారణమని అభిప్రాయపడినాయి. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థ మొత్తంగా మాంద్యంలో కూరుకుపోవచ్చునని మూడీస్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెం దడానికి ముందే ఎంతోకాలంగా భారత ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నది. 2019 సెప్టెంబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 4.7 మాత్రమే. ఇది గత ఏడేండ్లలోనే అత్యంత కనిష్ఠం. భారత్‌ ఈ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడే, చైనా నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తిచెందడం మొదలైంది.ఇప్పటికే ఒక్కోరంగాన్ని కరోనా వైరస్‌ దెబ్బతీయడం మొదలుపెట్టింది. పర్యాటకరంగం వెలవెలబోతున్నది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని ఈ పరిశ్రమ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. హోటల్‌ పరిశ్రమ కూడా తీవ్రం గా నష్టపోతున్నది. వైద్యరంగానికి కూడా చాలామందికి ఉపాధి కల్పించేదిగా గుర్తింపు ఉన్నది. ఈ రంగం కూడా ఒడిదొడుకుల్లో ఉన్నది. ఆయా రంగాల్లో పరిస్థితిపై ఇంకా అధికారిక గణాంకాలు విడుదల కాలేదు. విమానయాన రం గంలో ఇంటర్నేషనల్‌ బుకింగ్స్‌ డబ్భు ఐదు శాతం తగ్గిపోయాయి. దేశీయంగా బుకింగ్స్‌ ఇరువై శాతం తగ్గాయి. ఫిబ్రవరిలనే కార్మికులను తొలిగించడం మొదలైంది. కరోనా వైరస్‌ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వివిధ దేశాల్లో కలిపి మూడు వేల మందిని ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ ఎక్స్‌పీడియా తొలిగించింది.అమెరికాలో దేశవ్యాప్తంగా కార్మికుల తొలిగింపు సాగుతున్నది. 1929 తర్వాత అమెరికాలో ఇంతగా నిరుద్యోగం పెరిగిపోవడం మళ్లీ ఇదే మొదటిసారి. నిరుద్యోగ భృతి కోసం ఓహియోలో 45 వేల మంది, న్యూజెర్సీలో 15 వేల మంది, కనెక్టికట్‌లో ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి కార్మికుల తొలిగింపు పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. స్పెయి న్‌, నార్వే, చైనా, దక్షిణకొరియా, ఇటలీ మొదలైన దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నది. భారత్‌లో కార్మికుల తొలిగింపు వార్తలు విడివిడిగా వెలువడుతున్నాయి. కానీ అన్ని వివరాలను కలుపుకొని అధికారికంగా సమగ్ర సమాచారం అందడం లేదు. ఐటీరంగంలో చేరికలు ముప్ఫై శాతం తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో సినిమాహాళ్లు మొదలైన వాటిని మూసివేశారు. ఐపీఎల్‌ వంటి కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇవన్నీ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

భారత ఆర్థికవ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) మార్చి మొదటివారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం- నిరుద్యోగం 7.78 శాతానికి చేరుకున్నది. ఇది గత నాలుగు నెలల్లోనే అత్యం త ఎక్కువ. కరోనా వైరస్‌ కారణంగానే ఈ పెరుగుదల ఉన్నదని ఈ సంస్థ అభిప్రాయపడ్డది. గత ఎనిమిది నెలల కాలంలో వృద్ధిరేటు అంచనాల్లో తగ్గుదల కనిపిస్తున్నది. వృద్ధి రేటు అంచనాలను సవరించినప్పుడల్లా జీడీపీ తగ్గుదలనే కనిపిస్తున్నది. ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక కూడా కరోనా ప్రభావాన్ని అంచనా వేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల లాక్‌డౌన్‌లు పెరిగి జీడీపీ ఒక శాతం తగ్గుతుందని పేర్కొన్నది. 2020-21లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా అభిప్రాయపడ్డది.ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్నదనే అంచనాలు వెలువడుతుండటంతో ఉద్దీపన పథకాలను ఆయా దేశాల్లో ప్రకటించడం మొదలైంది. అమెరికా దాదాపు భారీ ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. యూరప్‌లోని పలుదేశాలు పన్నుల తగ్గింపును ప్రకటించాయి. మార్కెట్‌ను సుస్థిరం చేసేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కోట్లాదిరూపాయలు ఆవిరవుతున్నాయి. ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావం ఉంటుందనేది ఇప్పటికే తెలిసిపోయింది. కొంత అనుభవానికి కూడా వచ్చింది. కానీ ఈ ప్రభావం ఎంతనేది అంచనా వేసే పరిస్థి తి లేదు. ఇందుకు కొన్ని నెలలు వేచి చూడాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యానికి దారితీస్తుందనే భయాలు కూడా ఉన్నాయి.ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... సార్స్‌ వ్యాప్తి చెందడం వల్ల ఆర్థికవ్యవస్థ 18 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయింది. కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా ఎక్కువే ఉంటుంది. కరోనా వైరస్‌ మొదట్లో చైనాకే పరిమితమైనా ఆ ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కనిపించింది. కానీ ఇప్పు డు ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పటికైతే చైనాలో కరోనా వైరస్‌ రావడం వల్ల కలిగిన నష్టమెంత అనే అంచనాలే ఇంకా కొలిక్కి రాలేదు. ప్రపంచమంతా ఆర్థికంగా అనుసంధానమై ఉన్నది. ప్రపంచంలో చైనా రెండవ పెద్ద ఆర్థికవ్యవస్థ. చైనా ఆర్థికవ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే హుబెయి రాష్ర్టానికి వూహాన్‌ రాజధాని నగరం. చైనా అం తటికీ వూహాన్‌ రవాణా కేంద్రం. కరోనా వైరస్‌ వ్యాపించ డం వల్ల ఈ వూహాన్‌ నగరంలో భారీ ఎత్తున లాక్‌డౌన్‌ను  ప్రకటించవలసి వచ్చింది. చైనా జీడీపీ వృద్ధిరేటులో ఏ మాత్రం హెచ్చుతగ్గులు కనిపించినా ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లో కనిపిస్తుంది. ఇప్పటికే వృద్ధిరేటు తగ్గకుండా భారత్‌ తంటాలు పడుతున్నది. 

ఈ నేపథ్యంలో చైనా, భారత్‌ ప్రభావం ఎంత మేర ఉంటుందనే భయాలు నెలకొన్నాయి. 2002-03లో చైనాలో సార్స్‌ వైరస్‌ వ్యాపించింది. కరోనా వైరస్‌తో పోలిస్తే ఈ సార్స్‌ వల్ల మరణాల శాతం ఎక్కువ. కానీ కరోనా ప్రభావాన్ని మరణాల లెక్కన కాకుం డా ఆర్థికవ్యవస్థపై ప్రభావం ప్రాతిపదికగా అంచనా వేయవలసి ఉంటుంది. సార్స్‌ వల్ల చైనా జీడీపీ వృద్ధిరేటు 1.1 నుంచి 2.6 శాతం మేర దెబ్బతిన్నది. ఈ లెక్కన కరోనా వైరస్‌ ప్రభావం ఎంతనేది అంచనాకు రావలసి ఉన్నది. గత రెండు దశాబ్దాలలో ప్రపంచ ఆర్థికవ్యవస్తతో చైనా అనుసంధానం మరిం త బలపడ్డది. అం దువల్ల కరోనా ప్రభావం సార్స్‌తో పోలిస్తే ఎక్కువే ఉం టుంది. చైనాలోని షెంజెన్‌, షాంఘాయి సంయుక్త స్టాక్‌ మార్కెట్‌ సూచికలు భారీగా పడిపోయాయి. జపాన్‌, అమెరికా యూరప్‌ స్టాక్‌మార్కెట్‌లో కూడా ఇదే పోకడ ఉన్నది. భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ కుదుపులకు గురవుతున్నది. చైనాలో కరోనా వ్యాప్తి చెందడానికి ముందు డబ్భు లక్షల మంది విదేశీ ప్రయాణాలకు సిద్ధపడ్డారు. కానీ వీరిలో నలభై శాతం మంది మాత్రమే ప్రయాణించారు. చైనాలో రవా ణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎగుమతి దిగుమతులు దెబ్బతిన్నాయి. ప్రపంచానికే మానుఫాక్చరింగ్‌ హబ్‌గా చైనా పేరు తెచ్చుకున్నది. అందుకనే ఇక్కడి ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఉన్నది.కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచమంతటా సాగుతున్నది. ఇంకా దీనిని కట్టడి చేయడమే జరుగలేదు. ఎంతమేర విస్తరిస్తుందో, ఎంతకాలం నిలిచి ఉంటుం దో తెలువదు. అందువల్ల కరోనా చూపే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదు. కరోనా వైరస్‌ను పూర్తి కట్టడి చేసిన తర్వాత అంచనాలు మొదలవుతాయి. చైనాలో కొంతమేర కట్టడి చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం చైనా ఆర్థికాభివృద్ధిని కరోనా వైరస్‌ ఒకశాతం మేర దెబ్బకొట్టింది. చైనా ఆర్థికవ్యవస్థ 136 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోయినట్టు ఆర్థికవేత్తల అంచనా. చైనాలో కరోనా వైరస్‌ సోకడం వల్ల, లాక్‌డౌన్‌ల వల్ల మానవులు అనుభవించిన కష్టాలు కూడా చెప్పలేనివే.

(‘ఇండియా టుడే’ సౌజన్యంతో..)


logo