మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 17, 2020 , 23:15:04

కరోనా క్యా హోనా?

కరోనా క్యా హోనా?

కరోనా భయం కళ్ళల్లో 

ముఖంలో ప్రస్ఫుటమవుతోంది

మనుషులను భౌతికంగా 

విడదీసిన కరోనా

మనసులను దగ్గర చేసింది

కరోనా యుద్ధానికి

ప్రపంచమంతా బలైనా

ఖండాంతరాలను కలిపింది

అణ్వాయుధాలు వదలకున్నా

మనిషి జాతి మీద కరోనా

జీవాయుధాలను విసిరింది

మనిషి పుట్టుక 

ఏ దేశంలోనైనా 

చావు మాత్రం అందరిదీ అయ్యింది

మానవజాతి మనుగడకు 

ప్రమాద ఘంటికలు మ్రోగించిన కరోనా

జాతి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తోంది

చైనాలో పుట్టిన కరోనా

అగ్రరాజ్యాల వెన్నులో

వణుకు పుట్టిస్తోంది

బాల్కనీల నుంచి చావుకేకలు

వీధుల్లో పారాడుతున్నాయి

నిరంతరం ప్రవహించే జనప్రవాహం

నయాగారా మంచు జలపాతంలా

స్థంభించిపోయింది

గాలికి పెట్టిన దీపాల్లా

మనుషుల ప్రాణాలు 

గాల్లో కలిసిపోతున్నాయి

జాతి మొత్తం ఏకమై 

కరోనా భూతాన్ని తరిమేద్దాం! 

స్వచ్ఛ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ

వైరస్‌ లేని సమాజాన్ని నిర్మిద్దాం!! 

- వారణాశి భానుమూర్తిరావు


logo
>>>>>>