మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 18, 2020 , 23:22:50

పరిశుభ్రతే రక్షణ

పరిశుభ్రతే రక్షణ

ఎవరికి దగ్గు వచ్చినా చేతిని అడ్డుపెట్టుకొని దగ్గటం, తుమ్ము వస్తే దోసిలిని అడ్డుపెట్టుకొని తుమ్మటం సాధార ణం. అది సభ్యత అని అందరూ భావిస్తున్నారు. ఆ దగ్గినా లేదా తుమ్మినా చేతుల ద్వారా వ్యాధులను ఇతరులకు అం టిస్తున్నామని వారికి తెలియదు. అటువంటి చేతులతో ఏవై నా ముట్టుకున్నా, కరచాలనం చేసినా తుంపర్ల ద్వారా చేతి కి చేరిన సూక్ష్మజీవులు ఇతరులకు చేరే ప్రమాదం ఉన్నది. కాబట్టి దస్తీ, టిష్యూ పేపర్‌ వంటివి చేతిలో పెట్టుకోవాలె. కానీ అవి ప్రతిసారి అందుబాటులో ఉండకపోవచ్చు. కను క దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు భుజానికి మోచేతికి మధ్య భాగంలో అంగి లేదా రవికపై ముక్కును నోటిని ఆనించా లె. ఇవేవీ కుదరకపోతే తలను నేలవైపు వంచి తుమ్మాలి, లేదా దగ్గాలి.


ఇక మాస్కుల గురించి ఆలోచిద్దాం. కోవిడ్‌-19 భయం నేపథ్యంలో పేదలకు మాస్కులను ఉచితంగా పం పిణీ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మాస్కులను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తెచ్చింది. తుంపర్ల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి మాస్కుల వల్ల ప్రాథమిక రక్షణ లభిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో ఆరోగ్యవంతులు మాస్కులు ధరించవలసిన అవ సరం లేదు. జలుబు, దగ్గు ఉన్నవారు మాత్రమే మాస్క్‌ ధరించి వ్యాధి ఇతరులకు సోకకుండా సామాజిక బాధ్యత వహించాలె. జన సమ్మర్థంలో ఉన్నప్పుడు, వాతావరణ కాలుష్యం ఉన్నప్పుడు, శ్వాససంబంధ, అంటువ్యాధులు ప్రబలినప్పుడు మాస్క్‌ ధరించడం అందరికీ మంచిది. అయితే ఈ మాస్కులు మెడికల్‌ షాప్‌లలో, దవాఖానల్లో లభించేవే కానవసరం లేదు. శుభ్రమైన గుడ్డతో కుట్టించుకొని కూడా కట్టుకోవచ్చు. దస్తీని కూడా ముక్కుకు, నోటికి అడ్డంగా కట్టుకోవచ్చు. గుడ్డ మాస్కులు, దస్తీలను ఉతుక్కొ ని మళ్లీ వాడుకోవచ్చు. స్కార్ఫ్‌తో ముక్కుకు నోటికి ముసు గు వలె కట్టుకొనే అలవాటున్న మహిళలు ప్రత్యేకించి మాస్కులు ధరించవలసిన అవసరం లేదు.


కళ్లు, ముక్కులు నలుపరాదు. నోట్లో వేళ్లు పెట్టరాదు. ఏదైనా అపరిశుభ్రమైనది ముట్టుకున్నప్పుడు వెంటనే చేతు లు శుభ్రంగా కడుక్కోవాలె. చేతుల శుభ్రత ఒక అలవాటు గా మార్చుకోవాలె. శుభ్రతనే నేటి ఆరోగ్య సూత్రం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలె.

-  డాక్టర్‌ రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి


logo