సోమవారం 30 మార్చి 2020
Editorial - Mar 17, 2020 , 23:17:11

ఫలించిన ఆర్థికవ్యూహం

ఫలించిన ఆర్థికవ్యూహం

1940 దశకంలో బెంగాల్‌లో తీవ్ర కరువు వచ్చింది. లక్షలాదిమంది ఆకలికి అలమటించి చనిపోయారు. దేశంలో, బెంగాల్లో తిండిగింజలు లేక కాదు. వాటిని కొనుగోలుశక్తి లేకనే ఆకలిచావులు సంభవించాయి. ఆ ఆకలి బాధలను చవిచూసిన అమర్త్యసేన్‌ ప్రజల కొనుగోలుశక్తిని పెంచడమే మంచి ఆర్థికవిధానం అన్నారు. 1991లో ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలను అమలుచేశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా సంపద పెరిగి,పేదరికం తగ్గింది. సంపద ఒనగూరింది కాబట్టి, సంక్షేమ పథకాలను అమలుచేయగలిగామని, ఆకలిచావులు తగ్గాయన్నది కొందరు ఆర్థికవేత్తల వాదన.

సంపద సృష్టించాలంటే వ్యవసాయం, సంక్షేమరంగాల్లో పెట్టుబడులు తగ్గించాలని ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరుగాలని, సేవారంగాలు విస్తరించాలన్నారు. ఇలా రెండురకాల ఆర్థిక నమూనాలు 2014 నాటికి మనముందున్నాయి.కొత్తగా ఏర్పడిన ఏ  దేశానికైనా, రాష్ర్టానికైనా ఏ ఆర్థిక విధానం ఎంచుకోవాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. అమెరికా-రష్యా ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ప్రపంచదేశాలు పెట్టుబడిదారీ-సామ్యవాద ఆర్థికవ్యవస్థలుగా విభజింపబడి ఉన్నాయి. భారత్‌ వీటికి భిన్నంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ను ఎంచుకున్నది. వలసపాలనలో నలిగిపోయిన దేశాన్ని తీర్చిదిద్దడాని కి ఈ నవీన విధానం దోహదపడింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారత్‌లో రెండురకాల ఆర్థికవిధానాలు ప్రాచుర్యం పొందాయి. ఇవి వృద్ధి-పంపిణీ విషయంలో భిన్నమార్గాలను సూచించాయి. ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం ద్వారా ఆర్థికవ్యవస్థ పరిపుష్టం అవుతుందని అమర్త్యసేన్‌ లాంటి సామ్యవాద ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. సంపద పెరుగాలని, దానివల్ల ప్రజలు బాగుపడుతారని అరవింద పనగారియా లాంటి ఆర్థికవేత్తలు నమ్మారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఈ రెండు విధానాల్లో దేన్ని ఎంచుకోవాలనే మీమాంస కేసీఆర్‌ ప్రభుత్వం ముందుంది. అప్పటివరకు తెలంగాణ సమాజం పరాయిపాలనలో బాగా చితికి ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా తెలంగాణను నిలబెట్టడానికి, భవిష్యత్తుకు బాటలు వేయడానికి తగు మార్గాన్ని కేసీఆర్‌ ఎంచుకోవాల్సి వచ్చింది. కాళేశ్వరం ప్రాజె క్టు విషయంలో కేసీఆర్‌ ఓ ఇంజినీర్‌లాగా పనిచేశారన్నది తెలిసిందే. ఆర్థికవిధానాన్ని రూపొందించడంలో కూడా కేసీఆర్‌ ఆరితేరిన ఆర్థిక వేత్త గా సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సంపద పెంచే విధానాలు అనుసరించాలా? పేదల కొనుగోలు శక్తి పెంచాలా? అనే రెండు విధానాలకు మధ్యస్థంగా, ‘సంపద పెంచాలి-పేదలకు పంచాలి’ అనే విధానం తీసుకున్నారు. కేసీఆర్‌ రాష్ట్ర సంపద పెరుగడానికి చర్యలు తీసుకుంటూనే, పేదల కొనుగోలు శక్తి పెంచదలిచారు. ముందుగా ప్రజలకు జీవనభద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. పేదలు కడుపునిండా అన్నం తినడానికి మించిన ప్రగతి కేసీఆర్‌కు మరెందులోనూ కనిపించలేదు.

ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు, సాగునీటికి గోస, మంచినీటికి కటకట, కరెంటు లేక చిమ్మచీకట్లు, అప్పుల ఊబిలో రైతులు, వృత్తు లు కోల్పోయిన బీసీలు, కుదేలైన గ్రామీణ ఆర్థికవ్యవస్థ-ఇదీ తెలంగాణ ఏర్పడిన నాటి దృశ్యం. ఈ దురవస్థ నుంచి తెలంగాణ సమాజాన్ని ముం దు బయటపడేయాలి. అప్పుడే వారు ఉత్పాదక శక్తులుగా మారుతారు అని కేసీఆర్‌ ఆలోచించారు. అందుకే ఆసరా పింఛన్లు మొదటి రోజుల్లోనే నాలుగింతలు పెంచారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయమందించారు. సాగునీటిరంగాన్ని అభివృద్ధి పరిచారు. కుల, చేతివృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. దీంతో ఆత్మహత్యలు తగ్గాయి. ఆకలి చావులు కనుమరుగుయ్యాయి. వలసలు ఆగిపోయాయి. 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయం, పారిశ్రామికరంగం బాగుపడి ఉపాధి అవకాశాలు పెరిగాయి. మంచినీటి కష్టాలు, కరెంటుకోతలు తొలిగిపోయా యి. పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్య ఉచితంగా అందుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మంచి వైద్యం అందుతున్నది. రైతుల, చేనేతకార్మికుల రుణమాఫీ, గృహరుణాల రద్దు, నీటి తీరువా రద్దు, ఆటోలు-ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు, ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ లాంటి నిర్ణయాల వల్ల పేదలకు ఆర్థికభారం తగ్గింది. వీటి వల్ల ఆదా అయిన డబ్బు, ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా చేతికందిన నగదుతో ప్రజల కొనుగోలుశక్తి పెరిగింది. తత్ఫలితంగా తెలంగాణ సంపద పెరిగింది.

పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్య ఉచితంగా అందుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మంచి వైద్యం అందుతున్నది. రైతుల, చేనేతకార్మికుల రుణమాఫీ, గృహరుణాల రద్దు, నీటి తీరువా రద్దు, ఆటోలు-ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు, ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ లాంటి నిర్ణయాల వల్ల పేదలకు ఆర్థికభారం తగ్గింది. వీటి వల్ల ఆదా అయిన డబ్బు, ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా చేతికందిన నగదుతో ప్రజల కొనుగోలుశక్తి పెరిగింది. తత్ఫలితంగా తెలంగాణ సంపద పెరిగింది.

కరెంటు, సాగునీరు పుష్కలంగా అందడం వల్ల రైతులు పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారు. గతంలో యాసంగిలో 17 లక్షల ఎకరాలకు మించి సాగు చేయలేదు. కానీ నేడు 38 లక్షల ఎకరాల్లో వరి సాగవుతు న్నది. 2014-15లో వరి పంట 34,96,087 ఎకరాల్లో సాగయింది. 68,16,662 టన్నుల పంట పండింది. అప్పుడు ఆ పంట విలువ రూ.9,270 కోట్లు. 2019-20 సంవత్సరంలో వరిపంట 78,46,619 ఎకరాల్లో సాగయింది. 2,23,18,576 టన్నుల పంట పండింది. దీని విలువ 40.50 వేల కోట్ల రూపాయలు. అంటే ఐదేండ్లలో వరి ద్వారా రైతుల ఆదాయం 340 శాతం పెరిగింది.  ఈ విధంగా వ్యవసాయానికి పెట్టుబడులు నిరర్థకం అని వాదించే నోళ్ళను మూయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల, ఆత్మహత్యలను, ఆకలి చావులను, వలసలను నిరోధించడం వల్ల మానవ వనరుల ను సద్వినియోగం చేసుకొని, వారిని సంపద సృష్టించే శక్తులుగా మార్చగలిగింది. తెలంగాణ ఏర్పడకముందు పేదల ఇండ్లల్లో ఒక్క రూపాయి బిళ్ల కూడా దొరుకకపోయేది. కానీ నేడు ఏ ఇంటికి పోయిచూసినా కొన్ని వేల రూపాయలుంటున్నాయి. ఆసరా పింఛన్ల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్రంలో 42,470 రూపాయల నగదు పేదలకు అందింది. 2020-21లో మరో 11,758 కోట్ల రూపాయల నగదు అందుతుంది. అంటే మొత్తం 54,228 కోట్ల రూపాయలు.

రైతుబంధు ద్వారా 2019-20 ఆర్థికసంవత్సరం గడిచేసరికి 22,4 80 కోట్ల నగదు రైతులకు అందింది. 2020-21లో మరో 14 వేల కోట్లు వెళ్తాయి. అంటే మొత్తం 36,480 కోట్ల రూపాయలు. ఒక్కో రైతు జేబులో పడేది 72 వేల రూపాయలు. రెండు విడుతల రుణమాఫీ ద్వారా ప్రభుత్వం 42,214 కోట్లను రైతులకు ఆదా చేస్తున్నది. ఇవే కాకుండా కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్స్‌, వ్యవసాయ సబ్సిడీలు, రైతుబీ మా, ఎక్స్‌గ్రేషియాలు, పునరావాస పథకాలు, గొర్రెలు, చేపలు,  బర్రెల పంపిణీ తదితర కార్యక్రమాల ద్వారా పేదలకు డబ్బు వచ్చింది. ఈ విధంగా పేదల కొనుగోలుశక్తిని ప్రభుత్వం పెంచింది. సంపద పెంచే పారిశ్రామికీకరణ, పట్టణీకరణను కూడా ప్రభుత్వం పట్టించుకున్నది.‘సంపద పెంచాలి-పేదలకు పంచాలి’ అనే విధానం ఫలితంగా పేదల బతుకులు బాగుపడటమే కాదు, రాష్ట్ర సంపద పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్నప్పటికీ, పలు రాష్ర్టాల్లో తిరోగమన వృద్ధిరేటు ఉన్నప్పటికీ తెలంగాణ రెవెన్యూ వృద్ధిలో ముందుకుపోతున్నది. జీఎస్‌డీ పీ, తలసరి ఆదాయం, రెవెన్యూ వృద్ధిరేటు, పెట్టుబడి వ్యయం, తలసరి విద్యుత్‌ వినియోగం లాంటి అంశాలను ప్రగతి సూచికలుగా గుర్తిస్తారు. ఈ అన్నింటిలో తెలంగాణ అగ్రగామిగా నిలువడం కేసీఆర్‌ వ్యూహాత్మక ఆర్థిక విధాన ఫలితమే.

తెలంగాణ ఆరేండ్లలో సాధించిన ప్రగతి ఫలితంగా తననుతాను తీర్చిదిద్దుకోవడమే కాదు, దేశాభివృద్ధికి ఆర్థికచేయూతను అందిస్తున్నది. 2014 నుంచి 2019 మార్చి వరకు తెలంగాణ  ప్రజలు పన్నుల ద్వారా 2,72,926 కోట్ల రూపాయలను కేంద్రానికి పంపారు. 1,12,854 కోట్ల రూపాయలు డెవల్యూషన్‌ ద్వారా మళ్లీ మన రాష్ర్టానికి వచ్చాయి.  అం టే నికరంగా మన రాష్ట్ర ప్రజలు గడిచిన ఐదేండ్లలో 1,60,072 కోట్లను దేశాభివృద్ధికి నిధిగా అందించారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగిస్తుందా? అనే ప్రశ్నలకు జవాబు చెప్పడమే కాదు, తెలంగాణ నమూనానే ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలువడం అసాధారణం.రెండవ ప్రపంచయుద్ధంలో బూడిదగా మారిన దుస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలాగా జవసత్వాలు ప్రోగు చేసుకొని శరవేగంగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన జపాన్‌ దేశ ప్రస్థానం లాంటిదే తెలంగాణ అనుభవం. దాదాపు ఆరు దశాబ్దాల పరాయిపాలన తెలంగాణ ప్రాంతాన్ని నిజంగానే బూడిద చేసింది. అలా అంపశయ్యపై ఉన్న తెలంగాణ శరవేగంగా కోలుకొని, లేచి పరిగెత్తి, నేడు దేశంలోనే పటిష్టమైన ఆర్థికశక్తిగా మారింది. దీనికి వ్యూహకర్త, కార్యకర్త కేసీఆర్‌ మాత్రమే.


logo