గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 20, 2020 , 23:21:52

కఠోర వాస్తవాలు

కఠోర వాస్తవాలు

ఒక్కసారి అందరూ అందరి కోసం ప్రతీ ఒక్కరూ అనే నానుడిని అనుసరించి కరోనా మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా తరిమికొట్టాల్సిన తరుణమిది. లేదంటే ప్రపంచ మానవ ఆరోగ్యంతో పాటుగా ఆర్థికవ్యవస్థ పతనమయ్యే పరిస్థితి దారితీస్తుంది.

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. 173 దేశాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2,18,620 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇందులో వేలాదిమంది పరిస్థితి విషమంగా ఉన్నది. 84,383 మంది ఈ వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఒక్క 18వ తేదీనే 19 వేల కొత్త కేసులు నమోదు కాగా 944 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,943కు చేరుకోవటంతో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నది. కోట్లమంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు 171 కేసులు నమోదయ్యా యి. ముగ్గురు చనిపోయారు. ఈ ముగ్గురు కూడా వృద్ధులు కావటం గమనార్హం. దేశంలో నమోదైన కేసుల్లో 90 శాతానికి పైగా విదేశాల్లో సోకినవే. ఈ వైరస్‌ను ఓ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

వైరస్‌ అనే పదం లాటిన్‌ భాష నుంచి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్‌ అంటే టాక్సిన్‌ లేదా విషమని అర్థం. ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. వైరస్‌లు బ్యాక్టీరియా, ఫంగస్‌ల కంటే శక్తిమంతమైనవి. జలుబు, ఫ్లూ, మశూచి, పోలియో, చికెన్‌పాక్స్‌, డెంగ్యూ, ఎబో లా, జపనీస్‌ ఎన్సెఫబైటిస్‌, సార్స్‌, ఏవియస్‌ ఫ్లూ, రేబీస్‌, ఎయిడ్స్‌, వైరల్‌ హైపటైటిస్‌ వంటివి వైరస్‌తోనే వస్తాయి. కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని పరిశోధకులు ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌ లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. అంతే కాకుండా ఈ వైరస్‌ కొత్తది కావడం మూలానా నోవెల్‌ కరోనా అంటున్నారు. ఈ వైరస్‌ బారిన పడినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా అనారోగ్యవంతమైన వ్యక్తులను తాకినప్పుడు ఒకరినుంచి మరొకరికి వస్తుంది.

శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు 6 రకాల కరోనా వైరస్‌లను కనుగొన్నారు. కొత్తగా వచ్చిన కరోనా వైరస్‌ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మామూలుగా వచ్చే ఫ్లూ కన్నా కరోనా కనీసం పదింతలు ప్రాణాంతకమైంది. ఒక్కసారి ఈ వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించిందం టే ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. మనిషిలో రోగనిరోధక శక్తిని బట్టి వైరస్‌ల విజృంభణ ఉంటుంది. అమెరికన్‌ జర్నల్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రో బయాలజీ అంచనాల ప్రకారం మన భూమి మీద దాదాపుగా 3 లక్షల 22 వేల రకాల వ్యాధికారక వైరస్‌లు ఉన్నాయి.

కరోనా సోకిన వారికి తొలుత జలుబు వస్తుంది. తర్వాత జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత న్యూమోనియా వస్తుంది. అనారోగ్యం మరింత ఎక్కువై చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. వ్యాధి తీవ్రత ఒకరి నుంచి వెయ్యి మందికి సోకే ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణం ప్రభుత్వంతో పాటు  సామాజిక సంస్థలు ప్రజలు వ్యాధి నివారణకు పాటుపడుతూ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రజలంతా స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలి. మిగిలిన (వ్యాధి లక్షణాలు లేనివారు) వారందరూ ప్రతీ గంటకు ఒకసా రి చేతులను శుభ్రపర్చుకుంటూ ఉండాలి.

కరోనా వైరస్‌ నివారణకు మందుల తయారీకి, చికిత్సకు తగిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కృషిజరుగాలి. వ్యాధి వ్యాప్తిచెందకుండా వాక్సిన్‌ను కనుగొనాలి. ప్రపం చ దేశాల అనుభవం చూసినపుడు పేదరికం, నిరక్షరాస్యత కూడా వ్యాధులు ప్రబలడానికి ఒక కారణంగా కనబడుతుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన పేదరిక నిర్మూల న, అక్షరాస్యత వృద్ధిని అన్ని దేశాలు సాధించాలి. తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ నియంత్రణ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ నివార ణే ధ్యేయంగా మన ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యా ప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా సరిపడా నిధులు కేటాయించారు. ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటుచేసింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు మన రాష్ట్రమే ముందు చేపట్టింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా మార్చి 31 వరకు విద్యాసంస్థలను, వ్యాపార వాణిజ్య సంస్థలను, వినోద కేంద్రాలను మూసివేసింది.

ఒక్కసారి అందరూ అందరి కోసం ప్రతీ ఒక్కరూ అనే నానుడిని అనుసరించి కరోనా మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా తరిమికొట్టాల్సిన తరుణమిది. లేదంటే ప్రపంచ మానవ ఆరోగ్యంతో పాటుగా ఆర్థికవ్యవస్థ పతనమయ్యే పరిస్థితి దారితీస్తుంది. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇదిలాగే కొనసాగితే పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉన్నది. ప్రజానీకం అంతా కేసీఆర్‌ సూచిస్తున్న సూచనలు, జాగ్రత్తలు తు.చ. తప్పకుండా పాటిస్తూ కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. 


logo
>>>>>>