శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Mar 20, 2020 , 23:24:01

కరోనాకు కళ్లెం వేద్దామిలా...

కరోనాకు కళ్లెం వేద్దామిలా...

కరోనాకు పారాసెటమాల్‌ వాడాలని చెప్పినా, జనసమ్మర్థం ఎక్కువగా ఉండేవి మూసివేయాలని చెప్పినా కొందరి విమర్శలు సహజమే. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. వైరస్‌ వ్యాపించకుండా కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలుచేసిన తీరు, ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. విమర్శకుల మాటలకన్నా ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇస్తున్నారు.

మొదటి ప్రపంచయుద్ధాన్ని చూసినవారు లేరు. కొద్దిమందికి రెండవ ప్రపంచయుద్ధం జ్ఞాపకా లు ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న మూడవ ప్రపంచ యుద్ధం సరికొత్తది. అన్ని దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నాయి. మిలీనియం తరం ఊహించని యుద్ధం ఇది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం పేరుకు ప్రపం చ యుద్ధాలైనా, నిజానికి ప్రపంచంలోని అన్నిదేశాలు ఆ యుద్ధాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం లో అన్నిదేశాలు బాధిత దేశాలే. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేదు. అన్నిదేశాలు వణికిపోతున్నాయి.

నాగరికతలో,  సాంకేతిక అభివృద్ధిలో ఎంతో ముందున్న దేశాలు కరోనాకు తలవంచాయి. జీవాయుధాల తయారీకి చైనా చేసిన ప్రయోగా ల వల్లనే ఈ వైరస్‌ పుట్టిందనేది ఒక వాదన. చైనా ప్రజలు రకరకాల జీవులను తింటారు, అలా తినడం వల్లనే వైరస్‌ పుట్టిందనేది మరో వాదన. వైరస్‌ ఎలా పుట్టిందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఈ వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంటే, అదే సమయంలో ప్రపంచాన్ని ఓ విషయం ఆశ్చర్యపరుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ కూడా జరుగుతు న్నది. ఇండియాలో ఇంత తక్కువమందికి వైరస్‌ సోకడానికి కారణం ఏమిటా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. మనలో రోగ నిరోధకశక్తి, మన వాతావరణం వంటి కారణా లు ఎన్ని ఉన్నా వైరస్‌ వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతం.

మానవజాతికే ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి మేం ఏకమవుతామని భారతీయులు నిరూపించా రు. ఉగాది ఉత్సవం, భద్రాద్రిలో రామయ్య కళ్యాణం, జగ్‌ నే కీ రాత్‌, చర్చిలో ఆదివారం జరిగే సమావేశాలు అన్నీ నిలిపేశారు. ఆలయాల్లో భక్తుల ప్రవేశాలు నిలిపేయటం హర్షణీయం. కరోనా వైరస్‌ వ్యాపించినప్పుడు చైనా ముందుగానే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని ట్రంప్‌ ఆగ్ర హం వ్యక్తం చేయడంలో న్యాయం ఉన్నది.  కానీ చేయి దాటిపోయింది. ఇతర దేశాలు చేసిన తప్పు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకున్నది. అందుకే వైరస్‌ను కట్టడి చేయగలిగింది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టాలి. వైరస్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సూచనలు, ఆదేశాలు కచ్చితంగా పాటించాలి.

ఈ నెల 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని పిలుపు నిచ్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. ఈ 14 గంటల జనతా కర్ఫ్యూ ఏదో ప్రచారం కోసం ఇచ్చిన పిలుపు కాదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి. వైరస్‌ 12 గంటల పాటు బతుకుతుంది. 14 గం టల పాటు జనం బయటికిరాకుండా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చనేది ప్రధాని మోదీ ఆలోచన.న్యూ మిలీనియం తరానికి కర్ఫ్యూ కొత్త. కొత్త మిలీనియం ప్రారంభమై రెండు దశాబ్దాలు అవుతున్నది. జనతా కర్ఫ్యూ పేరు వినగానే హైదరాబాద్‌లో 4 దశాబ్దాల కిందటి నాటి కర్ఫ్యూ అనుభవాలు గుర్తుకువస్తాయి. రోడ్డు మీద పోలీసుల సంచారం తప్ప జన సంచారం కనిపించదు. ఇప్పుడు మనం కొన్నిగంటల పాటు ఒకచోట ఉండమంటేనే ఆలోచిస్తున్నాం. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఒకటి రెండు రోజులు కాదు వారాల పాటు ఉండేది.

అప్పటి హైదరాబాద్‌ నగరంలో కర్ఫ్యూ భయం వేరు. ఇప్పటి భయం వేరు. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు వేలమందిపై దొంగ దెబ్బ తీస్తున్నది. వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడం కోసం మనకు మనం విధించుకొనే కర్ఫ్యూ ఇది. వైరస్‌ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటు న్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు. కరోనాకు పారాసెటమాల్‌ వాడాలని చెప్పినా, జనసమ్మర్థం ఎక్కువగా ఉండేవి మూసివేయాలని చెప్పినా కొందరి విమర్శలు సహజ మే. రాజకీయాలు ఎప్పుడూ  ఉంటాయి. వైరస్‌ వ్యాపించకుండా కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలుచేసిన తీరు, ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. విమర్శకుల మాటలకన్నా ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇస్తున్నారు.

ఏ సౌకర్యాల్లేని రోజుల్లోనే హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో వారాల పాటు కర్ఫ్యూ జీవితం గడిపారు. ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఒకరోజు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించడం పెద్ద కష్టమేమి కాదు. ఇంట్లోనే సినిమా హాళ్లు ఉన్న రోజులివి. ఒక్కరోజు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండలేమా? ఇదో కొత్త అనుభవం అనుకుందాం, ఇంట్లోనే ఉందాం. కరోనా మహమ్మారిని తరిమికొ డుదాం. ఇది ప్రతీ పౌరుని బాధ్యత.

(వ్యాసకర్త: రాష్ట్ర సమాచార కమిషనర్‌)


logo