గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 19, 2020 , 23:10:38

‘కరుణ’లేని కరోనా

‘కరుణ’లేని కరోనా

కానరానీ ‘కరుణ’ లేని

కరోనా భూతం

వ్యూహాన్‌లో పుట్టి

ఊహకందని రీతిలో ప్రపంచాన్ని చుట్టుముట్టి

భయాన్ని నింపిన ‘బయో’ పిశాచం కరోనా.

‘డ్రాగన్‌' కోరల్లోంచి జాలువారిన

కోటి విష సర్పాల గరళం

ఈ రక్కసి కోరల్లో చిక్కి

ప్రపంచ జన జీవనం కకావికలం

వైద్య కోవిధులకు సైతం చిక్కని

ఈ కోవిడ్‌ భూతం మహమ్మారిలా మారి

లక్షలాదిమంది శరీరాల్లో ప్రవేశించి,

వేలాదిమంది ప్రాణాల్ని కబళిస్తున్నది.

కనిపించని ఈ వ్యూహాన్‌ పిశాచం

ప్రపంచమంతా విహారం చేస్తుంటే

ఈ విలయ తాండవంలో చిక్కుకున్న ప్రజలు

ఇల్లు విడిచి స్వేచ్ఛగా

అడుగు బయటపెట్టలేని పరిస్థితి

తల్లి కూడా ప్రేమగా 

కన్నబిడ్డను తాకలేని దయనీయ స్థితి

కోరలు చాచిన కరోనా భూతం

మరెన్ని శరీరాల్ని ఆవహిస్తుందో!

ఇంకెన్ని బలిదానాల్ని కోరుతుందో!!

మేలుకో మిత్రమా..

భయాన్ని వదిలి ధైర్యాన్ని నింపుకో

అపోహల్ని వదిలి నిజాల్ని తెలుసుకో

జాగరూకతతో మెలిగి

నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని కాపాడుకో

ఆరోగ్యమే మహాభాగ్యం

పరిశుభ్రతే నీ మంత్రం

నమస్కారమే మన సంస్కారం...

- డాక్టర్‌ ఆర్‌.రమేశ్‌, 98492 94694


logo
>>>>>>