బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Mar 19, 2020 , 23:12:43

కండ్లముందు కనిపిస్తున్న ఫలితాలు

కండ్లముందు కనిపిస్తున్న ఫలితాలు

కోటి ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి, కృష్ణా నదుల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రచించారు. అందుకు అనుగుణంగా ప్రతి బడ్జెట్‌లో సింహభాగం నీటి పారుదల రంగానికి కేటాయిస్తూ భారీ ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తూనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయానికి వరప్రదాయిని.

తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయటమే లక్ష్యంగా వ్యవసా య, అనుబంధరంగాలకు 2020-21 సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. రైతులు విత్తనం కొనుగోలు మొదలుకొని పంటకు మద్దతు ధరలు దక్కేవరకు అడుగడుగునా రైతుకు వెన్నుదన్నుగా ఆర్థిక కేటాయింపులు జరిగాయి. రైతుబంధును నిలిపివేస్తారనీ లేదా చిన్న, సన్నకారు రైతులకే పరిమితం చేస్తారన్న విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కేటాయింపులను మరింత పెంచటం విశేషం. కొన్నేండ్లుగా సేవారంగంలో 14.1శాతం వృద్ధిరేటు నమోదైతే పంటల ఉత్పత్తిలో 23.7 శాతం, పాడి పశువుల రంగంలో 17.3 శాతం నమోదవడం ఆయా రంగాల అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్న ది. రైతుబంధు పథకం అమలుతో గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల బాధలు గణనీయంగా తగ్గినట్టు సర్వేలు చెబుతున్నాయి. బీడు భూములు సైతం సాగులోకి రావటం ద్వారా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2018 వాన కాలం నుంచి అమలైన రైతుబంధు పథకం ద్వారా ఆ సంవత్సరం వానకా లంలో 50.88 లక్షల మంది రైతులకు 5257.52 కోట్ల రూపాయలు అం దగా, యాసంగిలో 49.03 లక్షల మంది రైతులకు 5244.26 కోట్లు ప్రభుత్వం అందించింది. 2019 వానకాలంలో 44.92 లక్షల మంది రైతులకు 5456.65 కోట్ల వరి ఖాతాలకు బదిలీ చేసింది.

ప్రతి ఐదువేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఈ నిధుల కింద ఒక్కో రైతు వేదికను రూ.12 లక్షలతో నిర్మిస్తారు. మిషన్‌కాకతీయ పథకంలో 46 వేల పై చిలుకు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రభుత్వం 15 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. చెరువుల మట్టి పోషక ఎరువుగా బీడు భూముల సారం పెంచాయి. ఫలితంగా 35-50 శాతం మేర రసాయన ఎరువుల వాడకం తగ్గింది. 27.6 శాతం ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గాయి. హెక్టారుకు రూ.3700 నుంచి 7500 వరకు పెట్టుబడి ఆదా అయింది. మూడు దశల్లో చెరువుల్లో 20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల సిల్ట్‌ తీసివేయడం వల్ల 198.22 మిలియన్‌ క్యూబిక్‌ మీట ర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లోని రైతుల ఆదాయం 78.5 శాతం పెరిగింది. రబీ వరిలో 19.6 శాతం దిగుబడి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ బడ్జెట్‌లో మార్కెట్‌ జోక్యపు నిధి కింద రూ. వెయ్యి  కోట్లు ప్రతిపాదించటం విశేషం. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరిగిన నేపథ్యంలో వరి, మక్కజొన్న, కందులు రాష్ట్ర అవసరాలకు మించి ఉత్పత్తి అయ్యాయి. సరఫరా పెరిగినప్పుడు ధరలు తగ్గిపోతాయి. ఈ స్థితిని ముందుగానే ఊహించిన ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరిపింది. తద్వారా రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం మద్ధతు ధరకు కొనే భరోసా ఇస్తుం ది. ఇప్పటికే రైతుల నుంచి అదనంగా వరిని సైతం కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రి గతంలో రూ.16,124 కోట్ల రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. 25 వేల రూపాయల లోపు రుణాలున్న రైతుల సంఖ్య రాష్ట్రంలో 5,83,916. వీరందరి రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేందుకు రూ.1,198 కోట్లు ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా రుణాల మాఫీ కోసం ఈ ఏడాదికి రూ. 6,225 కోట్లు కేటాయించారు.కోటి ఎకరాల సాగుకు సాగు నీరందించాలనే లక్ష్యం వైపు పరిగెత్తుతూ నే ఈ లోపు ఉన్న నీటిని ప్రతి నీటి బొట్టు సమర్థంగా వినియోగించుకుం టూ, ఎక్కువ విస్తీర్ణానికి నీటిని అందించే విధంగా ప్రభుత్వం మొదటి నుంచి బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహిస్తున్నది. 80 నుంచి 100 శాతం వరకు సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ను అందిస్తూ ఉద్యాన రైతుల పాలి ట వరమైంది. బడ్జెట్‌లో మైక్రో ఇరిగేషన్‌కు రూ.650 కోట్లు కేటాయించింది. మైక్రో ఇరిగేషన్‌ పరికరాలకు స్ప్రింక్లర్లకు కూడా 2 నుంచి 5 ఎకరాల వరకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఒక రైతుకు గరిష్ఠంగా రూ.5,61,185 సబ్సిడీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మైక్రో ఇరిగేషన్‌ కింద సాగునీటిని పొదుపుగా వాడుకోవచ్చు. ఒక టీఎంసీ నీటితో సాధారణ పద్ధతిలో 6 వేల ఎకరాలకు సాగునీటిని అందించగలిగితే, ఆరు తడి కింద వెయ్యి ఎకరాల్లో పంటలు పండించుకోవచ్చు. 

అదే బిందు, తుంపర సేద్యాలైతే 12 వేల ఎకరాల్లో సాగు చేయవచ్చు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికి 2,48,742 మంది రైతులు 6,60,243 ఎకరా ల్లో బిందు, తుంపర నీటి పద్ధతు లు అమర్చుకొని పంటలు పండిస్తున్నారు. 22.47 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తేవటంలో ప్రభుత్వం సఫలీకృతమైది.మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో రైతుల ఆదాయాలు పెరుగడానికి కారణం పంటలు మాత్రమే కాదు. అనుబంధ రంగాలైన ఉద్యా నం, పశు పోషణ, చేపల పెంపకం కూడా కారణం. 2015-16లో స్థూల విలువల జోడింపు 14.3 ఉంటే, 2019-20 నాటికి 15.5 శాతానికి పెరిగింది. పంటలతో పెరుగుదలకు తోడు, పశు సంవర్ధక రంగంలో వృద్ధి 6.4 నుంచి 7.6 శాతానికి పెరిగింది. పంటల్లో కూడా ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతున్నది. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి, కృష్ణా నదుల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రచించారు. అందుకు అనుగుణంగా ప్రతి బడ్జెట్‌లో సింహభాగం నీటి పారుదల రంగానికి కేటాయిస్తూ భారీ ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తూనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయానికి వరప్రదాయిని. అందుకే మొత్తంగా సాగునీటి రంగానికి 2020-21 బడ్జెట్‌లో 11054 కోట్ల రూపాయలు ప్రతిపాదించి రైతు పక్షపాతి అని చాటుకున్నారు.

(వ్యాసకర్త: అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)


logo
>>>>>>