శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Mar 20, 2020 , 23:26:26

సార్క్‌కు సమాధి కట్టిందెవరు?

సార్క్‌కు సమాధి కట్టిందెవరు?

రిటైర్‌మెంట్‌ అనంతరం ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోకుండా, పాలకుల చలువతో, కరుణా కటాక్షాలతో ఏదో ఒక ఉన్నత పదవి పొందడానికి తగిన అర్హతను గొగోయ్‌ చాకచక్యంతో సంపాదించుకున్నాడు. అసోంకు చెందిన గొగోయ్‌ చాలా తెలివికలవాడు. ఆయనకున్న తెలివితేటలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఆ గట్టు మీద ఉంటూనే ఈ గట్టు మీద ఉన్నట్లు కనిపించడంలో ఆయన నేర్పరి అని ఇటీవలి రాజ్యసభ నియామకం నిరూపించింది.

సార్క్‌ (SAARC) సమాధి కట్టిందెవరు? అగ్రరాజ్యాల ఆధిపత్యంలోని ఏ కూటమిలోను చేరకుండా, రెండు కూటముల ప్రచ్ఛన్న యుద్ధానికి దూరంగా ఉంటూ, స్వతంత్ర అలీన దేశా ల ఉద్యమాన్ని ఐరాసకు అనుబంధంగా నిర్వహించిన అపూర్వ వైదేశిక విధానానికి తిలోదకాలు ఇచ్చిన ‘సైలంట్‌ కిల్లర్స్‌' ఎవరు? అలీన ఉద్యమానికి గుట్టు చప్పుడు కాకుండా తిలోదకాలిచ్చి అమెరికన్‌ పాలకుల చంకలో చొచ్చి అక్కడి పార్టీ రాజకీయాల్లో, ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నదెవరు? ప్రస్తుతం ‘సార్క్‌' వార్తల్లో ఉంది కనుక మొదటి ప్రశ్న ముఖ్యమైనది-సార్క్‌ సమాధి కట్టిందెవరు? సమాధులు కట్టడంలో మొగలు చక్రవర్తులు పేరొందారు. సార్క్‌ సమాధి కట్టింది బాబరా? అక్బరా? తన ప్రియసతి ముంతాజ్‌ బేగం సమాధితో తాజ్‌మహల్‌ నిర్మించిన షాజహాన్‌ చక్రవర్తా? మొగ ల్‌ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ కొన్ని వందల ఏండ్ల కిందట అయోధ్యలో నిర్మించిన మసీదు (బాబ్రీ) కూలి నేలమట్టమై ముప్ఫై ఏండ్లయ్యింది. 

అయి నా, ఆ మసీదును ఎవరు కూల్చారో ఇంకా తేలలేదు. ఇందుకు సంబంధించిన కేసులు ఇంకా న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. విచిత్రమైన విషయ మేమంటే ఈ దేశం న్యాయస్థానాల్లో (అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుతో సహా) కొన్ని కేసులు చాలా త్వరగా పరిష్కారమవుతాయి,కొన్ని పరిష్కారం కావు. ఇటీవల భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యునిగా నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు ప్రస్తుతం దేశం లో ఎందరో ఉన్నారు. ఇంకెవరినీ రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా నియమించలేదు. గోగోయ్‌నే రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రపతి అకారణంగా నియమించలేదు. బలమైన కారణాల వల్లనే, బలమైన శక్తుల అండతో గొగోయ్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఆ కారణాలేమిటో, ఆ శక్తులేవో ప్రపంచానికి తెలుసు.

రిటైర్‌మెంట్‌ అనంతరం ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోకుం డా, పాలకుల చలువతో, కరుణా కటాక్షాలతో ఏదో ఒక ఉన్నత పదవి పొందడానికి తగిన అర్హతను గొగోయ్‌ చాకచక్యంతో సంపాదించుకున్నా డు. అసోంకు చెందిన గొగోయ్‌ చాలా తెలివికలవాడు. ఆయనకున్న తెలివి తేటలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఆ గట్టు మీద ఉంటూనే ఈ గట్టు మీద ఉన్నట్లు కనిపించడంలో ఆయన నేర్పరి అని ఇటీవలి రాజ్యసభ నియామకం నిరూపించింది. దీపక్‌ మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, రెండేండ్ల కిందట, కేసుల కేటాయింపు (బెంచీల కు) సరిగ్గా జరుగడం లేదన్న ఆరోపణతో న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, విశ్వసనీయత, గౌరవ మర్యాదలు ముఖ్యమని వాదిస్తూ, నినదిస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసాధారణ రీతిలో సం క్రాంతి వేళ ఢిల్లీలో రోడ్డు మీదికి వచ్చి పత్రికా గోష్టి జరిపారు. ఈ నలుగురిలో గొగోయ్‌ ఒకరు. 

ఈ నలుగురు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగని వాళ్లన్న అభిప్రాయం ప్రపంచానికి ఏర్పడింది, ప్రచారం జరిగింది. తర్వా త గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తి కాగానే (ఆయన అదృష్టం అనాలె) అయోధ్య-బాబ్రీ మసీదు, ఆర్టికల్‌ 370 రద్దు, రాఫెల్‌ విమానాల కొనుగోలు, రాహుల్‌గాంధీ క్షమార్పణ కోరవలసిన ఉదంతం (చౌకీదార్‌ చోర్‌ హై), అసోంలో పౌరుల రిజిష్టర్‌ సమస్య వంటి కేసులన్నీ ఆయన ముం దుకువచ్చాయి. గోగోయ్‌ తన అధికార నివాసంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సుప్రీంకోర్టు మహిళాఉద్యోగి ఒకామె చేసిన ఆరోపణ కేసు కూడా గొగోయ్‌ ముందుకే వచ్చింది. తనపై ఆరోపణ విచారణకు తన జూనియర్‌ న్యాయమూర్తి ఒకాయనతో గొగోయ్‌ నియమించిన కమిటీ పరిశీలన నివేదిక బయటికిరాలేదు. కానీ ‘గొగోయ్‌ త్రేతాయుగపు, రామాయణం నాటి శ్రీరామచంద్రమూర్తి వంటి నిష్కళంకుడని, ఏకపత్నీ వ్రతుడని’ ఆ కమిటీ తేల్చిందని అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, కరోనా వ్యాధి నివారణ చర్యలపై ఒక అద్భుత ప్రసంగం కావిస్తూ కేసీఆర్‌ ‘దడ’ కథ చెప్పి అమిత ఆందోళన వాతావరణంలో సైతం సున్నిత, సునిశిత హాస్యం కురిపించారు. ఇరిగేషన్‌పై మాట్లాడినా, ఇంజినీరింగ్‌పై మాట్లాడినా, కరోనాపై మాట్లాడినా, కాళేశ్వరంపై వివరించినా, పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శలు కురిపించినా, ప్రజా ఉద్యమాలపై భాషించినా, అద్భుతంగా ప్రసంగించడం.. తెలంగాణ ప్రజల తేట తెలుగులో, ఘాటు పదజాలంతో శక్తివంతంగా వివరించడం కేసీఆర్‌ ప్రత్యేకత. 

ఈ మాటలను ప్రపంచం నమ్మిందో లేదో తెలియదు. మొత్తానికి గొగోయ్‌పై పడతి ఫిర్యాదు కేసు ముగిసింది.ఆమెకు మరో ఉద్యోగం లభించిందన్నారు. తాను రిటైర్‌ కాకముందే అయోధ్య కేసు తీర్పు ఇస్తానని గొగోయ్‌ భీష్మించారు. ఈ ప్రతిజ్ఞకు తగినట్లుగా గొగోయ్‌ అయోధ్య కేసు వాదనలను రోజూ విని హడావుడిగా ముగించారు. రిటైర్‌ కాబోతుండగా తీర్పు ఇచ్చారు. అయోధ్య కేసులో, రాఫెల్‌ కేసులో, ఆర్టికల్‌ 370 తదితర కేసుల్లో గొగోయ్‌ బెంచి (ధర్మాసనం!) ఇచ్చిన తీర్పులతో అప్పటికి సుఖాంతమైంది. ఎటువంటి రాజకీయ సంక్షోభాలకు ఆస్కారం లేకుండా గొగోయ్‌ పాలకులకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం విశేషం. ధర్మం గెలిచిందో, అధర్మం గెలిచిందో దేశ ప్రజలే నిర్ణయించాలె.

‘ఇంట్లో ఒకరు పేషెంట్‌ అయితే అందరు సిక్‌ అవుతారు’ అని, ఒక మిత్రుడు-ఆయన అలోపతి డాక్టరైనా వేంకటాచలపతి మీదనే భారమం తా వేసేవాడు-అనేవాడు. వ్యూహన్‌ నుంచి దిగుమతి అయి, అనేక దేశాలకు సోకిన, వేలమంది ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్థులకే కాకుండా దేశంలో అందరికి, ముఖ్యంగా ఎంతో ధైర్యంతో వ్యాధి నివారణ చర్యలు తీసుకోవలసిన పాలకులకు కూడా (తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మినహా) దడ పుట్టించడం విచిత్రం. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, కరోనా వ్యాధి నివారణ చర్యలపై ఒక అద్భుత ప్రసంగం కావిస్తూ కేసీఆర్‌ ‘దడ’ కథ చెప్పి అమిత ఆందోళన వాతావరణంలో సైతం సున్నిత, సునిశిత హాస్యం కురిపించారు. ఇరిగేషన్‌పై మాట్లాడినా, ఇంజినీరింగ్‌పై మాట్లాడినా, కరోనాపై మాట్లాడినా, కాళేశ్వరంపై వివరించినా, పౌరసత్వ సవరణ చట్టంపై విమర్శలు కురిపించినా, ప్రజా ఉద్యమాలపై భాషించినా, అద్భుతంగా ప్రసంగించడం, తెలంగాణ ప్రజల తేట తెలుగులో, ఘాటు పదజాలంతో శక్తివంతంగా వివరించడం కేసీఆర్‌ ప్రత్యేకత. ఆయన చెప్పిన పొట్టి కథ సారాంశం ఇది-అసలు వ్యాధి వల్ల ఇద్దరు ముగ్గురే మరణించారు. 

కానీ ఆ వ్యాధి సోకుతుందన్న ‘దడ’తో దాదాపు యాభై మంది మరణించారు. విపరీతంగా ప్రపంచమంతటా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ దేశ ప్రధాని మోదీజీకి దడ పుట్టించిన (హైబత్‌ పాల్జేసిన) సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ఆరేండ్ల తర్వాత ఇప్పుడు ఆయనకు సార్క్‌ జ్ఞాపకం రావడం. నిజం చెప్పాలంటే స్వతంత్ర భారతదేశపు విశిష్ట, విలక్షణ, దౌత్యనీతి విరాజిత విదేశాంగ విధానాలకు తిలోదకాలిచ్చి, అంతర్జాతీయ రంగంలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసిన ఘనత మోదీజీదే. దక్షిణాసియా దేశాలు ఏడు (భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు) 1985లో వివిధ రంగాల్లో పరస్పర సహకారం ధ్యేయంగా ‘దక్షిణాసి యా ప్రాంతీయ సహకార వ్యవస్థ’ను ఏర్పాటుచేశాయి. నేపాల్‌ రాజధా ని ఖాట్మండులో సార్క్‌ సచివాలయం ఏర్పాటైంది. ఆరోగ్యం తదితర విషయాల కమిటీలు ఏర్పాటైనాయి. తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌కు సార్క్‌లో సభ్యత్వం లభించింది. ఏటా ఒక సభ్యత్వ దేశంలో సార్క్‌ అధినేతల శిఖరాగ్ర సమావేశం జరిగేది. 2016 నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరుగవలసిన 19వ శిఖరాగ్ర సమావేశాన్ని మోదీజీ ఆగ్రహోదగ్రుడై బహిష్కరించారు. అప్పటినుంచి సార్క్‌ శిఖరాగ్రసమావేశాలు జరుగలేదు. సార్క్‌ మూలనపడి నిర్వీర్యమైంది. సార్క్‌కు సమాధి కట్టినంత నష్టం జరిగింది. ఇంతకాలానికి, ఇన్నేండ్ల తర్వాత మోదీజీకి సార్క్‌ జ్ఞాపకం వచ్చింది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటంలో సహకారాన్ని అభ్యర్థిస్తూ మోదీజీ సార్క్‌ దేశాల అధినేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ జరిపారు. అందుకే, దెబ్బకు దయ్యం వదులుతుందని అంటారు! కానీ, ఇది మొండి దయ్యం. సులభంగా, ఒక్క దెబ్బతో ఈ దయ్యం వదలకపోవచ్చు.

మానవాళి అస్తిత్వానికి, ఆరోగ్యానికి కరోనా తరహా విపత్తులు సంభవించడం ఇది మొదటిసారి కాదు. మశూచి, ప్లేగు, కలరా, పోలియో వం టి భయంకర వ్యాధులు గతంలో వివిధ దేశాల్లో సమాజాన్ని వణికించా యి. శాస్త్రీయ పరిశోధనలు, ఆధునిక వైద్య పురోగతి, ఆరోగ్య పరిరక్షణ చర్యలు ఈ భయంకర వ్యాధుల నివారణకే కాదు, శాశ్వత నిర్మూలనకు దోహదపడ్డాయి. కొద్దిరోజుల్లో కరోనా వైరస్‌ నిర్మూలన కూడా జరుగవచ్చు. తర్వాత, భవిష్యత్తులో మరో వైరస్‌ పుట్టి పెరుగదన్న నమ్మకం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనవి శాశ్వత ఆరోగ్య పరిరక్షణ చర్యలు, రోగ నిరోధకశక్తి గణనీయంగా పెరుగడం. ప్రజల జీవన ప్రమాణాలను, సగటు ఆదాయాలను మెరుగుపరిచి, సంక్షేమ పథకాలను సమర్థవంతం గా అమలుజరిపి తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కేసీఆర్‌ ప్రభు త్వం విజ్ఞతతో తీసుకుంటున్న చర్యలు మహత్తరమైనవి. ఈ చర్యలు శాశ్వత ఫలితాలను ఇచ్చి కరోనా వంటి మృత్యుముఖ మహమ్మారులకు గొడ్డలిపెట్టవుతాయి. అత్యంత క్లిష్ట సమయంలో కేసీఆర్‌ భయాందోళనలకు తావులేకుండా ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం, ఆత్మబలం శ్రీరామరక్ష. ప్రగతిపథంలో అపూర్వకాంతి, క్రాంతి దిశలో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణ ప్రజలు ఆత్మహత్య సదృశంగా మొద్దు బండి ప్రయాణాన్ని ఎన్నడూ కోరుకోరు.


logo